panchayat department
-
పంచాయతీలలో కార్మికుల భర్తీకి కసరత్తు
సాక్షి, ఆదిలాబాద్: ఏడాది క్రితం ప్రతీ పంచాయతీకో కార్యదర్శిని నియమించిన ప్రభుత్వం.. ఇప్పుడు ప్రతీ పంచాయతీకో పారిశుధ్య కార్మికుడిని నియమించాలని నిర్ణయించింది. పల్లెలు ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రతీ గ్రామంలో కార్మికులు తప్పనిసరని భావిస్తోంది. 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం ద్వారా పారిశుధ్య కార్మికుల పనిని దగ్గరుండి పరిశీలించిన సర్కారు.. కార్మికుల భర్తీకి శ్రీకారం చుట్టింది. కొత్తగా ఉద్యోగంలోకి తీసుకున్న వారిని అన్ని రకాల పనులకు వినియోగిచడంతోపాటు జీతం కూడా ఎక్కువగా ఇవ్వనున్నారు. కాగా, కార్మికులను ఔట్సోర్సింగ్ పద్ధతిన నియమించుకోవాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులు ఖాళీల వివరాలను కార్యదర్శుల నుంచి సేకరిస్తున్నారు. ఏ పంచాయతీకి ఎంత మంది కావాలి.. ప్రస్తుతం ఉన్న వారి సంఖ్యతోపాటు ఆసక్తిగా ఉన్న వారి వివరాలను పంపాలని ఆదేశించారు. ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులతో పాటు కొత్తగా చేరే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, పుల్టైం వర్కర్లకు నెలకు రూ.8,500 చొప్పున వేతనం ఇవ్వాలని అధికారులకు జారీ చేసిన ఉత్తర్వుల్లో (జీవో 51) స్పష్టం చేసింది. వివరాలు సేకరిస్తున్న కార్యదర్శులు పాత గ్రామ పంచాయతీలతోపాటు కొత్త వాటిలోనూ సరిపడా కార్మికులు లేరు. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ప్రతీ 500 మంది జనాభాకు ఒక స్వీపర్.. ఒక పంప్ ఆపరేటర్ పని చేసేవారు. గ్రామంలో 2 వేల జనాభా ఉంటే అక్కడ ఇద్దరు స్వీపర్లు, ఒక ఆపరేటర్ ఉండాలి. ఐదువేల జనాభా దాటిన పంచాయతీల్లో ముగ్గురు లేదా నలుగురు స్వీపర్లు పారిశుధ్య పనులు చేపట్టేవారు. ఇక మేజర్ గ్రామ పంచాయతీల్లో అధిక సంఖ్యలో ఉండాల్సి ఉంటుంది. అయితే తాజాగా విడుదలైన ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పారిశుధ్య కార్మికుల జనాభా ప్రతిపాదికన పంచాయతీలో ఎంత మంది కార్మికులు అవసరం.. ప్రస్తుతం రెగ్యులర్‌గా ఎంత మంది కార్మికులుగా పని చేస్తున్నారు. కార్మికులుగా పని చేసేందుకు ఎవరెవరూ ఆసక్తిగా ఉన్నారనే వివరాలతో కూడిన నివేదికలను కార్యదర్శులు సిద్ధం చేస్తున్నారు. కార్యదర్శులు సేకరించిన వివరాల ప్రకారం జిల్లాలో ఎంత మంది కార్మికులను కొత్తగా ఉద్యోగంలోకి తీసుకోనున్నారో వెల్లడి కానుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో మరికొందరికీ అవకాశం గత నెలలో పల్లెల్లో చేపట్టిన ప్రణాళిక ద్వారా పారిశుధ్య కార్మికుల సంఖ్య స్పష్టంగా తెలిసింది. గ్రామాల్లో పారిశుధ్యం, పరిశుభ్రత పనులతోపాటు ఇతర పనుల్లో కీలకంగా వ్యవహరించే కార్మికుల సంఖ్య తక్కువగా ఉండడంతో కొత్త వారిని తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో జిల్లాలో మరికొంత మంది పారిశుధ్య కార్మికులుగా ఉద్యోగంలోకి చేరనున్నారు. అయితే జిల్లాలోని 17 గ్రామీణ మండలాల పరిధిలో మొత్తం 467 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 598 మంది పారిశుధ్య కార్మికులు ప్రస్తుతం పనులు చేస్తున్నారు. జనాభా ప్రతిపాదికన వీరిని నియమించి వివిధ రకాల పనులు చేపట్టాల్సి ఉన్నా.. 500 నుంచి 2 వేల జనాభా గల గ్రామాల్లో కూడా ఒకరిద్దరితో సర్దుకుపోతున్నారే తప్పా.. కొత్త నియామకాలపై ఇంత వరకు దృష్టి సారించలేదు. దీంతో పారిశుధ్య కార్మికులు దాదాపు సగం పంచాయతీల్లో రెగ్యులర్‌గా కొనసాగుతుండగా, మరికొన్ని జీపీల్లో రోజు వారీ కూలీగా పని చేస్తున్నారు. అయితే రోజు వారి కూలీ రూ.250 నుంచి రూ.300 చెల్లించనుండగా, రెగ్యులర్‌గా కొనసాగుతున్న వారికి ఒక్కో పంచాయతీలో ఒక్కో విధంగా రూ.4 వేల నుంచి రూ.7వేల వరకు వేతనం చెల్లిస్తున్నారు. ప్రభుత్వం కార్మికులపై దృష్టి పెట్టడంతో ఇక నుంచి అందరికీ సమానంగా వేతనం అందనుంది. ఆదిలాబాద్‌అర్బన్: ఏడాది క్రితం ప్రతీ పంచాయతీకో కార్యదర్శిని నియమించిన ప్రభుత్వం.. ఇప్పుడు ప్రతీ పంచాయతీకో పారిశుధ్య కార్మికుడిని నియమించాలని నిర్ణయించింది. పల్లెలు ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రతీ గ్రామంలో కార్మికులు తప్పనిసరని భావిస్తోంది. 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం ద్వారా పారిశుధ్య కార్మికుల పనిని దగ్గరుండి పరిశీలించిన సర్కారు.. కార్మికుల భర్తీకి శ్రీకారం చుట్టింది. కొత్తగా ఉద్యోగంలోకి తీసుకున్న వారిని అన్ని రకాల పనులకు వినియోగిచడంతోపాటు జీతం కూడా ఎక్కువగా ఇవ్వనున్నారు. కాగా, కార్మికులను ఔట్సోర్సింగ్ పద్ధతిన నియమించుకోవాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులు ఖాళీల వివరాలను కార్యదర్శుల నుంచి సేకరిస్తున్నారు. ఏ పంచాయతీకి ఎంత మంది కావాలి.. ప్రస్తుతం ఉన్న వారి సంఖ్యతోపాటు ఆసక్తిగా ఉన్న వారి వివరాలను పంపాలని ఆదేశించారు. ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులతో పాటు కొత్తగా చేరే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, పుల్టైం వర్కర్లకు నెలకు రూ.8,500 చొప్పున వేతనం ఇవ్వాలని అధికారులకు జారీ చేసిన ఉత్తర్వుల్లో (జీవో 51) స్పష్టం చేసింది. వివరాలు సేకరిస్తున్న కార్యదర్శులు పాత గ్రామ పంచాయతీలతోపాటు కొత్త వాటిలోనూ సరిపడా కార్మికులు లేరు. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ప్రతీ 500 మంది జనాభాకు ఒక స్వీపర్.. ఒక పంప్ ఆపరేటర్ పని చేసేవారు. గ్రామంలో 2 వేల జనాభా ఉంటే అక్కడ ఇద్దరు స్వీపర్లు, ఒక ఆపరేటర్ ఉండాలి. ఐదువేల జనాభా దాటిన పంచాయతీల్లో ముగ్గురు లేదా నలుగురు స్వీపర్లు పారిశుధ్య పనులు చేపట్టేవారు. ఇక మేజర్ గ్రామ పంచాయతీల్లో అధిక సంఖ్యలో ఉండాల్సి ఉంటుంది. అయితే తాజాగా విడుదలైన ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పారిశుధ్య కార్మికుల జనాభా ప్రతిపాదికన పంచాయతీలో ఎంత మంది కార్మికులు అవసరం.. ప్రస్తుతం రెగ్యులర్‌గా ఎంత మంది కార్మికులుగా పని చేస్తున్నారు. కార్మికులుగా పని చేసేందుకు ఎవరెవరూ ఆసక్తిగా ఉన్నారనే వివరాలతో కూడిన నివేదికలను కార్యదర్శులు సిద్ధం చేస్తున్నారు. కార్యదర్శులు సేకరించిన వివరాల ప్రకారం జిల్లాలో ఎంత మంది కార్మికులను కొత్తగా ఉద్యోగంలోకి తీసుకోనున్నారో వెల్లడి కానుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో మరికొందరికీ అవకాశం గత నెలలో పల్లెల్లో చేపట్టిన ప్రణాళిక ద్వారా పారిశుధ్య కార్మికుల సంఖ్య స్పష్టంగా తెలిసింది. గ్రామాల్లో పారిశుధ్యం, పరిశుభ్రత పనులతోపాటు ఇతర పనుల్లో కీలకంగా వ్యవహరించే కార్మికుల సంఖ్య తక్కువగా ఉండడంతో కొత్త వారిని తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో జిల్లాలో మరికొంత మంది పారిశుధ్య కార్మికులుగా ఉద్యోగంలోకి చేరనున్నారు. అయితే జిల్లాలోని 17 గ్రామీణ మండలాల పరిధిలో మొత్తం 467 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 598 మంది పారిశుధ్య కార్మికులు ప్రస్తుతం పనులు చేస్తున్నారు. జనాభా ప్రతిపాదికన వీరిని నియమించి వివిధ రకాల పనులు చేపట్టాల్సి ఉన్నా.. 500 నుంచి 2 వేల జనాభా గల గ్రామాల్లో కూడా ఒకరిద్దరితో సర్దుకుపోతున్నారే తప్పా.. కొత్త నియామకాలపై ఇంత వరకు దృష్టి సారించలేదు. దీంతో పారిశుధ్య కార్మికులు దాదాపు సగం పంచాయతీల్లో రెగ్యులర్‌గా కొనసాగుతుండగా, మరికొన్ని జీపీల్లో రోజు వారీ కూలీగా పని చేస్తున్నారు. అయితే రోజు వారి కూలీ రూ.250 నుంచి రూ.300 చెల్లించనుండగా, రెగ్యులర్‌గా కొనసాగుతున్న వారికి ఒక్కో పంచాయతీలో ఒక్కో విధంగా రూ.4 వేల నుంచి రూ.7వేల వరకు వేతనం చెల్లిస్తున్నారు. ప్రభుత్వం కార్మికులపై దృష్టి పెట్టడంతో ఇక నుంచి అందరికీ సమానంగా వేతనం అందనుంది. ఖాళీల వివరాలు పంపించాం గ్రామ పంచాయతీలో పని చేస్తున్న కార్మికుల సంఖ్యతోపాటు ఖాళీల వివరాలను అధికారులకు పంపించాం. కొత్తగా నియామకానికి సంబంధించిన ఆదేశాలు జిల్లా ఉన్నతాధికారుల నుంచి మాకు రాలేదు. ఆదేశాలు రాగానే కొత్త వారిని తీసుకునేందుకు చర్యలు చేపడుతాం. – లక్ష్మీనారాయణ, సాంగిడి పంచాయతీ కార్యదర్శి, బేల -
పంచాయతీలదే పూర్తి బాధ్యత
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హరితహారం కార్యక్రమ సంపూర్ణ బాధ్యతలను గ్రామ పంచాయతీలకే అప్పగించనున్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో భాగంగా హరితహారం కార్యక్రమం కింద నర్సరీల్లో మొక్కలను పెంచడం, వాటిని నాటించడం, సంరక్షించడం అంతా పంచాయతీలకే ప్రభుత్వం అప్పగించింది. గతంలో హరితహారం కార్యక్రమాన్ని పంచాయతీల ఆధ్వర్యంలోనే నిర్వహించినా వివిధ ప్రభుత్వ శాఖలకు ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించడంతో అందరి సహకారంతోనే హరితహారం కార్యక్రమం కొనసాగింది. అయితే ఇప్పటి నుంచి పంచాయతీలే హరితహారానికి సంబంధించిన అన్ని బాధ్యతలను నిర్వహించాల్సి ఉంది. దీంతో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో నర్సరీలను ఏర్పాటు చేశారు. గతంలో రెండు మూడు గ్రామాలకు ఒక నర్సరీని నిర్వహించారు. ఉపాధి హామీ పథకం, సామాజిక అటవీ శాఖలు వేరు వేరుగా నర్సరీలను నిర్వహించి గ్రామాలకు అవసరమైన మొక్కలను సరఫరా చేశారు. అయితే సవరించిన పంచాయతీరాజ్ చట్టంలో హరితహారం కార్యక్రమ బాధ్యతలను ప్రభుత్వం పంచాయతీలకు అప్పగించడంతో ఏ గ్రామ పంచాయతీ పరిధిలో ఆ గ్రామ పంచాయతీ నర్సరీలను నిర్వహించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో 656 గ్రామ పంచాయతీలు ఉండగా అంతే మొత్తంలో నర్సరీలను ఏర్పాటు చేశారు. వచ్చే జూన్, జూలై మాసాల్లో హరితహా రం ఐదవ విడత కార్యక్రమాన్ని నిర్వహించనుండటంతో ఈ కార్యక్రమం పూర్తిగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఆధ్వర్యంలోనే సాగనుంది. ఇప్పటి వరకు నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ, అటవీశాఖ, ఎక్సైజ్ శాఖ, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖలు హరితహారం బాధ్యతలను నిర్వహించాయి. ఇక నుంచి గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలోనే అన్ని శాఖలు మొక్కలు నాటే కార్యక్రమంలో పాలుపంచుకోనున్నాయి. గ్రామానికి 40 వేల మొక్కలు.. హరితహారం కార్యక్రమం కింద ప్రతి గ్రామంలో ఏటా 40 వేల మొక్కలను నాటించాలని ప్రభుత్వం గతంలోనే లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే అన్ని ప్రభుత్వ శాఖలకు భాగస్వామ్యం కల్పించడంతో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను నాటించారు. ఇప్పుడు మాత్రం పంచాయతీల ప్రతినిధులు ఈ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంది. కాగా భౌగోళికంగా చిన్నగా ఉన్న పంచాయతీల్లో ఇంత మొత్తంలో మొక్కలు నాటడం సాధ్యం అవుతుందా లేదా అనే సంశయం వ్యక్తం అవుతోంది. మేజర్ పంచాయతీలు, భూ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న గ్రామాలలో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను నాటించడం సాధ్యం అవుతుంది. చిన్న పంచాయతీల్లో మాత్రం భారీ లక్ష్యం సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయిన తరుణంలో కొత్త పాలక వర్గాలు కొలువుదీరగా వాటికి ప్రభుత్వం పెద్ద బాధ్యతనే అప్పగించిందని అంటున్నారు. -
పంచాయతీ పనుల్లో ఉపాధ్యాయులు
మంచాల : పంచాయతీ కార్మికుల సమ్మెతో గ్రామ ప్రత్యేకాధికారులకు కష్టాలు వచ్చాయి. కార్మికులు చేయాల్సిన పనులు అధికారులే చేయాల్సి వస్తోంది. మంచాల గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారిగా స్థానిక బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నారాయణరెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. పాడైపోయిన బోరుబావులను మరమ్మతు చేయడానికి కూలీలు కూడా ముందుకు రావడం లేదు. దీంతో నారాయణరెడ్డి తన తోటి ఉపాధ్యాయుడు సలీం, పంచాయతీ కార్యదర్శి కృష్ణ సహకారంతో సంపులో నుంచి మోటారును బయటకు తీసి మరమ్మతులు చేశారు. ఇలా అదనపు బాధ్యతలు ఉపాధ్యాయులకు భారంగా మారాయి. -
అనుమతి లేకపోతే... కూల్చివేతే!
అక్రమ నిర్మాణాలపై జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే అక్రమ లేఅవుట్లను భూస్థాపితం చేస్తున్న పంచాయతీ శాఖ.. తాజాగా అనుమతిలేని కట్టడాలపై చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిటెన్ డెవలప్మెంట్ అథారిటీ) పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలోనే 289 నిర్మాణ సంస్థలు, కంపెనీలకు తాఖీదులిచ్చింది. రెండువారాల్లో సంజాయిషీ ఇవ్వకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. వీటిని పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఆయా సంస్థలకు నేరుగా లేదా రిజిస్టర్ పోస్టుల ద్వారా పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. అక్రమ కట్టడాలపై చర్యలకు యంత్రాంగం నిర్ణయం * 289 నిర్మాణ సంస్థలకు నోటీసులు జారీ * రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని స్పష్టీకరణ * లేకుంటే కూల్చివేతలు తప్పవని హెచ్చరిక సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో 23 మండలాల్లో హెచ్ఎండీఏ పరిధి ఉంది. ఈ మండలాల పరిధిలో నిర్మాణ అనుమతులు హెచ్ఎండీఏ నుంచి తీసుకోవాల్సి ఉంది. జీ ప్లస్-1 వరకు గ్రామ పంచాయతీ అనుమతులు తీసుకున్నప్పటికీ.. ఆపైన నిర్మాణాలకు హెచ్ఎండీఏ అనుమతి తప్పనిసరి. అయితే పలు నిర్మాణాలు ఎలాంటి అనుమతులు లేకుండానే వె లిశాయి. అటు పంచాయతీ, ఇటు హెచ్ఎండీఏ అనుమతులు తీసుకోకుండానే బహుల అంతస్థులు కట్టుకోవడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది. ఇలాంటి నిర్మాణాలు ఎక్కువగా శంషాబాద్, మేడ్చల్, ఘట్కేసర్, శంకర్పల్లి జోన్ల పరిధిలో ఉన్నాయి. ఇందులో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా గృహ నిర్మాణ సముదాయాలు చేపట్టాయి. వీటిలో గుర్తించిన అక్రమ నిర్మాణాల్లో 289 నిర్మాణాలకు సంబంధించి పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలోనూ వీరికి హెచ్ఎండీఏ అధికారులు నోటీసులిచ్చారు. అయితే వాటిపై ఎలాంటి స్పందన లేకపోవడం.. తాజాగా అక్రమ లేఅవుట్ల వ్యవహారాన్ని తిరగతోడుతున్న నేపథ్యంలో కలెక్టర్ ప్రస్తుతం నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. నోటీసుల ప్రక్రియ పూర్తయిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని ఆయన నిర్ణయించారు. గడువు దాటితే ‘కూల్చివేతే’.. అనుమతిలేని నిర్మాణాలకు సంబంధించిన ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేసిన పంచాయతీ శాఖ.. రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని తెలిపింది. ఇందులో కొందరు అనుమతులున్నట్లు చెబుతుండడంతో ఆయా అనుమతి పత్రాలను కూడా సమర్పించాలని స్పష్టం చేసింది. అదేవిధంగా అక్రమ లేఅవుట్లలో గృహ సముదాయాలు నిర్మించిన సంస్థలపై పంచాయతీ శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. లేఅవుట్లలో రోడ్లు, మరుగు వ్యవస్థ, లైటింగ్ సదుపాయాలు, అందుకు ఆయా శాఖ అనుమతులు కూడా సమర్పించాలంటూ నియమం పెట్టింది. మొత్తంగా రెండు వారాల్లో సంస్థలు సంతృప్తికరమైన వివరణ ఇవ్వకుంటే కూల్చివేతకు వెనకాడేది లేదని పంచాయతీ శాఖ అధికారులు చెబుతున్నారు. -
‘పంచాయతీ’ పునర్విభజన
♦ కొత్తగా రెండు డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ♦ ఐదు రెవెన్యూ డివిజన్ల సంఖ్యకు సమానంగా పంచాయతీశాఖలో మార్పులు ♦ {పభుత్వానికి నివేదించిన జిల్లా యంత్రాంగం సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో గ్రామ పంచాయతీ వ్యవస్థను మరింత పటిష్టపర్చేందుకు యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. పంచాయతీ చట్టాల అమలు, ఆదాయ, వ్యయాలపై పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలంటే పర్యవేక్షణ పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే ఇప్పుడున్న పంచాయతీ డివిజన్ల సంఖ్య తక్కువగా ఉండడం.. గ్రామాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో పనిభారం అధికమవుతోంది. ఫలితంగా నామమాత్రపు పర్యవేక్షణతోనే కాలం వెల్లదీయాల్సివస్తోంది. దీన్ని అధిగమించాలంటే ప్రస్తుతం ఉన్న పంచాయతీ డివిజన్ల సంఖ్యను పెంచాలని భావిస్తోంది. జిల్లాలో ఉన్న రెవెన్యూ డివిజన్లకు సమానంగా పంచాయతీ డివిజన్లు హెచ్చించాలంటూ ప్రభుత్వానికి జిల్లా యంత్రాం గం నివేదించింది. జిల్లాలో మూడు పంచాయతీ డివిజన్లున్నాయి. తూర్పు డివిజన్, చేవెళ్ల, వికారాబాద్ డివిజన్ల పరిధిలో మొత్తం 688 గ్రామ పంచాయతీలున్నాయి. అయితే మూడు డివిజన్లున్నప్పటికీ.. నగర శివారు పంచాయతీల్లో ఆదాయ, వ్యయాల అంశం భారీగా ఉంది. అదేవిధంగా పాలనాపరమైన అంశాల పర్యవేక్షణలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు విలువైన పంచాయతీ భూముల ఆక్రమణలు.. అందుకు సంబంధించి కేసులు.. విచారణ.. తదితర అంశాలు ఇప్పుడున్న సిబ్బందికి తలకుమించిన భారమవుతున్నాయి. దీంతో ఏళ్ల తరబడిగా సమస్యలు పేరుకుపోతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించి.. పాలనను గాడిలో పెట్టాలంటే కొత్తగా మరో రెండు డివిజన్లు అవసరమని యంత్రాంగం నిర్ణయించింది. ప్రస్తుతం జిల్లాలో ఐదు రెవెన్యూ డివిజన్లుండగా.. వాటికి అనుగుణంగా పంచాయతీ డివిజన్ల ప్రతిపాదనలు రూపొందించింది. నియోజకవర్గాల వారీగా విభజన.. జిల్లా యంత్రాంగం కొత్తగా తయారుచేసిన పంచాయతీ డివిజన్ల ప్రణాళికలో నియోజకవర్గాల ప్రాధాన్యతలో విభజన చేశారు. అదేవిధంగా పనిఒత్తిడిని సైతం పరిగణిస్తూ నగర శివారు మండలాల్లో తక్కువ పంచాయతీలను డివిజన్లకు కేటాయించారు. గ్రామీణ ప్రాంత డివిజన్లకు ఎక్కువ పంచాయతీలను పేర్కొంటూ పంచాయతీ డివిజన్లను విభజించారు. సరూర్‌నగర్ డివిజన్‌కు ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లోని 7 మండలాలను కేటాయించారు. మల్కాజిగిరి డివిజన్‌కు కుత్బుల్లాపూర్, మేడ్చల్ నియోజకవర్గాల్లోని ఐదు మండలాలు, రాజేంద్రనగర్ డివిజన్‌కు అదే నియోజకవర్గంలోని రెండు మండలాలు, చేవెళ్ల డివిజన్‌కు చేవెళ్ల, పరిగి నియోజకవర్గాల్లోని 10 మండలాలు, వికారాబాద్ డివిజన్లో వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లోని 9 మండలాలను చేర్చారు. ఈ మేరకు జిల్లా పంచాయతీ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. త్వరలో ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించనున్నట్లు ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. -
మూకుమ్మడిగా బదిలీ వేటు!
ఒకేసారి 18 మంది పంచాయతీ విస్తరణాధికారుల బదిలీ 16 మందికి ఈ నెల 20వ తేదీతో ఉత్తర్వులు మరో ఇద్దరికి నవంబర్ 22వ తేదీతో ఉత్తర్వులు పరిపాలనాపరమైన కారణాలని అధికారుల సాకు ఒకేసారి ఇంతమందికా అని ఉద్యోగుల విస్మయం ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి ఫలితమేనని ఆరోపణలు శ్రీకాకుళం: సాధారణ బదిలీలు జరిగి నెల రోజులైనా కాకముందే జిల్లా పంచాయతీ శాఖలో పరిపాలన అవసరాల ముసుగులో మరోమారు బదిలీలకు తెర తీశారు. ఆ సాకుతో 16 మందిపై బదిలీ వేటు వేయడం ఆ శాఖలో కలకలం రేపుతోంది. ఈ నెల 20వ తేదీతో జారీ ఉత్తర్వులతో జిల్లాలో 16 మంది పంచాయతీ విస్తరణాధికారులు బదిలీ కాగా, గత నెల అంటే నవంబర్ 22వ తేదీతో ఇప్పుడు జారీ చేసిన ఉత్తర్వులతో మరో ఇద్దరిని బదిలీ చేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే హుద్‌హుద్ తుపాను కారణంగా పంచాయతీ విస్తరణాధికారులు బిజీ అయ్యారని, అందుకే అప్పట్లో బదిలీలు చేయలేదని సాకులు చెబుతున్నారు. వాస్తవానికి పరిపాలనా పరమైన కారణాలతో బదిలీ చేయాలంటే సదరు ఉద్యోగి ఇప్పటికే ఒకటి రెండు షోకాజ్ నోటీసులు వంటివి అందుకొని ఉండాలి. విధులకు తరచూ డుమ్మాకొడుతున్నట్టు గానీ అవినీతి ఆరోపణలపై ఫిర్యాదులు గానీ ఉండాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు బదిలీ అయిన ఉద్యోగులు నెల రోజుల వ్యవధిలో ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం లేదు. కానీ పరిపాలనా పరమైన కారణాల పేరుతోనే వారిని బదిలీ చేశారు. అది కూడా సుదూర ప్రాంతాలకు పంపించారు. ఈ బదిలీల వెనుక ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన అనుచరుల ఒత్తిడి మేరకు ఆ నాయకుడు జిల్లా ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో ఈ అకాల బదిలీలు జరిగాయని పలువురు బహిరంగంగానే చెబుతున్నారు. జలుమూరు పంచాయతీ విస్తరణాధికారిని సీతంపేటకు, ఎల్.ఎన్.పేట విస్తరణాధికారిని నందిగాంకు, సీతంపేట విస్తరణాధికారిని రేగిడికి, అక్కడి విస్తరణాధికారిని కవిటికి, కవిటి విస్తరణాధికారిని ఎల్.ఎన్.పేటకు, సంతబొమ్మాళి విస్తరణాధికారిని వీరఘట్టానికి, వంగర విస్తరణాధికారిని పొందూరుకు, కంచిలి విస్తరణాధికారిని జలుమూరుకు బదిలీ చేసినట్లు తెలిసింది. వీరందరికీ ఈ నెల 20వ తేదీతో ఉత్తర్వులు ఇచ్చారు. ఇక ఆమదాలవలస పంచాయతీ విస్తరణాధికారిని శ్రీకాకుళం రూరల్ మండలానికి, శ్రీకాకుళం రూరల్ మండల పంచాయతీ విస్తరణాధికారిని పాలకొండకు బదిలీ చేశారు. వీరిద్దరికీ మాత్రం గత నెల 22వ తేదీతో ఉత్తర్వులు రావడం గమనార్హం. దీనిపై జిల్లా పంచాయతీ అధికారిణి సెల్వియాను ఫోన్లో వివరణ కోరగా పరిపాలనా పరమైన బదిలీలు ఎప్పుడైనా చేయవచ్చన్నారు. ఇటువంటి బదిలీలకు ప్రభుత్వ ఆంక్షలు వర్తించవన్నారు. -
‘తమ్ముళ్ల’ స్వలాభం.. అభివృద్ధికి శాపం
పదేళ్ల పాటు అధికారం లేకపోవడం వల్ల తెలుగు తమ్ముళ్లు ప్రస్తుతం ఎక్కడెక్కడ ఆదాయ మార్గాలు ఉన్నాయన్న విషయంపైనే దృష్టి సారించారు. ఈ క్రమంలో అన్ని అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారు. ప్రతి పనీ తమకే కావాలనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. జిల్లాలో పాడైన రోడ్ల స్థానంలో కొత్తవి నిర్మించేందుకు 151 పనులు మంజూరయ్యాయి. ఇందులో అధికారులు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా 76 రోడ్డు నిర్మాణాలు నిలిచిపోయాయి. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో 2,664 రోడ్డు పనుల కోసం రూ.493.06 కోట్లు మంజూరు చేశారు. ఇందులో కూడా 1,583 పనులు ప్రాంరభానికి నోచుకోలేదు. హెచ్ఎల్సీ, యాడికి కెనాల్, మిడ్‌పెన్నార్ సౌత్ కెనాల్ (అనంతపురం) ఆధునికీకరణ పనుల కోసం రూ.1,084.83 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులు కూడా నత్తను తలపిస్తుండడంతో తుంగభద్ర జలాశయం నుంచి వస్తున్న నీటిలో చాలావరకు ఇంకి పోయే ప్రమాదం ఏర్పడింది. జిల్లాలో 2014-15 విద్యా సంవత్సరానికి గానూ సర్వశిక్షా అభియాన్ ద్వారా 716 అదనపు తరగతి గదులు మంజూరయ్యాయి. ఒక్కో గదికి గ్రామీణ ప్రాంతాల్లోనైతే రూ.6.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.7.30 లక్షల చొప్పున మంజూరు చేశారు. వీటిలో ఇప్పటి వరకు 58 నిర్మాణాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. తమ పార్టీ కార్యకర్తలకే పనులు అప్పగించాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. విద్యాశాఖాధికారులకు హుకుం జారీ చేయడంతో నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. అనంతపురం సర్వజనాస్పత్రిలో మౌలిక వసతుల కల్పనకు రూ.1.89 కోట్లు మంజూరు చేయాలంటూ గత ఏడాది ఆస్పత్రి కమిటీ ప్రతిపాదనలు పంపినా ఇంత వరకు రూపాయి కూడా విడుదల కాలేదు. దీంతో ఆస్పత్రిలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. జిల్లాలో పశు వైద్యశాలలకు 64 భవన నిర్మాణాల కోసం రూరల్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద రూ.8.55 కోట్లు మంజూరయ్యాయి. అధికార పార్టీ నాయకుల ఒత్తిడి కారణంగా ఇంత వరకు భవన నిర్మాణాలు ప్రారంభ ం కాలేదు. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డీఎల్‌డీఏ) పరిధిలో ఒక్కో గోపాలమిత్ర సెంటర్ నిర్మాణానికి రూ.7.50 లక్షలు చొప్పున మంజూరయ్యాయి. జిల్లాకు 114 సెంటర్లు కేటాయించగా.. అందులో 56 సెంటర్లకు సంబంధించిన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. తక్కిన పనులు మొదలు పెట్టలేదు. జిల్లా పరిషత్ పరిధిలోని వివిధ శాఖలలో అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాలు, సీసీరోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్య పనులు, దోబీఘాట్లు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలకు బీఆర్ జీఎఫ్ కింద 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.43.91 కోట్లు మంజూరు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క పనికూడా ప్రారంభించలేదు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో 53 ప్రభుత్వ శాఖలు ఒకేచోట ఉండేలా డిజైన్ చేసిన ‘ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్’ నిర్మాణానికి 2011లో రూ.35 కోట్లు మంజూరు చేశారు. ఈ మేరకు శిలాఫలకం వేసినా ఇప్పటికీ పనులు మొదలు కాలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కంప్యూటర్ సర్వర్‌లో సాంకేతిక సమస్యల వల్ల జిల్లాలో 75,093 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. లబ్ధిదారులకు ఇప్పటి వరకు దాదాపు రూ.46 కోట్ల మేర బిల్లులు పెండింగ్ పడ్డాయి. స్వయం ఉపాధికి సంబంధించి 9,154 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు రూ.43.05 కోట్ల సబ్సిడీ రుణాలు మంజూరు చేయాల్సి ఉండగా.. ఇంత వరకు రూపాయి కూడా ఇవ్వలేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు కింద జిల్లాకు రూ.68 కోట్ల బకాయిలు విడుదల కావాల్సి ఉంది. రాజకీయ కారణాలతో స్టోర్ డీలర్లను తొలగిస్తుండడంతో కార్డుదారులకు రేషన్ సక్రమంగా అందక అవస్థ పడుతున్నారు. -
‘తప్పులతడక’కు బాధ్యులెవరు..!
ఇందూరు : జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితా తప్పుల తడకగా మారింది. అధికారుల నిర్లక్ష్యం మూలంగా తాము ఉద్యోగం కోల్పోయామని ఇద్దరు అభ్యర్థులు మంగళవారం జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి వచ్చి డీపీఓ సురేశ్‌బాబును కలిసి, ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరి కొన్ని విషయాలు బహిర్గతమయ్యాయి. చేసిం దంతా చేసి పైగా తమ తప్పేం లేదని పంచాయ తీ శాఖ అధికారులు పేర్కొనడం గమనార్హం. ఏపీపీఎస్సీ నుంచి నేరుగా వచ్చిన మెరిట్ మా ర్కుల జాబితాను ప్రదర్శించామని, ఆ జాబి తానే తప్పుగా ఉందంటూ ఏపీపీఎస్సీని తప్పుబ ట్టారు. మరో మాటగా అభ్యర్థులు కూడా దరఖా స్తు చేసుకునే సమయంలో తప్పుగా భర్తీ చేయ డం మూలంగా కూడా ఇలా జరిగిందని, వారు చేసిన తప్పుకు తామెందుకు బాధ్యత వహించాలన్నట్లుగా డీపీఓ సురేశ్‌బాబు ‘సాక్షి’తో ఫోన్లో చెప్పారు. మహిళకు సంబంధించిన కేటగిరిలో మహేష్ కూమార్ అనే అభ్యర్థి ఎంపికైనట్లు జాబితాలో చేర్చడం ఏంటని ప్రశ్నించగా, సదరు అభ్యర్థి దరఖాస్తు చేసుకునే సమయంలో తన జెండర్‌ను ఫిమెయిల్‌గా ఎంచుకుని ఉండవచ్చని, కాగా ఫొటోను కూడా గుర్తు పట్టలేకపోయామని సమాధానం ఇచ్చారు. ఇటు ఓసీకి చెందిన బి. నవనీత అనే అభ్యర్థినికి బీసీ-ఏ కేటగిరిలో ఎలా ఎంపిక చేస్తారని అడగ్గా ఏపీపీఎస్సీ నుంచి అలా తప్పుగా వచ్చిందని చెప్పారు.దీంతో ఇంతకు ఎవరు తప్పు చేశారో.. దీనికి ఎవరు బాధ్యత వహించాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఈ విషయం సదరు అభ్యర్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా మళ్లీ డీపీఓ సురేశ్‌బాబుకు రిఫర్ చేశారు. కసరత్తులో అధికారులు ఏం చేసినట్లు..? అభ్యర్థుల ఎంపిక జాబితాలో జరిగిన తప్పులకు తమ తప్పేం లేదని ఏపీపీఎస్సీ అధికారులపై, ఇటు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులే కారణమని ఆరోపిస్తున్న అధికారులు మరీ ఇన్ని రోజులుగా చేసిన కసరత్తులో ఏం చేసినట్లు..? గత నాలుగైదు నెలలుగా కసరత్తు పేరుతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఆలస్యం చేసిన అధికారులు ఎంపిక విషయంలో పక్కాగా ఎందుకు చేపట్టలేకపోయారు..? దీని వెనుక ఏమైనా ప్రలోభాలున్నాయా...? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మెరిట్ జాబితా ప్రకటించిన అనంతరం మార్కులు, రోస్టర్ పాయింట్‌ను కలుపుకుని అభ్యర్థులను ఎంపిక చేసిన అధికారులు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఒకటికి రెండు సార్లు చూసుకుని, జల్లెడ పట్టి మరీ అసలైన అభ్యర్థులను ఎంపిక చేయాల్సిన కసరత్తులో పెద్ద తప్పులు ఎలా దొర్లాయో అంతుచిక్కడం లేదు. బాధిత అభ్యర్థులు తమకు అన్యాయం జరిగింది మహాప్రభో అని అధికారులకు మొరపెట్టుకుంటే తప్ప, అసలు విషయం తెలియలేదా...? అని బాధిత అభ్యర్థులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన తరువాత జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని డీపీఓ సురేశ్‌బాబు తెలిపారు. -
750 మంది ఎంపీడీవోల బదిలీ
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ చరిత్రలో తొలిసారిగా 75 శాతం మంది ఎంపీడీవోలు బదిలీ అయ్యారు. ఎన్నికల సంఘం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో పంచాయతీరాజ్ కమిషనర్ వరప్రసాద్ వీరిని బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ ఉత్తర్వులను ఆయా జిల్లాల కలెక్టర్లకు, జిల్లా పరిషత్‌ల ముఖ్య కార్యనిర్వాహక అధికారులకు పంపించారు. ఒకే జిల్లాలో 15 సంవత్సరాలుగా పాతుకుపోయిన వారందర్నీ బదిలీ చేశారు. రాష్ట్రంలో 1,104 మండలాలు ఉండగా.. వీరిలో 750 మంది ఎంపీడీవోలను బదిలీ చేశారు. తమకు ఎన్నికల విధులతో ప్రత్యక్షంగా సంబంధం లేదని తమను బదిలీ చేయడానికి వీల్లేదంటూ ఎంపీడీవోలు ఇప్పటికే కోర్టుకెళ్లారు. ఈనెల 10వ తేదీన సాధారణ బదిలీల ప్రక్రియ ముగియడంతో ఇక బదిలీలు ఉండవని భావించారు. అయితే ప్రభుత్వం ఈనెల 25వ తేదీ వరకు బదిలీలు చేయడానికి అనుమతించడంతో.. సోమవారం రాత్రి ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని ఈ బదిలీలు చేశారు. బదిలీ అయిన అధికారులు మంగళవారం విధుల్లో చేరాల్సి ఉంటుంది. గతంలో ఒక జిల్లాలోనే ఇతర ప్రాంతాలకు బదిలీ చేసిన అధికారులు ఈసారి పక్క జిల్లాలకు బదిలీ చేశారు. బదిలీలపై సీఎస్ సమీక్ష: సాధారణ ఎన్నికలతో సంబంధం ఉన్న అధికారులను బదిలీ చేసినా.. వారు ఆ పోస్టుల్లో చేరడం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి సోమవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో వెల్లడైంది. రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా బదిలీ అయిన వారు ఇంకా ఆ పోస్టుల్లో చేరలేదని సీఎస్‌కు ఉన్నతాధికారులు వివరించారు. బదిలీ అయిన అధికారులంతా విధుల్లో తప్పకుండా చేరేలా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని వివిధ శాఖల ఉన్నతాధికారులను సీఎస్ ఆదేశించారు. -
జోరుగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
గదగ్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం జోరుగా సాగింది. తాలూకా పంచాయతీ కార్యాలయంలో జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖా మంత్రి హెచ్‌కే పాటిల్, జెడ్పీ అధ్యక్షుడు ఎంఎస్ పాటిల్‌తో పాటు పలువురు ప్రజా ప్రతినిధు లు ఓటు హక్కును వినియోగించుకున్నా రు. జిల్లాలో మొత్తం 1908 మంది ఓట ర్లు ఉండగా, 115 పోలింగ్ కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు హాజరై ఓటు హ క్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హెచ్‌కే పాటిల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జారీ చేసిన ప్రజోపయోగ పథకాలను మెచ్చి ఓట ర్లంద రూ కాంగ్రెస్ పార్టీనే బలపరుస్తున్నారన్నారు. తమ పార్టీ అభ్యర్థి నాగరా జ్ చబ్బి సుమారు వెయ్యి ఓట్ల మెజార్టీ తో గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశా రు. ఈ ఎన్నికల్లో బీజేపీ, కేజేపీ, జేడీఎస్ పొత్తువల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి న ష్టం లేదన్నారు. తమ పార్టీ ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటుతుం దని, వచ్చే లోక్‌సభ ఎన్నికలను సైతం ఎదుర్కొనేం దుకు తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు.