శ్రీకాకుళం పాతబస్టాండ్: స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల ఎన్నికలకు జిల్లాలో మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని జాయింట్ కలెక్టర్, రిటర్నింగు అధి కారి కేవీఎన్ చక్రధరబాబు తెలిపారు. సోమవారం స్థానిక ఎన్నికలపై జాయింట్ కలెక్టర్ అన్ని రాజకీయ పార్టీల ప్రతి నిధులతో కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూడు రెవెన్యూ డివిజనల్ ప్రధాన కేంద్రాల్లో పోలింగు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మార్చి 17న పోలింగు జరుగుతుందన్నారు. మార్చి 20న లెక్కింపు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ నెల 28 వరకు నామినేషన్లు వేసేందుకు గడువు ఉందని చెప్పారు.
స్థానిక సంస్థల్లో ఓటు వేయడానికి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు కౌన్సిలర్లు, ఆప్షన్ ఇచ్చిన శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఓట ర్లుగా ఉంటారని చెప్పారు. స్థానిక సంస్థల ఓటర్ల జాబితా, సభ్యుల సంఖ్యను అందించాలని కాంగ్రెస్ ప్రతినిధి రత్నాల నరసింహమూర్తి కోరారు. సమావేశంలో సహాయ రిటర్నింగు అధికారి మరియు జిల్లా రెవెన్యూ అధికారి ఎన్. సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ ప్రతినిధి పోలిశెట్టి మధుబాబు, కాంగ్రెస ప్రతినిధి రత్నాల నరసింహమూర్తి, తెలుగుదేశం జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కె. సింహాచలం, లోక్‌సత్తా ప్రతినిధి, వి. అప్పలరాజు, బీజేపీ ప్రతినిధులు అట్టాడ రవిబాబ్జి, ఎస్‌వీ రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు మూడు పోలింగ్ కేంద్రాలు
Published Tue, Feb 28 2017 11:51 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement