సీడ్యాక్, నోయిడాలో ప్రాజెక్ట్‌ మేనేజర్ పోస్టులు | CDAC Recruitment 2021: Project Engineer, Project Manager Vacancies | Sakshi
Sakshi News home page

సీడ్యాక్, నోయిడాలో 72 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు

Published Wed, Feb 17 2021 6:44 PM | Last Updated on Wed, Feb 17 2021 7:16 PM

CDAC Recruitment 2021: Project Engineer, Project Manager Vacancies - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌(సీ–డ్యాక్‌), నోయిడా యూనిట్‌.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 72
» పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ మేనేజర్‌–08, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌–64, 
» ప్రాజెక్ట్‌ మేనేజర్‌: విభాగాలు–ఖాళీలు: సాఫ్ట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌–04, సొల్యూషన్‌ ఆర్కిటెక్ట్‌–04. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎంసీఏ/ ఎంఈ/ఎంటెక్‌/ పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

» ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌: విభాగాలు–ఖాళీలు: సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ డెవలపర్‌–10,సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌–50, మొబైల్‌ అప్లికేషన్‌ డెవలపర్‌–04. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ఎంసీఏ/పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ(కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ/కంప్యూటర్‌ అప్లికేషన్స్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు: 31.12.2020 నాటికి 37 ఏళ్లు మించకూడదు.
» ఎంపిక విధానం: పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
» ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 23.02.2021
» వెబ్‌సైట్‌: https://www.cdac.in/

సీఎస్‌ఐఆర్‌–సీడీఆర్‌ఐలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఖాళీలు
లక్నోలోని సీఎస్‌ఐఆర్‌–సెంట్రల్‌ డ్రగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీడీఆర్‌ఐ) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 07
» పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌–01, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌–04, సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌–02.
» ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: అర్హత: లైఫ్‌ సైన్సెస్‌ సబ్జెక్టుల్లో బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 50 ఏళ్లు మించకూడదు. స్టయిపండ్‌: నెలకు రూ.20,000 + హెచఆర్‌ఏ చెల్లిస్తారు.

» ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ, ఎంఫార్మసీ, ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 35 ఏళ్లు మించకూడదు. వేతనం ప్రాజెక్ట్‌ అసోసియేట్‌–1కు నెలకు రూ.31,000, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌–2: నెలకు రూ.35,000 చెల్లిస్తారు.
» సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌: అర్హత: బీసీఏ, బీటెక్‌(కంప్యూటర్‌ సైన్స్‌) ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 50 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.18,000 + హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.
» ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. 
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
» ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 19.02.2021
» వెబ్‌సైట్‌: https://cdri.res.in/

సీఎన్‌సీఐ, కోల్‌కతాలో వివిధ ఖాళీలు
కోల్‌కతాలోని భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన చిత్తరంజన్‌ నేషనల్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఎన్‌సీఐ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 152
» పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్‌ గ్రేడ్‌–1–14, స్పెషలిస్ట్‌ గ్రేడ్‌–2– 32, స్టాఫ్‌ నర్సు–106.
» స్పెషలిస్ట్‌ గ్రేడ్‌–1: వయసు: 50 ఏళ్లు మించకూడదు.
» స్పెషలిస్ట్‌ గ్రేడ్‌–2: వయసు: 45 ఏళ్లు మించకూడదు.

» స్టాఫ్‌ నర్సు: వయసు: 35 ఏళ్లు మించకూడదు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
» ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 19.02.2021
» ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 18.03.2021
» వెబ్‌సైట్‌: https://www.cnci.ac.in/

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement