book innovation
-
ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఇది: సీజేఐ ఎన్వీ రమణ
సాక్షి, తిరుపతి: తిరుపతిలో సీజేఐ ఎన్వీ రమణ పర్యటించారు. ఈ సందర్బంగా గాంధీజీ ఆత్మకథ 'సత్యశోధన' పుస్తకాన్ని ఆవిష్కరించారు. గాంధీజీ జీవన సందేశాన్ని అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరంగా ఉందని ఎన్వీ రమణ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సత్యశోధన ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకమని అన్నారు. ఈ సందర్భంగా మహాత్మ గాంధీ సేవలను కొనియాడారు. అహింస అనే ఆయుధంతో గాంధీజీ పోరాటం చేసారని.. నిజాయతీగా జీవితాన్ని ఎలా గడపాలో నేర్పించిన వ్యక్తం గాంధీజీ అని అన్నారు. రాస్ నిర్వాహకులు, పద్మశ్రీ గ్రహీత స్వర్గీయ గుత్తా మునిరత్నం విగ్రహాన్ని సీజేఐ ఆవిష్కరించారు. అంతకుముందు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. చదవండి: ‘పాడా' పనులను త్వరగా పూర్తి చేసేలా సీఎం జగన్ ఆదేశాలు తిరుమల శ్రీవారిని దర్శించకున్న సీజేఐ తిరుమల శ్రీవారిని సీజేఐ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ మహద్వారం వద్ద టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో సీజేఐకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వామివారి పట్టు వస్త్రాలతో సత్కరించి శ్రీవారి చిత్రపటాన్ని అందించారు. -
సినిమా లవర్స్ చదవాల్సిన పుస్తకం
– రానా ‘‘ప్రపంచవ్యాప్త చిత్ర విశేషాలను తెలుగువారికి అందించేందుకు సినిమా విశ్లేషకుడు వెంకటసిద్ధారెడ్డి రాసిన ‘సినిమా ఒక ఆల్కెమి’ పుస్తకం అద్భుతం’’ అని నటుడు దగ్గుబాటి రానా అన్నారు. హైదరాబాద్‌లో పుస్తకావిష్కరణ అనంతరం రానా మాట్లాడుతూ– ‘‘ప్రపంచంలోని అద్భుత చిత్రాల గురించి తెలుగు సినీ అభిమాను లకు పుస్తక రూపంలో అందించడం గొప్ప విషయం. ఇది సినిమా లవర్స్ అందరూ చదవాల్సిన పుస్తకం’’ అన్నారు. సిద్ధారెడ్డి మాట్లాడుతూ– ‘‘పాత తరం నాటి గొప్ప సినిమాలు చాలా మందికి తెలియకపోవచ్చు. 1948లో ఉక్రెయిన్‌లో మంచి సినిమాగా టాక్ తెచ్చుకున్న సినిమాల గురించీ ఈ బుక్‌లో రాశాను’’ అన్నారు. -
అలనాటి పాటలు మధురం
‘‘కొన్ని పాటలు వినగానే మనసుకు హత్తుకుపోతాయి. అందుకు కారణం చెప్పలేకపోవచ్చు. కానీ, ‘ఆ పాత మధురం’ పుస్తకం చదివితే ఆ పాటలు ఎందుకంతగా నచ్చాయో తెలుస్తుంది. అలనాటి పాత పాటలు జలపాతంపై తేనె ఒలికించినంత మధురంగా ఉంటాయి. 1960 నుంచి 1980 వరకు అద్భుతమైన పాటలు వచ్చాయి’’ అని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి అన్నారు. 1951 నుంచి 1955 మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లోని మంచి పాత పాటల సంకలనంతో పాటు వాటి గురించి విశదీకరిస్తూ మ్యూజికాలజిస్ట్ డాక్టర్ రాజా రచించిన ‘ఆ పాత మధురం’ పుస్తకావిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది.పారిశ్రామిక వేత్త వరప్రసాద్‌రెడ్డి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి రామచంద్రమూర్తికి అందించారు. డాక్టర్ రాజా మాట్లాడుతూ– ‘‘గోవిందరావు, నారాయణరెడ్డి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వరప్రసాద్‌రెడ్డిలు తనకు ఎంతో ప్రోత్సాహం అందించారు. వారి ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి చేరుకోగలిగా’’ అన్నారు. ‘‘ఇటీవల వచ్చిన పాటలపై మరో సంపుటి తీసుకొస్తే తానే ముద్రణ వేయిస్తానని’’ వరప్రసాద్‌రెడ్డి తెలిపారు. ‘సినీ గీత పరిశోధక శిరోమణి’ గా వక్తలు రాజాను కొనియాడారు. కాగా, ఈ పుస్తకాన్ని మధుసూదన్ శర్మకు అంకితం ఇచ్చారు. సంగీత దర్శకులు ఆర్పీపట్నాయక్, రచయిత డాక్టర్ మృణాళిని, సినీ గేయ రచయిత చంద్రబోస్, సన్ షైన్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ గురవారెడ్డి, పారిశ్రామికవేత్త రఘురామకృష్ణమరాజు, డాక్టర్ భార్గవి, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
కలాం ‘ట్రాన్సెండెన్స్’ పుస్తకావిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రపంచమంతటా శాంతి, సౌభాగ్యం పరిఢవిల్లాలని.. దయ, క్షమాగుణం ద్వారా ప్రపంచానికి నాగరికతను చాటడంలో భారతీయుల పాత్ర గొప్పదని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, స్వామి నారాయణ్ సంస్థాన్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు ప్రముఖ్ స్వామీజీ మహరాజ్ నాతో చెప్పేవారు’’ అని దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తాను చివరిగా రాసిన ‘ట్రాన్సెండెన్స్’ పుస్తకంలో పేర్కొన్నారు. గత 14ఏళ్లుగా ప్రముఖ్ స్వామీ మహరాజ్‌తో తన ఆధ్యాత్మిక అనుబంధాల సంకల నాన్ని ఆయన ఈ పుస్తకంలో ప్రస్ఫుటించారు. అబ్దుల్ కలాం రాసిన చివరి పుస్తకం ‘ట్రాన్సండెన్స్’ను స్వామి నారాయణ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆవిష్కరించా రు. ఈ కార్యక్రమానికి రామోజీ సం స్థల చైర్మన్ రామోజీరావుతో పాటు ఈసీఐఎల్ చైర్మన్ డాక్టర్ పి.సుధాకర్, లీడ్ ఇండియా వ్యవస్థాపకుడు హరికిషన్, డీఆర్డీఎల్ డెరైక్టర్ జయరామన్, సహ రచయిత అరుణ్ తివారీ, స్వామి నారాయణ్ ట్రస్ట్ ప్రతినిధి భక్తి ప్రియ స్వామి తదితరులు హాజరయ్యారు. పుస్తకావిష్కరణ సందర్భంగా ప్రముఖులు ప్రసంగిస్తూ.. కలాం భౌతికంగా లేకు న్నా, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కృషి చేయాలని చెప్పారు.