న్యూఢిల్లీలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్)కు చెందిన స్పోర్ట్స్ బ్రాంచ్ ట్రెయినింగ్ డైరెక్టరేట్.. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 06
► పోస్టుల వివరాలు: ఫిజియోథెరపిస్ట్–05, న్యూట్రిషనిస్ట్–01.
ఫిజియోథెరపిస్ట్:
అర్హత: ఫిజియోథెరపీలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 40ఏళ్లు మించకుండా ఉండాలి. వేతనం నెలకు రూ.50,000 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తారు.
న్యూట్రిషనిస్ట్:
అర్హత: న్యూట్రిషన్‌లో ఎమ్మెస్సీ కోర్సు/న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్‌లో పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 50ఏళ్లు మించకుండా ఉండాలి. వేతనం నెలకు రూ.50,000 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తారు.
► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
► ఇంటర్వ్యూ వేదిక: ట్రెయినింగ్ డైరెక్టరేట్, సీఆర్‌పీఎఫ్, ఈస్ట్ బ్లాక్–10, లెవల్–7, సెక్టర్–1, ఆర్.కె.పురం, న్యూఢిల్లీ–110066 చిరునామాకు పంపించాలి.
► దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఈమెయిల్: igtrg@crpf.gov.in
► దరఖాస్తులకు చివరి తేది: 25.06.2021
► వెబ్‌సైట్: https://crpf.gov.in
అసోం రైఫిల్స్‌లో 131 పోస్టులు
భారత ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖకు చెందిన ఇంఫాల్ ప్రధాన కేంద్రంగా ఉన్న అసోం రైఫిల్స్.. 2021 సంవత్సరానికి మెరిటోరియస్ స్పోర్ట్స్‌పర్సన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది. దీనిద్వారా రైఫిల్ మెన్/రైఫిల్ ఉమెన్ జనరల్ డ్యూటీ పోస్టులు భర్తీ చేస్తారు.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 26.06.2021
► ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 26.07.2021
► పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.assamrifles.gov.in
Comments
Please login to add a commentAdd a comment