Andhra Pradesh Nurse Notification 2021 : ANU Teaching Posts, APVVP Job Openings - Sakshi
Sakshi News home page

ఏఎన్‌యూలో టీచింగ్, నాన్‌టీచింగ్‌ పోస్టులు

Published Tue, Aug 10 2021 7:08 PM | Last Updated on Tue, Aug 10 2021 8:18 PM

Andhra Pradesh Jobs: ANU Teaching Posts, APVVP, Nursing Vacancies - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుంటూరులో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ).. టీచింగ్, నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 07

► పోస్టుల వివరాలు: టీచింగ్‌ పోస్టులు–03, నాన్‌ టీచింగ్‌ పోస్టులు–04.

► టీచింగ్‌ పోస్టులు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(రూరల్‌ డెవలప్‌మెంట్, కంప్యూటర్‌ సైన్స్‌) అసోసియేట్‌ ప్రొఫెసర్‌(ఇంగ్లిష్‌). అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్‌/స్లెట్‌/సెట్‌ అర్హత ఉండాలి. ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

► నాన్‌ టీచింగ్‌ పోస్టులు: స్వీపర్, క్లీనర్, యుటెన్సిల్‌ క్లీనర్, మార్కర్‌. అర్హత: మార్కర్‌ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. మిగతా పోస్టులకు సంబంధిత పని అనుభవంతోపాటు చదవడం, రాయడం వచ్చి ఉండాలి. వేతనం: నెలకు రూ.13,000 నుంచి రూ.40,270 చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 20.08.2021

► వెబ్‌సైట్‌: https://www.nagarjunauniversity.ac.in/indexanu.html


ఏపీవీవీపీ, అనంతపురంలో వివిధ ఖాళీలు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ఏపీ వైద్య విధాన  పరిషత్‌ ఆసుపత్రుల సమన్వయ అధికారి కార్యాల యం.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 09

► పోస్టుల వివరాలు: సైకియాట్రిస్ట్‌/ఎంబీబీఎస్‌ డాక్టర్‌–01, నర్సు(ఏఎన్‌ఎం)–02, కౌన్సిలర్‌– 03, డేటాఎంట్రీ ఆపరేటర్‌–01, వార్డ్‌బాయ్‌–02.

► అర్హత: పోస్టుల్ని అనుసరించి ఎనిమిది, పదో తరగతి/ఇంటర్మీడియట్‌ (ఎంపీహెచ్‌(ఎఫ్‌) ట్రెయినింగ్‌), గ్రాడ్యుయేషన్, పీజీ డిగ్రీ/ డిప్లొమా(సైకియాట్రీ మెడిసిన్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో నైపుణ్యం ఉండాలి.

► వయసు: 42 ఏళ్లు మించకూడదు. 

► ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, సీనియారిటీ ప్రాతిపదికన ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిస్ట్రిక్‌ కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌(ఏపీవీవీపీ), గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ క్యాంపస్, అనంతపురం చిరునామాకు పంపించాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 10.08.2021

► వెబ్‌సైట్‌: ananthapuramu.ap.gov.in

గవర్నమెంట్‌ నర్సింగ్‌ కాలేజ్, నెల్లూరులో 13 ఖాళీలు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఏపీ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజ్‌.. అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 13

► పోస్టుల వివరాలు: వాచ్‌మెన్‌–02, క్లీనర్‌/వ్యాన్‌ అటెండెంట్‌–01, ఆయాలు–01, స్వీపర్లు–01, ల్యాబ్‌ అటెండెంట్లు–01, కుక్స్‌–03, కిచెన్‌ బాయ్‌/టేబుల్‌ బాయ్‌–02, తోటీ/స్వీపర్‌–02.

► అర్హత: ల్యాబ్‌ అటెండెంట్‌ పోస్టుకు పదో తరగతి, మిగతా అన్ని పోస్టులకు ఐదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

► వయసు: 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. జీతం: నెలకు రూ.12,000 చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, సీనియారిటీ ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆఫీస్‌ ఆఫ్‌ ది ప్రిన్సిపల్, గవర్నమెంట్‌ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్, నెల్లూరు, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా చిరునామాకు పంపించాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 16.08.2021

► వెబ్‌సైట్‌: spsnellore.ap.gov.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement