Justice Nuthalapati Venkatramana
-
CJI NV Ramana: విశాఖకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
దొండపర్తి (విశాఖ దక్షిణ): భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ఆదివారం విశాఖకు రానున్నారు. విశాఖ రసజ్ఞ వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రా మెడికల్ కళాశాల ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ (అంకోస) ఆడిటోరియంలో సాయంత్రం జరిగే రాచకొండ విశ్వనాథశాస్త్రి (రావిశాస్త్రి) శత జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. కార్యక్రమం అనంతరం తిరిగి ఢిల్లీకి విమానంలో పయనమవనున్నారు. ఇదీ చదవండి: ఒక్క ఫొటో నా జీవితాన్నే మార్చేసింది -
నమ్మశక్యంగా లేదు... టెలిఫోన్ వైర్లలో 11 కేవీ కరెంటా?
న్యూఢిల్లీ: ‘‘టెలిఫోన్ వైర్ల గుండా ఏకంగా 11 కేవీ కరెంటు ప్రవహించిందా? అయినా అవి వెంటనే కరిగిపోలేదా? పైగా ఆ కరెంటు వాటిగుండా ఓ టీవీలోకి ప్రవహించి ఒకరి మరణానికి కారణమైందా? అంత హై వోల్టేజీ విద్యుత్ ప్రవహించినా టీవీ పేలిపోవడం, ఇంట్లో వైరింగంతా కాలిపోవడం జరగలేదా? అవే టెలిఫోన్ తీగలను పట్టుకున్న నిందితునికీ ఏమీ కాలేదా? ఇదంతా వినడానికే చాలా అసంబద్ధంగా లేదా?’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2003 నవంబర్‌లో కర్ణాటకలో ఒక వ్యక్తి ఇంట్లో టీవీ చూస్తూ కరెంటు షాక్‌కు గురై చనిపోయిన కేసు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది. టీవీలో హఠాత్తుగా శబ్దం పెరిగిపోవడంతో దగ్గరికెళ్లి రెండు వైర్లను విడదీసే ప్రయత్నంలో షాక్ కొట్టి సదరు వ్యక్తి మరణించాడు. ఇందుకు కారకులంటూ ఇద్దరిపై కేసు నమోదైంది. వారు కరెంట్ పోల్‌పై టెలిఫోన్ వైర్లు లాగుతుండగా వాటి గుండా 11 కేవీ విద్యుత్ మృతుని ఇంట్లోని టీవీలోకి ప్రవహించడం మరణానికి కారణమైందంటూ ట్రయల్ కోర్టు వారికి 15 నెలల కారాగార శిక్ష విధించింది. కర్ణాటక హైకోర్టు కూడా ట్రయల్ కోర్టు తీర్పునే సమర్థించడంతో వారు సుప్రీంకోర్టులో అపీలు చేసుకున్నారు. ‘‘మరణానికి నిందితుల నిర్లక్ష్యమే కారణమనేందుకు ప్రత్యక్ష సాక్ష్యాలేవీ లేవు. అసలంతటి షాక్ కొడితే మృతుని శరీరం తీవ్రంగా కాలిపోవాల్సింది. అలా జరగలేదు. తీగలను ముట్టుకున్న ఒక సాక్షికి అసలేమీ కాలేదంటున్నారు. అదెలా సాధ్యం? ఈ కేసులో ఆరోపణలన్నీ సాంకేతికమైనవి. వాటిపై కనీసం సాంకేతిక నిపుణుడితో మదింపు చేయించలేదు. వీటన్నింటి దృష్ట్యా నిందితులను సంశయ లాభం కింద విడుదల చేయాల్సింది. కానీ కేవలం ప్రాసంగిక సాక్ష్యాల ఆధారంగా అందుకు విరుద్ధమైన తీర్పు ఇచ్చారు’’ అంటూ ధర్మాసనం తప్పుబట్టింది. హైకోర్టు తీర్పును కొట్టేసింది. -
‘భారత న్యాయదిగ్గజం’ పుస్తకం త్వరలో ఆవిష్కరణ
కాచిగూడ (హైదరాబాద్): భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్. వి.రమణ జీవిత విశేషా లతో, న్యాయ వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులు, సంస్కరణలను పొందుపరుస్తూ రూపొందించిన ‘భారత న్యాయదిగ్గజం’ పుస్తకాన్ని జూన్ 2వ వారంలో ఢిల్లీలో ఆవిష్కరించనున్నట్లు ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీస్టేట్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ తిప్పినేని రామ దాసప్ప నాయుడు తెలి పారు. సోమవారం బర్కత్‌పురలోని సొసైటీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముద్ర సొసైటీ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ పుస్తకానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు ఆలూరు రామిరెడ్డి, మాజీ సభ్యుడు ఎన్.రామచంద్రరావు, ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు అబ్రహం, మహిళా న్యాయవాదుల సంఘం అధ్యక్షురాలు మాధవి సందేశాలు రాశారని పేర్కొన్నారు. లీగల్ సర్వీస్ అథారిటీలకు నిధులు పెంచి పేదల చెంతకు ఉచిత న్యాయసేవలు అందించడానికి, సామాన్యులు న్యాయం పొందడానికి ఈ పుస్తకంలో సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. -
జస్టిస్ ఎన్వీ రమణకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా శనివారం ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ నూతలపాటి వెంకట రమణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఆయన తన అధికారిక ట్విటర్ ఖాతా నుంచి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కూడా జస్టిస్ ఎన్వీ రమణకు శుభాకాంక్షలు తెలిపారు. Congratulations to Justice Sri NV Ramana Garu on being sworn in as the Chief Justice of India. — YS Jagan Mohan Reddy (@ysjagan) April 24, 2021 కాగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బాబ్డే పదవికాలం ముగియడంతో తదుపరి సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియమితులయ్యారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణను రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయించారు. కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమానికి కొద్ది సంఖ్యలోనే అతిథులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి, ప్రధాని, పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్రమంత్రులు, న్యాయశాఖ ఉన్నతాధికారులతో పాటు జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. చదవండి: సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ ఎన్వీ రమణ -
సవరణలపై చట్టసభల్లో చర్చ జరగడం లేదు
జస్టిస్ నూతలపాటి వెంకటరమణ సాక్షి, అమరావతి: ఆర్థిక, విద్యుత్ సంస్కరణలు పేదల జీవన ప్రమాణాలు పెంచేవిగా ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ అన్నారు. సమాజానికి అవసరమైన చట్టసవరణలపై చట్టసభల్లో సమగ్ర చర్చ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ప్రమాద మృతులకు రూ. 5 లక్షల పరిహారం చెల్లించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) కొత్త నిబంధనావళిని రూపొందించింది. ఈ రెగ్యులేషన్‌ను విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో జస్టిస్ రమణ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ ప్రమాదాల్లో బాధితులకు హేతుబద్ధమైన పరిహారం మానవ ధర్మమన్నారు. ఏ సంస్కరణలైనా ప్రజలకు ఉపయుక్తంగా ఉండాలని, అయితే చట్టసవరణలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రయోజనాలను గుర్తించి, వారి అభిమతం, ఆకాంక్షలను పరిగణలోనికి తీసుకుని ప్రభుత్వాలు పనిచేయాలని అభిప్రాయపడ్డారు. కనీస ధర్మం: జస్టిస్ భవానీ ప్రసాద్ విద్యుత్ ప్రమాదాల రూపేణా అసువులు బాసిన అనేక సంఘటనలు తనను కలిచివేశాయని, మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడానికి చట్టపరిధి ఇబ్బందిగా ఉండేదని ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ భవానీ ప్రసాద్ అన్నారు.