
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఎగ్జిక్యూటివ్ కేడర్ కేటగిరిలో.. మేనేజ్మెంట్ ట్రైనీ (ఈ అండ్ ఎం) పోస్టు లు 42, మేనేజ్మెంట్ ట్రైనీ (సిస్టమ్స్) పోస్టులు 7, నాన్ ఎగ్జి క్యూటివ్ కేడర్ కేటగిరీలో జూనియర్ మైనింగ్ మేనేజర్ ట్రైనీ పోస్టులు 100, అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ (మెకానిక ల్) పోస్టులు 9, అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ (ఎలక్ట్రికల్) పోస్టులు 24, ఫిట్టర్ ట్రైనీ పోస్టులు 47, ఎలక్ట్రిషన్ ట్రైనీ పోస్టులు 98 అందులో ఉన్నాయి.
ఈనెల 15 నుంచి వచ్చే నెల 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నా రు. గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లు కాగా, ఎస్సీ, ఎస్టీ , బీసీ, వికలాంగ అభ్యర్థులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు వర్తించనుంది. పూర్తి వివరాల కోసం సంస్థ వెబ్‌సైట్ www.scclmines.com ను సంప్రదించాలని సంస్థ యాజమాన్యం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment