Aswa Vahanam
-
తేరుపై తిరుమలవాసుడు!
తిరుమల: బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ వేంకటేశ్వరుడు మహారథం (తేరు)పై భక్తులను అనుగ్రహించాడు. భక్తకోటి గోవింద శరణాగతుల మధ్య ఈ కార్యక్రమం ఆలయ మాడ వీధుల్లో వేడుకగా సాగింది. గుర్రాల వంటి ఇంద్రియాలు మనస్సు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలనే తత్వజ్ఞానాన్ని స్వామి వారు ఈ రథోత్సవం ద్వారా భక్తులకు సందేశమిచ్చారు. రథసేవలో దేవదేవుడిని దర్శించినవారికి పునర్జన్మ ఉండదని పురాణాల ప్రవచనం. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు గోవిందా..గోవిందా..అంటూ మహారథం మోకు (తాడు)ను లాగారు. వాహన సేవ తరువాత గంట పాటు పండితులు నిర్వహించిన వేదగోష్టితో సప్తగిరులు పులకించాయి. అశ్వవాహనంపై ఆనందనిలయుడి దర్శనం రాత్రి చల్లటి చలిగాలుల మధ్య మలయప్ప స్వామి అశ్వ వాహనంపై భక్తులను కటాక్షించారు. చతురంగ బలాల్లో అత్యంత ప్రధానమైనది అశ్వ బలం. కలియుగాంతంలో శ్రీనివాసుడు అశ్వవాహనం మీద వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడని చాటి చెప్పడమే ఈ వాహన పరమార్థం. బంగారు, వజ్ర, వైఢూర్య ఆభరణాలు, విశేష çపుష్పాలంకరణాంతరం స్వామి వారు ఆలయ మాడ వీధుల్లో ఊరేగారు. బ్రహ్మరథం, గజ, అశ్వ, తురగ, చతురంగ బలాలు ముందుకు సాగగా జానపద కళాకారులు, భజన బృందాలు సాంస్కృతిక కార్యక్రమాల మధ్య వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది. సర్వ దర్శనానికి 10 గంటలు తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. 32 కంపార్ట్మెంట్లు నిండాయి. సర్వ దర్శనానికి 10 గంటలు పడుతోంది. సోమవారం అర్ధరాత్రి వరకు 82,815 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. హుండీలో రూ.3 05 కోట్లు వేశారు. నేడే చక్రస్నానం.. బుధవారం ఉదయం 3 గంటల నుంచి పల్లకి ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. అనంతరం స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని వరాహస్వామి ఆలయంలో నిర్వహిస్తారు. ఆ తరువాత శ్రీవారి శంఖు, చక్రాలను పుష్కర జలాల్లో ముంచి లేపుతారు. ఈ కార్యక్రమం ఉదయం 3 నుంచి ప్రారంభమై 9 గంటలకు ముగుస్తుంది. రాత్రి 7–9 గంటల మధ్యలో ధ్వజావరోహణం నిర్వహిస్తారు. దీంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. శ్రీవారి సేవలో న్యాయమూర్తులు శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏవీ రవీంద్ర బాబు, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్, జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు దర్శించుకున్నారు. అనంతరం వీరందరూ వాహన సేవలో పాల్గొన్నారు. అలాగే, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అశ్వవాహన సేవలో పాల్గొన్నారు. -
అశ్వ వాహన సేవలో పాల్గొన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, తిరుమల: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అశ్వ వాహనంపై శ్రీవారు దర్శనమిస్తున్నారు. అశ్వ వాహన సేవలో సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా పాల్గొన్నారు. (చదవండి: బొగ్గు కొనుగోలుకు నిధుల కొరత లేదు: సీఎం జగన్) జస్టిస్ ఎన్వీ రమణకు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి స్వాగతం పలికారు. రేపు(శుక్రవారం) ఉదయం చక్రస్నాన మహోత్సవంలో సీజేఐ పాల్గొననున్నారు. తిరుమల పర్యటనకు విచ్చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రజలంతా సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలన్నారు. చదవండి: కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై ఏపీ సర్కార్ నిర్ణయం -
కోలాహలంగా పద్మావతి పరిణయోత్సవం
- అశ్వవాహనంపై శ్రీవారు - దంతపల్లకిపై ఉభయ దేవేరులు - మాడవీధుల్లో విహారం సాక్షి, తిరుమల: తిరుమలలో పద్మావతి, శ్రీనివాస పరిణయోత్సవం రెండో రోజు శుక్రవారం కోలాహలంగా సాగింది. అశ్వవాహనంపై స్వామివారు, దంతపల్లకిపై ఉభయదేవేరులు నాలుగుమాడ వీధుల నుంచి ప్రదర్శనగా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు. శోభాయమానంగా నిర్మించిన కల్యాణవేదికలో స్వామి, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూల బంతాట, నూతన వస్త్రాలు సమర్పించారు. తర్వాత ఉత్సవర్ల ఎదుట ఆస్థానం నిర్వహించి, వేదాలు, పురాణాలు పఠించి, కీర్తన లు ఆలపించి, నృత్యాలు ప్రదర్శించి కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. చిరుజల్లులు కురవడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. రాత్రి 7.30 గంటల తర్వాత కల్యాణమహోత్సవానికి చిహ్నంగా రంగురంగుల బాణసంచా పేల్చుతూ స్వామివారికి నీరాజనం సమర్పించారు. శ్రీవారి దర్శనానికి 20 గంటలు: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. వేకువజామున 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 31,448 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం మొత్తం 28 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 20 గంటలు, కాలిబాట మార్గాల్లో నడచి వచ్చిన భక్తులకు 6 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభించనుంది. రద్దీ పెరగటంతో రూ. 300 టికెట్ల దర్శనం మధ్యాహ్నం 2 గంటలకే నిలిపివేశారు. గదులు, లాకర్ల వద్ద కొంత రద్దీ కనిపించింది. కల్యాణకట్టల వద్ద భక్తులు తలనీలాలు సమర్పించుకునేందుకు రెండు గంటల సమయం పట్టింది.