
కాచిగూడ (హైదరాబాద్): భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్. వి.రమణ జీవిత విశేషా లతో, న్యాయ వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులు, సంస్కరణలను పొందుపరుస్తూ రూపొందించిన ‘భారత న్యాయదిగ్గజం’ పుస్తకాన్ని జూన్ 2వ వారంలో ఢిల్లీలో ఆవిష్కరించనున్నట్లు ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ మల్టీస్టేట్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ తిప్పినేని రామ దాసప్ప నాయుడు తెలి పారు. సోమవారం బర్కత్‌పురలోని సొసైటీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ముద్ర సొసైటీ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ పుస్తకానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు ఆలూరు రామిరెడ్డి, మాజీ సభ్యుడు ఎన్.రామచంద్రరావు, ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు అబ్రహం, మహిళా న్యాయవాదుల సంఘం అధ్యక్షురాలు మాధవి సందేశాలు రాశారని పేర్కొన్నారు. లీగల్ సర్వీస్ అథారిటీలకు నిధులు పెంచి పేదల చెంతకు ఉచిత న్యాయసేవలు అందించడానికి, సామాన్యులు న్యాయం పొందడానికి ఈ పుస్తకంలో సూచనలు ఇచ్చినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment