గదగ్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం జోరుగా సాగింది. తాలూకా పంచాయతీ కార్యాలయంలో జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖా మంత్రి హెచ్‌కే పాటిల్, జెడ్పీ అధ్యక్షుడు ఎంఎస్ పాటిల్‌తో పాటు పలువురు ప్రజా ప్రతినిధు లు ఓటు హక్కును వినియోగించుకున్నా రు. జిల్లాలో మొత్తం 1908 మంది ఓట ర్లు ఉండగా, 115 పోలింగ్ కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు హాజరై ఓటు హ క్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హెచ్‌కే పాటిల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జారీ చేసిన ప్రజోపయోగ పథకాలను మెచ్చి ఓట ర్లంద రూ కాంగ్రెస్ పార్టీనే బలపరుస్తున్నారన్నారు.
తమ పార్టీ అభ్యర్థి నాగరా జ్ చబ్బి సుమారు వెయ్యి ఓట్ల మెజార్టీ తో గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశా రు. ఈ ఎన్నికల్లో బీజేపీ, కేజేపీ, జేడీఎస్ పొత్తువల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి న ష్టం లేదన్నారు. తమ పార్టీ ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటుతుం దని, వచ్చే లోక్‌సభ ఎన్నికలను సైతం ఎదుర్కొనేం దుకు తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు.
జోరుగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
Published Fri, Aug 23 2013 4:12 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM
Advertisement
Advertisement