Hrishikesh
-
Sadhvi Bhagawati Saraswati: హాలీవుడ్ టు హిమాలయాస్
‘క్షమించకపోతే మీరు గతంలోనే ఉండిపోతారు’ అంటారు సాధ్వి భగవతి సరస్వతి. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ యూదురాలు పాతికేళ్లుగా హృషికేశ్‌లో జీవిస్తూ ఆధ్యాతికత సాధన చేయడమే కాదు సామాజిక సేవలో విశేష గుర్తింపు పొందారు. ‘ఆధునిక జీవితంలో పరుగు పెడుతున్నవారు ఆనందాలంటే ఏమిటో సరిగ్గా నిర్వచించుకోవాలి’ అన్నారామె. ‘హాలీవుడ్ టు హిమాలయాస్’ పేరుతో వెలువడి బెస్ట్ సెల్లర్‌గా నిలిచిన తన ఆత్మకథ గురించి ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో మాట్లాడారు. ఆమె ఒక కథతో మొదలెట్టింది. ‘ఒక ఊరిలో కోతుల బెడద ఎక్కువైంది. వాటిని పట్టుకుని అడవిలో వదిలిపెట్టాలి. ఏం చేశారంటే కొబ్బరి బోండాలకి కోతి చేయి పట్టేంత చిన్న చిల్లి చేసి వాటిలో కోతులకు ఇష్టమైన హల్వాను పెట్టారు. కోతులు ఆ హల్వా కోసం లోపలికి చేయి పెట్టి పిడికిలి బిగిస్తాయి. కాని చేయి బయటకు రాదు. కొబ్బరి బోండాంలో ఇరుక్కున్న చేతితో అది ఎక్కువ దూరం పోలేదు. అప్పుడు దానిని పట్టుకుని అడవిలో సులభంగా వదలొచ్చు. ఇక్కడ తెలుసుకోవాల్సిందేమంటే కోతి గనక పిడికిలి వదిలేస్తే చేయి బయటకు వచ్చేస్తుంది. కాని అది వదలదు. హల్వా కావాలి దానికి. మనిషి కూడా అంతే. తనే వెళ్లి జంజాటాల్లో చిక్కుకుంటాడు. పిడికిలి వదిలితే శాంతి పొందుతాడు’ అందామె. హృషికేశ్‌లోని గంగానది ఒడ్డున పరమార్థ్ ఆశ్రమ్‌లో గత పాతికేళ్లుగా జీవిస్తున్న సాధ్వి భగవతి సరస్వతి నిజానికి భారతీయురాలు కాదు. భారతదేశంతో ఏ సంబంధమూ లేదు. ఆమె అమెరికాలో జన్మించిన యూదురాలు (అసలు పేరు చెప్పదు). స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చేసి ఆ తర్వాత సైకాలజీలో íపీహెచ్డీ చేసింది. హాలీవుడ్ ఉండే లాస్ ఏంజిలస్‌లో ఎక్కువ కాలం నివసించిన ఆమె హాలీవుడ్లో పని చేసింది కూడా. కాని 1997లో భర్తతో కలిసి తొలిసారి ఇక్కడకు వచ్చినప్పుడు గంగానది చూసి ఆమె పొందిన ప్రశాంతత అంతా ఇంతా కాదు. ప్రశాంతమైన జీవన విధానం భారతీయ తత్త్వ చింతనలో ఉందని విశ్వసించి అప్పటినుంచి ఇక్కడే ఉండిపోయింది. విచిత్రమేమంటే ఈ దేశ జీవన విధానాన్ని మరచి ఆధునికవేగంలో కూరుకుపోయిన వారికి ఆమె పరిష్కార మార్గాలు బోధిస్తున్నది. సంతోషానికి నిర్వచనం ఏమిటి? ‘బిడ్డ పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు ఆ బిడ్డ సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో చెబుతుంటారు. బాగా చదవాలి, బాగా మార్కులు తెచ్చుకోవాలి, ఈ కోర్సులోనే చేరాలి, ఈ దేశమే వెళ్లాలి, ఫలానా విధంగా పెళ్లి చేసుకోవాలి, ఫలానా విధంగా డబ్బు వెనకేసుకోవాలి... ఇంత ప్రయాస పడితే తప్ప మనిషి సంతోషంగా ఉండలేడన్న భావన తలలో నిండిపోయి ఉంది. అయితే డబ్బు ఎక్కువగా ఉంటే సంతోషంగా ఉండగలమా? సంతృప్తిగా జీవించడంలో సంతోషం ఉంది. జీవితంలో అనుక్షణం సంతోషం పొందడం నేర్చుకోవడం లేదు. ఎప్పుడో ఏదో సంతోషం దొరుకుతుందనే తాపత్రయంతో ఈ క్షణంలోని సంతోషం పొందకుండా మనిషి పరిగెడుతున్నాడు’ అంటుందామె. హాలీవుడ్‌ను వదిలి సాధారణంగా చాలామంది అమెరికాలో స్థిరపడి సంతోషకరమైన జీవితం గడపాలనుకుంటారు. కాని సాధ్వి భగవతి అమెరికాను విడిచి గంగానది ఒడ్డున ప్రశాంతంగా జీవించడంలో సంతోషం ఉందని ఇక్కడ ఉండిపోయింది. ‘నా భర్త నాకు భారతదేశం గురించి చెప్పాడు. అతనే నన్ను ఇక్కడకు తీసుకొచ్చాడు. కానీ ఒక్కసారి ఇక్కడ గంగానదిని చూశాక, గురువును పొందాక ఇక ఎక్కడికీ వెళ్లకూడదనుకుని ఉండిపోయాను’ అని తెలిపిందామె. ఆధునిక జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవనంలో తాను ఎందుకు, ఎలా ప్రయాణించిందో తెలిపే ఆత్మకథను ‘హాలీవుడ్ టు హిమాలయాస్’ పేరుతో రాసిందామె. అది బెస్ట్ సెల్లర్‌గా ఉంది. గత పాతిక సంవత్సరాలుగా హిమాలయాల్లో పేదవారి కోసం సామాజిక సేవ చేస్తున్నదామె. అందుకే అమెరికా ప్రెసిడెంట్ బైడన్ ఆమెను ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’తో గౌరవించాడు. ఆ పిల్లల కళ్లల్లో నిశ్చింత ‘హిమాలయాలకు మొదటిసారి వచ్చినప్పుడు ఇక్కడ ఒంటి మీద చొక్కా లేకపోయినా పిల్లల కళ్లల్లో నిశ్చింత చూశాను. లాస్ ఏంజిలస్‌లో అలాంటి నిశ్చింతతో పిల్లలు ఉండరు. ఆ నిశ్చింత, సంతోషం ఎందుకు పోగొట్టుకుంటున్నాం మనం? ఫిర్యాదులు, ప్రతీకారం, క్షమించకపోవడం... మనల్ని ముందుకు పోనీకుండా చేస్తాయి. ఎదుటివాళ్లు చేసిన తప్పులను మనం అంగీకరించకపోవచ్చు. కాని వాటిని దాటి ముందుకెళ్లాలంటే క్షమించడమే మార్గం. లేదంటే మనం గతంలోనే కూరుకుపోతాం. జీవితానికి ఏం మేలు చేస్తున్నావన్నది కాదు... జీవితం ద్వారా ఏం మేలు పొందుతున్నావన్నదే ముఖ్యం’ అన్నారామె. -
పరిస్థితి దిగజారకముందే విడిపోయాం: నటుడు
సీఐడీ, యే రిష్తా క్యా కెహ్లాతా హై నటుడు హృషికేశ్ పాండే ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమె చేయి పట్టుకుని నడవాలని కలలు గన్నాడు. పెద్దలను ఒప్పించి వారి సమక్షంలోనే 2004లో ఆమెను పరిణయమాడాడు. కానీ పెళ్లి తర్వాత అతడు అనుకున్నట్లు జరగలేదు. గొడవలు మొదలయ్యాయి. ఇద్దరి మధ్య మనస్పర్థలు తొంగిచూశాయి. దీంతో సరిగ్గా పది సంవత్సరాల తర్వాత ఇద్దరూ వేర్వేరేగా జీవించడం మొదలు పెట్టారు. ఏకంగా విడాకులు కావాలంటూ కోర్టుకెక్కారు. ఆ విడాకులు ఈ ఏడాది మార్చిలో మంజూరవడంతో అధికారికంగా విడిపోయినట్లు ప్రకటించారు. తాజాగా ఈ విడాకుల గురించి హృషికేశ్ మాట్లాడుతూ.. 'ఒకానొక సమయంలో మేము భార్యాభర్తలుగా ఇక కలిసి ఉండలేం అనిపించింది. పరిస్థితులు చేజారకముందే విడివిడిగా జీవించడం మొదలు పెట్టాం. నా వ్యక్తిగత జీవితం గురించి అందరితో పంచుకోవడం ఇష్టం లేక ఇన్నేళ్లపాటు మౌనంగా ఉన్నాను. విడాకులు వచ్చేశాయి, కాబట్టి ఇప్పుడు దీని గురించి మాట్లాడొచ్చు అనిపిస్తోంది. అలా అని మేమేమీ పెద్ద కొట్లాటలకు దిగలేదు. ఇద్దరమూ పరిపక్వత చెందినవాళ్లమే కాబట్టి చాలా హుందాగా విడిపోయాం'. 'మా బంధం విచ్ఛిన్నమయిందంటూ వచ్చే వార్తలు నా కొడుకు దక్షయ్ చెవిన పడటం నాకిష్టం లేదు. నేను మౌనంగా ఉండటానికి వీడు కూడా ఓ కారణం. వాడికిప్పుడు 12 ఏళ్లు. అతడు నా దగ్గరే పెరుగుతున్నాడు. నేను ఎక్కువ కాలం షూటింగ్లో గడిపేసినప్పుడు వాడు ఇంట్లో ఒంటరిగా ఉండటం నన్ను బాధిస్తోంది అందుకే మంచి హాస్టల్లో చేర్పించేందుకు అడ్మిషన్ తీసుకున్నా. తను కావాలనుకున్నప్పుడు తన తల్లిని కలుసుకోవచ్చు' అని నటుడు చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ ప్రేమను నమ్ముతానంటోన్న హృషికేశ్ ఇప్పుడప్పుడే మళ్లీ లవ్‌లో పడే ఉద్దేశ్యం లేదని చెప్పుకొచ్చాడు. చదవండి: కోలివుడ్‌ను కుదిపేస్తున్న కరోనా: దర్శకుడి భార్య మృతి -
17న తెరపైకి రమ్
ఆల్ ఇన్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత టీ.విజయరాఘవేంద్ర నిర్మించిన చిత్రం రమ్. ఈ చిత్రం ఈ నెల 17న తెరపైకి రానుంది. నవ దర్శకుడు ఎం.సాయిభరత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హృషికేష్ కథానాయకుడిగా నటించిన ఇందులో నటి సంజనాశెట్టి, మియాజార్జ్ కథానాయికలుగా నటించారు. ప్రధాన పాత్రలో వివేక్, ముఖ్య పాత్రల్లో అంజద్, అర్జున్ టించగా ప్రతినాయకుడిగా నరేన్ నటించారు. ఈ చిత్రానికి యువ సంగీత తరంగం అనిరుద్ సంగీతబాణీలు కట్టడం విశేషం. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న రమ్ చిత్ర విడుదల హక్కుల్ని పొందిన శ్రీసాయి సర్క్యూట్ 6000 సంస్థ ఈ నెల 17న విడుదల చేయనుంది. ఈ సందర్భంగా మంగళవారం చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం నిర్వహంచారు.ఆ సందర్భంగా చిత్ర దర్శకుడు సాయిభరత్ మాట్లాడుతూ రెండు–మూడేళ్లుగా తయారు చేసుకున్న కథతో తెరకెక్కించిన చిత్రం రమ్ అని తెలిపారు. కథను విన్న నటుడు హృషికేష్ చాలా బాగుందని వెంటనే హీరోగా నటించడానికి అంగీకరించారన్నారు. ఆ తరువాత నిర్మాత విజయరాఘవేంద్ర చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చారన్నారు. ఆపై నటి సంచితశెట్టి, మియాజార్జ్, వివేక్, నరేన్ ఇలా అందరూ పాత్రలకు తగ్గట్టు కుదిరారని చెప్పారు.రమ్ హారర్ నేపథ్యంలో సాగే చిత్రం అయినా, ఆ తరహా చిత్రాలకు ఢిపరెంట్‌గా యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని తెలిపారు. ఒక రాబరీతో మొదలయ్యే ఈ కథ హారర్‌గా ఎలా మారుతుందన్నది ఆసక్తికరంగానూ, థ్రిల్లింగ్‌గానూ సాగుతుందని చెప్పారు. యువత, పెద్దలు అందరూ చూసి ఎంజాయ్ చేసేలా రమ్ ఉంటుందని అన్నారు. రమ్ అన్నది తమిళ పదమేనని, దీనికి నీతి అనే అర్థం అని తెలిపారు. చిత్ర కథానాయకుడు హృషికేశ్ మాట్లాడుతూ అనిరుద్ సంగీతాన్ని అందించడం రమ్ చిత్రానికి పెద్ద ఎస్సెట్‌గా పేర్కొన్నారు.ఇక వివేక్ లాంటి ప్రముఖ నటుడు కొత్త వాళ్లు చేసిన చిత్రంలో నటించడానికి అంగీకరించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఆయన పాత్ర హస్యం దాటి చిత్రం అంతా ట్రావెల్ అవుతుందని తెలిపారు.రమ్ చిత్రాన్ని దర్శకుడు సాయిభరత్ చాలా బాగా హ్యాండిల్ చేశారని అన్నారు. ఈ చిత్రం తనకు చాలా స్పెషల్ అని నటి సంచితాశెట్టి పేర్కొన్నారు. -
బంగ్లాలో ఏం జరిగింది?
హృషికేశ్, నరైన్, మియాజార్జ్, సంచితా శెట్టి ప్రధాన పాత్రల్లో సాయిభరత్ దర్శకత్వంలో రూపొందించిన తమిళ చిత్రం ‘రమ్’. ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్టైన్ మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ ‘మంత్రిగారి బంగళా’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ ప్రతి సన్నివేశం ఉత్కంఠ కల్గిస్తుంది. సునీల్ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న మియాజార్జ్ ఈ చిత్రంలో కీలక పాత్ర చేశారు. అనిరుధ్ బాణీలు, నేపథ్య సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణ. జనవరిలో పాటలను, ఫిబ్రవరిలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బేబీ త్రిష.