న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హృషికేశ్ రాయ్‌కి శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో పలువురు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాతోపాటు పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు. జస్టిస్ హృషికేశ్ రాయ్ చాలా విశిష్టమైన న్యాయమూర్తి అని జస్టిస్ ఖన్నా కొనియాడారు.
ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని ప్రశంసించారు. క్విజ్ మాస్టర్‌గా, జర్నలిస్టుగా, స్టాండప్ కమేడియన్‌గానూ రాణించారని చెప్పారు. జస్టిస్ హృషికేశ్ రాయ్ 2019 సెప్టెంబర్ 23న సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. శుక్రవారం ఆయన పదవీ కాలం ముగిసింది. ఆయన చివరి పని దినంగా సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రత్యేకంగా సమావేశమైంది. న్యాయ వ్యవస్థకు జస్టిస్ హృషికేశ్ రాయ్‌కి అందించిన సేవలను ధర్మాసనం సభ్యులు గుర్తుచేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment