సాక్షి, ఆదిలాబాద్: ఏడాది క్రితం ప్రతీ పంచాయతీకో కార్యదర్శిని నియమించిన ప్రభుత్వం.. ఇప్పుడు ప్రతీ పంచాయతీకో పారిశుధ్య కార్మికుడిని నియమించాలని నిర్ణయించింది. పల్లెలు ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రతీ గ్రామంలో కార్మికులు తప్పనిసరని భావిస్తోంది. 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం ద్వారా పారిశుధ్య కార్మికుల పనిని దగ్గరుండి పరిశీలించిన సర్కారు.. కార్మికుల భర్తీకి శ్రీకారం చుట్టింది. కొత్తగా ఉద్యోగంలోకి తీసుకున్న వారిని అన్ని రకాల పనులకు వినియోగిచడంతోపాటు జీతం కూడా ఎక్కువగా ఇవ్వనున్నారు.
కాగా, కార్మికులను ఔట్‌సోర్సింగ్ పద్ధతిన నియమించుకోవాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులు ఖాళీల వివరాలను కార్యదర్శుల నుంచి సేకరిస్తున్నారు. ఏ పంచాయతీకి ఎంత మంది కావాలి.. ప్రస్తుతం ఉన్న వారి సంఖ్యతోపాటు ఆసక్తిగా ఉన్న వారి వివరాలను పంపాలని ఆదేశించారు. ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులతో పాటు కొత్తగా చేరే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, పుల్‌టైం వర్కర్లకు నెలకు రూ.8,500 చొప్పున వేతనం ఇవ్వాలని అధికారులకు జారీ చేసిన ఉత్తర్వుల్లో (జీవో 51) స్పష్టం చేసింది.
వివరాలు సేకరిస్తున్న కార్యదర్శులు
పాత గ్రామ పంచాయతీలతోపాటు కొత్త వాటిలోనూ సరిపడా కార్మికులు లేరు. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ప్రతీ 500 మంది జనాభాకు ఒక స్వీపర్.. ఒక పంప్ ఆపరేటర్ పని చేసేవారు. గ్రామంలో 2 వేల జనాభా ఉంటే అక్కడ ఇద్దరు స్వీపర్లు, ఒక ఆపరేటర్ ఉండాలి. ఐదువేల జనాభా దాటిన పంచాయతీల్లో ముగ్గురు లేదా నలుగురు స్వీపర్లు పారిశుధ్య పనులు చేపట్టేవారు. ఇక మేజర్ గ్రామ పంచాయతీల్లో అధిక సంఖ్యలో ఉండాల్సి ఉంటుంది.
అయితే తాజాగా విడుదలైన ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పారిశుధ్య కార్మికుల జనాభా ప్రతిపాదికన పంచాయతీలో ఎంత మంది కార్మికులు అవసరం.. ప్రస్తుతం రెగ్యులర్‌గా ఎంత మంది కార్మికులుగా పని చేస్తున్నారు. కార్మికులుగా పని చేసేందుకు ఎవరెవరూ ఆసక్తిగా ఉన్నారనే వివరాలతో కూడిన నివేదికలను కార్యదర్శులు సిద్ధం చేస్తున్నారు. కార్యదర్శులు సేకరించిన వివరాల ప్రకారం జిల్లాలో ఎంత మంది కార్మికులను కొత్తగా ఉద్యోగంలోకి తీసుకోనున్నారో వెల్లడి కానుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లాలో మరికొందరికీ అవకాశం
గత నెలలో పల్లెల్లో చేపట్టిన ప్రణాళిక ద్వారా పారిశుధ్య కార్మికుల సంఖ్య స్పష్టంగా తెలిసింది. గ్రామాల్లో పారిశుధ్యం, పరిశుభ్రత పనులతోపాటు ఇతర పనుల్లో కీలకంగా వ్యవహరించే కార్మికుల సంఖ్య తక్కువగా ఉండడంతో కొత్త వారిని తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో జిల్లాలో మరికొంత మంది పారిశుధ్య కార్మికులుగా ఉద్యోగంలోకి చేరనున్నారు. అయితే జిల్లాలోని 17 గ్రామీణ మండలాల పరిధిలో మొత్తం 467 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 598 మంది పారిశుధ్య కార్మికులు ప్రస్తుతం పనులు చేస్తున్నారు. జనాభా ప్రతిపాదికన వీరిని నియమించి వివిధ రకాల పనులు చేపట్టాల్సి ఉన్నా.. 500 నుంచి 2 వేల జనాభా గల గ్రామాల్లో కూడా ఒకరిద్దరితో సర్దుకుపోతున్నారే తప్పా.. కొత్త నియామకాలపై ఇంత వరకు దృష్టి సారించలేదు.
దీంతో పారిశుధ్య కార్మికులు దాదాపు సగం పంచాయతీల్లో రెగ్యులర్‌గా కొనసాగుతుండగా, మరికొన్ని జీపీల్లో రోజు వారీ కూలీగా పని చేస్తున్నారు. అయితే రోజు వారి కూలీ రూ.250 నుంచి రూ.300 చెల్లించనుండగా, రెగ్యులర్‌గా కొనసాగుతున్న వారికి ఒక్కో పంచాయతీలో ఒక్కో విధంగా రూ.4 వేల నుంచి రూ.7వేల వరకు వేతనం చెల్లిస్తున్నారు. ప్రభుత్వం కార్మికులపై దృష్టి పెట్టడంతో ఇక నుంచి అందరికీ
సమానంగా వేతనం అందనుంది.
ఆదిలాబాద్‌అర్బన్: ఏడాది క్రితం ప్రతీ పంచాయతీకో కార్యదర్శిని నియమించిన ప్రభుత్వం.. ఇప్పుడు ప్రతీ పంచాయతీకో పారిశుధ్య కార్మికుడిని నియమించాలని నిర్ణయించింది. పల్లెలు ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రతీ గ్రామంలో కార్మికులు తప్పనిసరని భావిస్తోంది. 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం ద్వారా పారిశుధ్య కార్మికుల పనిని దగ్గరుండి పరిశీలించిన సర్కారు.. కార్మికుల భర్తీకి శ్రీకారం చుట్టింది. కొత్తగా ఉద్యోగంలోకి తీసుకున్న వారిని అన్ని రకాల పనులకు వినియోగిచడంతోపాటు జీతం కూడా ఎక్కువగా ఇవ్వనున్నారు.
కాగా, కార్మికులను ఔట్‌సోర్సింగ్ పద్ధతిన నియమించుకోవాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులు ఖాళీల వివరాలను కార్యదర్శుల నుంచి సేకరిస్తున్నారు. ఏ పంచాయతీకి ఎంత మంది కావాలి.. ప్రస్తుతం ఉన్న వారి సంఖ్యతోపాటు ఆసక్తిగా ఉన్న వారి వివరాలను పంపాలని ఆదేశించారు. ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులతో పాటు కొత్తగా చేరే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, పుల్‌టైం వర్కర్లకు నెలకు రూ.8,500 చొప్పున వేతనం ఇవ్వాలని అధికారులకు జారీ చేసిన ఉత్తర్వుల్లో (జీవో 51) స్పష్టం చేసింది.
వివరాలు సేకరిస్తున్న కార్యదర్శులు
పాత గ్రామ పంచాయతీలతోపాటు కొత్త వాటిలోనూ సరిపడా కార్మికులు లేరు. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ప్రతీ 500 మంది జనాభాకు ఒక స్వీపర్.. ఒక పంప్ ఆపరేటర్ పని చేసేవారు. గ్రామంలో 2 వేల జనాభా ఉంటే అక్కడ ఇద్దరు స్వీపర్లు, ఒక ఆపరేటర్ ఉండాలి. ఐదువేల జనాభా దాటిన పంచాయతీల్లో ముగ్గురు లేదా నలుగురు స్వీపర్లు పారిశుధ్య పనులు చేపట్టేవారు. ఇక మేజర్ గ్రామ పంచాయతీల్లో అధిక సంఖ్యలో ఉండాల్సి ఉంటుంది.
అయితే తాజాగా విడుదలైన ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పారిశుధ్య కార్మికుల జనాభా ప్రతిపాదికన పంచాయతీలో ఎంత మంది కార్మికులు అవసరం.. ప్రస్తుతం రెగ్యులర్‌గా ఎంత మంది కార్మికులుగా పని చేస్తున్నారు. కార్మికులుగా పని చేసేందుకు ఎవరెవరూ ఆసక్తిగా ఉన్నారనే వివరాలతో కూడిన నివేదికలను కార్యదర్శులు సిద్ధం చేస్తున్నారు. కార్యదర్శులు సేకరించిన వివరాల ప్రకారం జిల్లాలో ఎంత మంది కార్మికులను కొత్తగా ఉద్యోగంలోకి తీసుకోనున్నారో వెల్లడి కానుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లాలో మరికొందరికీ అవకాశం
గత నెలలో పల్లెల్లో చేపట్టిన ప్రణాళిక ద్వారా పారిశుధ్య కార్మికుల సంఖ్య స్పష్టంగా తెలిసింది. గ్రామాల్లో పారిశుధ్యం, పరిశుభ్రత పనులతోపాటు ఇతర పనుల్లో కీలకంగా వ్యవహరించే కార్మికుల సంఖ్య తక్కువగా ఉండడంతో కొత్త వారిని తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో జిల్లాలో మరికొంత మంది పారిశుధ్య కార్మికులుగా ఉద్యోగంలోకి చేరనున్నారు. అయితే జిల్లాలోని 17 గ్రామీణ మండలాల పరిధిలో మొత్తం 467 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
వీటి పరిధిలో 598 మంది పారిశుధ్య కార్మికులు ప్రస్తుతం పనులు చేస్తున్నారు. జనాభా ప్రతిపాదికన వీరిని నియమించి వివిధ రకాల పనులు చేపట్టాల్సి ఉన్నా.. 500 నుంచి 2 వేల జనాభా గల గ్రామాల్లో కూడా ఒకరిద్దరితో సర్దుకుపోతున్నారే తప్పా.. కొత్త నియామకాలపై ఇంత వరకు దృష్టి సారించలేదు. దీంతో పారిశుధ్య కార్మికులు దాదాపు సగం పంచాయతీల్లో రెగ్యులర్‌గా కొనసాగుతుండగా, మరికొన్ని జీపీల్లో రోజు వారీ కూలీగా పని చేస్తున్నారు. అయితే రోజు వారి కూలీ రూ.250 నుంచి రూ.300 చెల్లించనుండగా, రెగ్యులర్‌గా కొనసాగుతున్న వారికి ఒక్కో పంచాయతీలో ఒక్కో విధంగా రూ.4 వేల నుంచి రూ.7వేల వరకు వేతనం చెల్లిస్తున్నారు. ప్రభుత్వం కార్మికులపై దృష్టి పెట్టడంతో ఇక నుంచి అందరికీ సమానంగా వేతనం అందనుంది.
ఖాళీల వివరాలు పంపించాం
గ్రామ పంచాయతీలో పని చేస్తున్న కార్మికుల సంఖ్యతోపాటు ఖాళీల వివరాలను అధికారులకు పంపించాం. కొత్తగా నియామకానికి సంబంధించిన ఆదేశాలు జిల్లా ఉన్నతాధికారుల నుంచి మాకు రాలేదు. ఆదేశాలు రాగానే కొత్త వారిని తీసుకునేందుకు చర్యలు చేపడుతాం.
– లక్ష్మీనారాయణ, సాంగిడి పంచాయతీ కార్యదర్శి, బేల
Comments
Please login to add a commentAdd a comment