కలాం ‘ట్రాన్సెండెన్స్’ పుస్తకావిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రపంచమంతటా శాంతి, సౌభాగ్యం పరిఢవిల్లాలని.. దయ, క్షమాగుణం ద్వారా ప్రపంచానికి నాగరికతను చాటడంలో భారతీయుల పాత్ర గొప్పదని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, స్వామి నారాయణ్ సంస్థాన్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు ప్రముఖ్ స్వామీజీ మహరాజ్ నాతో చెప్పేవారు’’ అని దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తాను చివరిగా రాసిన ‘ట్రాన్సెండెన్స్’ పుస్తకంలో పేర్కొన్నారు. గత 14ఏళ్లుగా ప్రముఖ్ స్వామీ మహరాజ్‌తో తన ఆధ్యాత్మిక అనుబంధాల సంకల నాన్ని ఆయన ఈ పుస్తకంలో ప్రస్ఫుటించారు.
అబ్దుల్ కలాం రాసిన చివరి పుస్తకం ‘ట్రాన్సండెన్స్’ను స్వామి నారాయణ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆవిష్కరించా రు. ఈ కార్యక్రమానికి రామోజీ సం స్థల చైర్మన్ రామోజీరావుతో పాటు ఈసీఐఎల్ చైర్మన్ డాక్టర్ పి.సుధాకర్, లీడ్ ఇండియా వ్యవస్థాపకుడు హరికిషన్, డీఆర్‌డీఎల్ డెరైక్టర్ జయరామన్, సహ రచయిత అరుణ్ తివారీ, స్వామి నారాయణ్ ట్రస్ట్ ప్రతినిధి భక్తి ప్రియ స్వామి తదితరులు హాజరయ్యారు. పుస్తకావిష్కరణ సందర్భంగా ప్రముఖులు ప్రసంగిస్తూ.. కలాం భౌతికంగా లేకు న్నా, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కృషి చేయాలని చెప్పారు.