
దొండపర్తి (విశాఖ దక్షిణ): భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ఆదివారం విశాఖకు రానున్నారు. విశాఖ రసజ్ఞ వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రా మెడికల్ కళాశాల ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ (అంకోస) ఆడిటోరియంలో సాయంత్రం జరిగే రాచకొండ విశ్వనాథశాస్త్రి (రావిశాస్త్రి) శత జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. కార్యక్రమం అనంతరం తిరిగి ఢిల్లీకి విమానంలో పయనమవనున్నారు.
ఇదీ చదవండి: ఒక్క ఫొటో నా జీవితాన్నే మార్చేసింది
Comments
Please login to add a commentAdd a comment