న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ శ్రమించేతత్వం, క్రమశిక్షణగల వ్యక్తి అని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు. సుప్రీం కొలీజియంలో భాగమైన జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ ఖన్విల్కర్‌తో కలిసి తాము ఏడాది కాలంలో ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకాల కోసం 250 పేర్లను పరిశీలించినట్లు ఆయన వెల్లడించారు.
సుప్రీం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటైన జస్టిస్ ఖన్విల్కర్ వీడ్కోలు కార్యక్రమంలో సీజేఐ ప్రసంగించారు. సుప్రీంకోర్టులో ఆయన 8,446 కేసులను పరిష్కరించడంతోపాటు 187 తీర్పులను రాశారన్నారు. ఆయన శ్రమించే తత్వం అందిరికీ తెలిసిందేనన్నారు. జస్టిస్ ఖన‍్విల్కర్ సుప్రీంకోర్టులో సుమారు ఆరేళ్లపాటు పనిచేశారు. ఆయన పదవీ విరమణ కారణంగా అత్యున్నత న్యాయస్థానంలోని 34 జడ్జీల పోస్టులకు గాను 31 మంది మిగిలారు.
ఇదీ చదవండి: ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల పెండింగ్ కేసులు
Comments
Please login to add a commentAdd a comment