సాక్షి, హైదరాబాద్: వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించి అర్హత పరీక్షల నిర్వహణ తేదీలను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ వెల్లడించింది. నోటిఫికేషన్‌లో ప్రకటించిన తేదీలకు అనుగుణంగా పరీక్షలను నిర్వహించనున్నట్టు కమిషన్ స్పష్టం చేసింది.
ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పశుసంవర్థక శాఖ పరిధిలో 185 వీఏఎస్(వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్), ఉద్యాన వన శాఖ పరిధిలో 22 హెచ్‌ఓ పోస్టులు, రవాణా శాఖలో 113 ఏఎంవీఐ పోస్టులకు ఈనెల మార్చి, వచ్చే నెల ఏప్రిల్‌లో పరీక్షలు జరగనున్నాయి. వీఏఎస్ ఉద్యోగాలకు రెండ్రోజుల పాటు పరీక్షలు నిర్వహించనుండగా.. హెచ్‌ఓ, ఏఎంవీఐ పోస్టులకు ఒక రోజు ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు జరుగుతాయి. మరిన్ని వివరాలకు కమిషన్ వెబ్‌సైట్‌ను చూడాలని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment