అశ్వ వాహన సేవలో పాల్గొన్న సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ | Justice NV Ramana Participated In Srivari Aswa Vahana Seva | Sakshi
Sakshi News home page

అశ్వ వాహన సేవలో పాల్గొన్న సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

Published Thu, Oct 14 2021 8:05 PM | Last Updated on Thu, Oct 14 2021 8:23 PM

Justice NV Ramana Participated In Srivari Aswa Vahana Seva - Sakshi

సాక్షి, తిరుమల: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అశ్వ వాహనంపై శ్రీవారు దర్శనమిస్తున్నారు. అశ్వ వాహన సేవలో సుప్రీంకోర్టు సీజే జస్టిస్‌ ఎన్వీ రమణ, హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా పాల్గొన్నారు. (చదవండి: బొగ్గు కొనుగోలుకు నిధుల కొరత లేదు: సీఎం జగన్‌)

జస్టిస్‌ ఎన్వీ రమణకు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి స్వాగతం పలికారు. రేపు(శుక్రవారం) ఉదయం చక్రస్నాన మహోత్సవంలో సీజేఐ పాల్గొననున్నారు. తిరుమల పర్యటనకు విచ్చేసిన సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రజలంతా సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలన్నారు.
చదవండి:
కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై ఏపీ సర్కార్‌ నిర్ణయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement