![CJI NV Ramana Visits Tirupati - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2022/08/19/NV-RAMANA12.jpg.webp?itok=UadVtRuM)
సాక్షి, తిరుపతి: తిరుపతిలో సీజేఐ ఎన్వీ రమణ పర్యటించారు. ఈ సందర్బంగా గాంధీజీ ఆత్మకథ 'సత్యశోధన' పుస్తకాన్ని ఆవిష్కరించారు. గాంధీజీ జీవన సందేశాన్ని అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరంగా ఉందని ఎన్వీ రమణ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సత్యశోధన ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకమని అన్నారు. ఈ సందర్భంగా మహాత్మ గాంధీ సేవలను కొనియాడారు. అహింస అనే ఆయుధంతో గాంధీజీ పోరాటం చేసారని.. నిజాయతీగా జీవితాన్ని ఎలా గడపాలో నేర్పించిన వ్యక్తం గాంధీజీ అని అన్నారు. రాస్ నిర్వాహకులు, పద్మశ్రీ గ్రహీత స్వర్గీయ గుత్తా మునిరత్నం విగ్రహాన్ని సీజేఐ ఆవిష్కరించారు. అంతకుముందు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
చదవండి: ‘పాడా' పనులను త్వరగా పూర్తి చేసేలా సీఎం జగన్ ఆదేశాలు
తిరుమల శ్రీవారిని దర్శించకున్న సీజేఐ
తిరుమల శ్రీవారిని సీజేఐ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ మహద్వారం వద్ద టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో సీజేఐకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వామివారి పట్టు వస్త్రాలతో సత్కరించి శ్రీవారి చిత్రపటాన్ని అందించారు.
Comments
Please login to add a commentAdd a comment