అలహాబాద్: భారతీయ కోర్టులు ఇప్పటికీ అసంపూర్ణ మౌలిక సదుపాయాలతో పనిచేస్తున్నాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటి‹Ùపాలన అనంతరం న్యాయవ్యవస్థలో మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం రాజ్యమేలిందన్నారు. పరిష్కారానికే జాతీయ జ్యుడీíÙయల్ ఇన్‌ఫ్రా కార్పొరేషన్(ఎన్‌జేఐసీ) ఏర్పాటుతోనే ఈసమస్యకు పరిష్కారమని సూచించారు. ఉత్తరప్రదేశ్‌జాతీయ లా యూనివర్సిటీ, అలహాబాద్ హైకోర్టు నూతన భవన సదుపాయం శంకుస్థాపనలో రాష్ట్రపతితో పాటు ఆయన పాల్గొన్నారు.
దేశీయ కోర్టుల్లో మెరుగైన వసతులు లేకపోవడం విచారకరమని, దీనివల్ల న్యాయసిబ్బంది పనితీరుపై ప్రభావం కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారం ఎన్‌జేఐసీ ఏర్పాటేనని అభిప్రాయపడ్డారు. దేశంలోని జాతీయ ఆస్తుల నిర్మాణ సంస్థలతో కలిసి ఎన్‌జేఐసీ పనిచేస్తుందని, జాతీయ కోర్టు డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు నమూనాలను అభివృద్ధి చేస్తుందని తెలిపారు. సరైన మౌలికవసతుల కల్పనతో న్యాయం పొందే మార్గం మరింత సుగమం అవుతుందన్నారు. అలహాబాద్ హైకోర్టులో పెండింగ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవడాన్ని ప్రస్తావిస్తూ, నూతన భవనంతో జ్యుడీషియరీ మరింత చురుగ్గా పనిచేసి పెండింగులను తగ్గిస్తుందని ఆశించారు. తీర్పులను వ్యవహారిక భాషలోకి అనువదించాన్న సూచన రాష్ట్రపతి కోవింద్‌దేనని ఆయన ప్రశంసించారు.
ఆ తీర్పు సాహసోపేతం
1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు జడ్జి జగ్‌మోహన్‌లాల్ సిన్హా ఇచి్చన తీర్పు అత్యంత సాహసోపేతమైనదని సీజేఐ రమణ ప్రశంసించారు. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఇందిర ఎన్నికను చెల్లకుండా చేసిన ఈ తీర్పు దేశంలో ఒక కుదుపు తెచ్చిందన్నారు. దీనికారణంగానే చివరకు ఇందిర ఎమర్జెన్సీ విధించారని గుర్తు చేశారు. అలహాబాద్ హైకోర్టుకు 150 సంవత్సరాల చరిత్రుందని కొనియాడారు. ఇక్కడనుంచి అనేకమంది గొప్ప న్యాయవాదులు, న్యాయమూర్తులు వచ్చారన్నారు. దీంతో పాటు అలహాబాద్ నగర ప్రాశస్త్యాన్ని కూడా ఆయన ప్రస్తుతించారు.
Comments
Please login to add a commentAdd a comment