incomplete
-
అసంపూర్తిగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ల క్రమబదీ్ధకరణ) దరఖాస్తుల్లో అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేయనివారు 75శాతం మంది దాకా ఉన్నారు. అధికారులు దరఖాస్తులు పరిశీలించే క్రమంలో ఈ విషయం వెలుగుచూసింది. 2020 ఆగస్టు 26కు ముందు ఉన్న అక్రమ లేఅవుట్లు, ప్లాట్లు క్రమబద్ధీకరించుకునేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అవకాశం ఇచ్చి ంది. రూ.1,000 ఫీజుగా చెల్లించి దరఖాస్తు చేసుకోగా, రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల దరఖాస్తులు వచ్చాయి.అయితే వివిధ కారణాల వల్ల ఎల్ఆర్ఎస్ ప్రక్రియ అప్పట్లో అర్ధాంతరంగా నిలిచిపోయింది. కాగా గత డిసెంబర్లో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం 2020 నాటి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించాలని నిర్ణయించింది. ఈ మేరకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన చేయడంతో జనవరి నుంచి దరఖాస్తుల పరిశీలన మొదలైంది. అరకొరగానే అప్లోడ్ దరఖాస్తుదారులు ఎల్ఆర్ఎస్కు అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్పట్లో అప్లోడ్ చేయలేదు. మొత్తంగా 75 శాతం అసంపూర్తి దరఖాస్తులే అందజేశారు. ప్లాట్ల రిజి్రస్టేషన్ డాక్యుమెంట్లు, లే అవుట్ కాపీలు, ఇతర పత్రాలు అప్లోడ్ చేయకుండా వచ్చి న దరఖాస్తులను పక్కనబెడుతూ అధికారులు దరఖాస్తుల పరిశీలన ప్రారంభించారు. ఇప్పటి వరకు 4,28,832 దరఖాస్తులను పరిశీలించగా, వాటిలో కేవలం 60,213 దరఖాస్తులు మాత్రమే ఆమోదించినట్టు పురపాలక ముఖ్య కార్యదర్శి దానకిషోర్ తెలిపారు. తద్వారా రూ.96.60 కోట్లు ఫీజు రూపంలో వసూలైనట్టు చెప్పారు. పరిశీలించిన దరఖాస్తుల్లో 75 శాతం పూర్తిస్థాయి డాక్యుమెంట్లు లేకపోవడం వల్ల వాటిని ఆమోదించడం లేదని దరఖాస్తుదారులకు చెప్పారు. షార్ట్‌ఫాల్స్ వివరాలను కూడా దరఖాస్తుదారులకు తెలియజేశారు.మరోసారి అవకాశం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయడానికి పురపాలకశాఖ మరో చాన్స్ ఇచ్చి ంది. దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయడానికి, మున్సిపాలిటీ/కార్పొరేషన్/నగరాభివృద్ధి సంస్థల నుంచి అధికారిక షార్ట్ ఫాల్స్ లెటర్ కోసం వేచిచూడకుండా పూర్తిస్థాయి డాక్యుమెంట్లను ఎల్ఆర్ఎస్ పోర్టల్‌లో అప్లోడ్ చేసే వెసులుబాటు కల్పించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని సేల్‌డీడ్, ఈసీ, మార్కెట్ వ్యాల్యూ సర్టీ ఫికెట్, లేఅవుట్ కాపీ వంటి డాక్యుమెంట్లను అప్లోడ్ చేయవచ్చు. దరఖాస్తుదారులు తమ మొబైల్ నంబర్, చిరునామా లేదా ఇతర దరఖాస్తు వివరాలను మొబైల్ నంబర్ ఓటీపీని వినియోగించుకొని ఈ పోర్టల్ ద్వారా సవరించుకోవచ్చునని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ తెలిపారు.ఇందుకోసం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగరాభివృద్ధి సంస్థలతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్‌్కలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఏవైనా సందేహాలుంటే తీర్చుకోవడానికి లేదా వివరాల కోసం ఈ హెల్ప్‌డెస్క్‌లను సందర్శించవచ్చునని తెలిపారు. -
పుతిన్ మూడు డిమాండ్లు.. ఉక్రెయిన్ నో!
కీవ్: ప్రపంచ దేశాలు ఆసక్తిగా, ఆశగా ఎదురు చూస్తున్న రష్యా, ఉక్రెయిన్ చర్చలు సోమవారం అసంపూర్ణంగా ముగిశాయి. ఇరు దేశాల అధికారులు బెలారస్ సరిహద్దులోని గోమెల్లో సమావేశమయ్యారు. చర్చల్లో కీలక నిర్ణయాలేమీ జరగలేదు. మరోమారు సమావేశం కావాలని ఇరుపక్షాలు అంగీకరించాయని రష్యాకు చెందిన స్పుత్నిక్ మీడియా తెలిపింది. తమ దేశంతో పాటు క్రిమియా, డాన్బాస్ ప్రాంతాల నుంచి బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని రష్యాను ఉక్రెయిన్ డిమాండ్ చేసిందని తెలిపింది. చర్చలు జరుగుతుండగానే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చర్చలు జరిపారు. ‘‘క్రిమియాపై రష్యా సార్వభౌమత్వాన్ని గుర్తించాలి. ఉక్రెయిన్ తటస్థ దేశంగా కొనసాగాలి. నాటో సభ్యత్వ డిమాండ్‌ను శాశ్వతంగా వదులుకోవాలి. అప్పుడే యుద్ధం ఆగుతుంది’’ అని స్పష్టం చేసినట్టు సమాచారం. చర్చలు రెండో దఫా చర్చలు పోలాండ్– బెలారస్ సరిహద్దుల్లో త్వరలో జరిగే అవకాశం ఉందని ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు మైకోలియో పోడోలక్ చెప్పారు. పుతిన్‌కు ఆసక్తి లేదా? చర్చల్లో ఉక్రెయిన్ తరఫున రక్షణ మంత్రితో పాటు ఉన్నతాధికారులు పాల్గొనగా రష్యా నుంచి మాత్రం పుతిన్ సాంస్కృతిక సలహాదారుతో పాటు ఇతర అధికారులు వచ్చారు. దీంతో పుతిన్‌కు ఈ చర్చలపై ఆసక్తి పెద్దగా లేదని నిపుణులు భావిస్తున్నారు. చర్చించుకుందామంటూ తొలుత రష్యా చేసిన ప్రతిపాదించగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తిరస్కరించడం తెలిసిందే. చర్చలకు బయలుదేరడం మొదలు, అవి జరిగి, ఇరుపక్షాలూ వెనుదిరిగే దాకా బెలారస్లో విమానాలు, హెలికాప్టర్లు, క్షిపణలు ఏవీ ఎగరకుండా చూస్తామని అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో హామీ ఇవ్వడంతో గోమెల్లో చర్చలకు జెలెన్స్కీ అంగీకరించారు. తక్షణ పరిష్కారం లభించకున్నా ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఈ చర్చలు ఉపయోగపడతాయని దేశాలన్నీ ఆశిస్తున్నాయి. తగ్గిన రష్యా దూకుడు ఉక్రెయిన్ రాజధాని, ఇతర నగరాల్లోకి చొచ్చుకొస్తున్న రష్యా సేనల దూకుడు ఆదివారం కాస్త తగ్గింది. సంఖ్యలో తక్కువగా ఉన్నా, ఉక్రెయిన్ బలగాలు పలు చోట్ల సాధ్యమైనంతమేర రష్యా చొరబాటును అడ్డుకుంటున్నారు. ఉక్రెయిన్ ప్రతిఘటన, అంతర్జాతీయ కఠిన ఆంక్షల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ‘అణు’ ఘంటికలు మోగించారు. దేశమంతా యుద్ధవాతావరణం నెలకొనడంతో వేలాది ఉక్రెయిన్ కుటుంబాలు పారిపోతున్నాయి. చాలామంది బంకర్లు, బేస్మెంట్లలో తలదాచుకుంటున్నారు. ఇప్పటివరకు యుద్ధంలో ఎంతమంది చనిపోయింది అధికారికంగా తెలియరాలేదు. 102 మంది పౌరులు మరణించారని, వందలాది మంది గాయపడ్డారని ఐరాస తెలిపింది. 352 మంది పౌరులు చనిపోయారని, వీరిలో 16మంది పిల్లలున్నారని జెలెన్స్కీ చెప్పారు. ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాను పాశ్చాత్య దేశాలు కొనసాగించాయి. కర్ఫ్యూ సడలించడంతో సోమవారం కీవ్‌లో సూపర్మార్కెట్ల వద్ద భారీ క్యూలు కనిపించాయి. సోమవారం నుంచి రష్యాకు తోడుగా బెలారస్ సైతం యుద్ధంలోకి బలగాలను పంపనుందని అమెరికా ఇంటిలిజెన్స్ వర్గాలు తెలిపాయి. రష్యా అనుకున్నదాని కన్నా ఆక్రమణ కష్టంగా, నెమ్మదిగా సాగుతోందని తెలిపాయి. ఉక్రెయిన్‌కు వెల్లువలా సాయం ఉక్రెయిన్‌కు సాయంగా స్టింగర్ మిస్సైళ్లను పంపుతామని జర్మనీ, అమెరికా ప్రకటించాయి. ఈయూ సైతం తొలిసారి ఒక దేశానికి ఆయుధాలు, మందుగుండు సరఫరా చేయనుంది. సోమవారం చర్చల కోసం ఈయూ రక్షణ మంత్రులు సమావేశం అవుతున్నారు. ఉక్రెయిన్‌కు అందే సాయాన్ని అడ్డుకోవడానికి రష్యా మార్గాలు వెతుకుతోంది. నాటో వర్గాలు రెచ్చగొడుతున్నాయంటూ ఆదివారం పుతిన్ చేసిన అణు హెచ్చరికలపై పాశ్చాత్య దేశాలు మండిపడ్డాయి. అవి కేవలం బెదిరింపులేనని భావిస్తున్నాయి. రష్యా ఏం చేస్తుందో.. కీవ్‌లోని పౌరులు సురక్షిత మార్గంలో నగరం వీడేందుకు అవకాశమిస్తామని రష్యా మిలటరీ ప్రకటించింది. దీంతో ఒక్కసారి నగరం వశమయ్యాక మిగిలిన పౌరులపై రష్యా విరుచుకుపడవచ్చన్న భయాలు పెరిగాయి. ప్రస్తుతం నగర రక్షణకు ముందుకు వస్తున్న ప్రతిఒక్కరికీ ఉక్రెయిన్ అధికారులు ఆయుధాలిస్తున్నారు. ఖార్కివ్‌తో పాటు చాలా నగరాల్లో రష్యా బలగాలను ఉక్రెయిన్ సేనలు ప్రతిఘటిస్తున్నాయి. దేశంలోని వైమానిక స్థావరాలన్నీ తమ అధీనంలోకి వచ్చాయని సోమవారం రష్యా సైనికులు ప్రకటించారు. దీనిలో నిజానిజాలపై యూఎస్ అనుమానం వ్యక్తం చేసింది. ఎవరేమన్నారు! చర్చలు ఐదు గంటలపాటు సాగాయి. ఉమ్మడి ప్రయోజనాలు కలిగించే కొన్ని విషయాలను ఇరు పక్షాలు గుర్తించాయి. మరో దఫా సమావేశమయ్యేందుకు అంగీకారం కుదిరింది. – రష్యా ప్రతినిధి వ్లాదిమిర్ మెడిన్ స్కీ కాల్పుల విరమణ అవకాశాలపై దృష్టి సారించాం. సమీప భవిష్యత్‌లో రెండో దఫా చర్చలు జరుగుతాయి. వీటిని పోలాండ్– బెలారస్ సరిహద్దుల్లో జరిపేందుకు అంగీకరించడం జరిగింది. – ఉక్రెయిన్ ప్రతినిధి మైఖైలో పొడోలైక్ -
న్యాయవ్యవస్థలో మౌలిక వసతుల లేమి!
అలహాబాద్: భారతీయ కోర్టులు ఇప్పటికీ అసంపూర్ణ మౌలిక సదుపాయాలతో పనిచేస్తున్నాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటి‹Ùపాలన అనంతరం న్యాయవ్యవస్థలో మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం రాజ్యమేలిందన్నారు. పరిష్కారానికే జాతీయ జ్యుడీíÙయల్ ఇన్ఫ్రా కార్పొరేషన్(ఎన్‌జేఐసీ) ఏర్పాటుతోనే ఈసమస్యకు పరిష్కారమని సూచించారు. ఉత్తరప్రదేశ్జాతీయ లా యూనివర్సిటీ, అలహాబాద్ హైకోర్టు నూతన భవన సదుపాయం శంకుస్థాపనలో రాష్ట్రపతితో పాటు ఆయన పాల్గొన్నారు. దేశీయ కోర్టుల్లో మెరుగైన వసతులు లేకపోవడం విచారకరమని, దీనివల్ల న్యాయసిబ్బంది పనితీరుపై ప్రభావం కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారం ఎన్‌జేఐసీ ఏర్పాటేనని అభిప్రాయపడ్డారు. దేశంలోని జాతీయ ఆస్తుల నిర్మాణ సంస్థలతో కలిసి ఎన్‌జేఐసీ పనిచేస్తుందని, జాతీయ కోర్టు డెవలప్మెంట్ ప్రాజెక్టుకు నమూనాలను అభివృద్ధి చేస్తుందని తెలిపారు. సరైన మౌలికవసతుల కల్పనతో న్యాయం పొందే మార్గం మరింత సుగమం అవుతుందన్నారు. అలహాబాద్ హైకోర్టులో పెండింగ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవడాన్ని ప్రస్తావిస్తూ, నూతన భవనంతో జ్యుడీషియరీ మరింత చురుగ్గా పనిచేసి పెండింగులను తగ్గిస్తుందని ఆశించారు. తీర్పులను వ్యవహారిక భాషలోకి అనువదించాన్న సూచన రాష్ట్రపతి కోవింద్దేనని ఆయన ప్రశంసించారు. ఆ తీర్పు సాహసోపేతం 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు జడ్జి జగ్మోహన్లాల్ సిన్హా ఇచి్చన తీర్పు అత్యంత సాహసోపేతమైనదని సీజేఐ రమణ ప్రశంసించారు. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఇందిర ఎన్నికను చెల్లకుండా చేసిన ఈ తీర్పు దేశంలో ఒక కుదుపు తెచ్చిందన్నారు. దీనికారణంగానే చివరకు ఇందిర ఎమర్జెన్సీ విధించారని గుర్తు చేశారు. అలహాబాద్ హైకోర్టుకు 150 సంవత్సరాల చరిత్రుందని కొనియాడారు. ఇక్కడనుంచి అనేకమంది గొప్ప న్యాయవాదులు, న్యాయమూర్తులు వచ్చారన్నారు. దీంతో పాటు అలహాబాద్ నగర ప్రాశస్త్యాన్ని కూడా ఆయన ప్రస్తుతించారు. -
మూడున్నర దశాబ్దాలైనా.. పూర్తికాని ‘లెండి ప్రాజెక్టు’
సాక్షి, కామారెడ్డి : అంతర్రాష్ట్ర ప్రాజెక్టు అయిన ‘లెండి’కి ని ధుల గ్రహణం వీడడం లేదు. మూడున్నర దశాబ్దాలు గడచినా పనులు పూర్తికావడంలేదు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మూడున్నర దశాబ్దాల క్రితం పునాదిరాయి పడింది. ఈ ప్రాజెక్టు కింద ఇరు రాష్ట్రాల్లో కలిపి 60వేల పైచిలుకు ఎకరాల భూములకు సాగునీరు అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. కానీ నిర్మాణ పనులకు, భూసేకరణ, నిధుల సమస్యలతో ప్రాజెక్టు పనులు కొనసాగడం లేదు. ప్రాజెక్టు పనులు పూర్తయితే వెనుకబడిన ప్రాంతమైన కామారెడ్డి జిల్లాలోని మద్నూర్, బిచ్కుంద మండలాల్లో దాదాపు 22వేల ఎకరాల మెట్ట భూములు సాగులోకి వస్తాయి. కేవలం వర్షాధారంపైనే ఆధారపడి ఆరుతడి పంటలు సాగు చేస్తున్న రైతులు లెండి ప్రాజెక్టు కోసం ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రాజెక్టు ముంపు రైతులకు పునరావాసం కింద అందించాల్సిన డబ్బులు అప్పట్లో పూర్తి స్థాయిలో చెల్లించకపోవడంతో ప్రాజెక్టు నిర్మాణం పెండింగులో పడిపోయింది. దీంతో ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తున్న రైతుల ఆశలు అడియాశలయ్యాయి. ప్రాజెక్టు పూర్తి కాకున్నా కెనాల్ పనులు చేపట్టిన దృశ్యం లెండి సామర్థ్యం 6.36 టీఎంసీలు.. మహారాష్ట్రలోని దెగ్లూర్ తాలూకా గోజేగావ్ గ్రామం వద్ద లెండి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 6.36 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. ఇందులో మహారాష్ట్రకు 3.93 టీఎంసీలు, తెలంగాణ రాష్ట్రానికి 2.43 టీఎంసీల నీటిని వాడుకునేలా నిర్ణయించారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.54.55కోట్లు.. ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టిన 1984 సంవత్సరంలో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.54.55 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అప్పట్లో నిధుల సమస్య, భూసేకరణ వంటి సమస్యలతో పనులకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా పనులు ఆగిపోవడంతో ఇప్పుడు అంచనా వ్యయం రూ.వెయ్యి కోట్లు దాటింది. అప్పట్లో ముంపు గ్రామాల రైతులకు పరిహారం విషయంలో అసంపూర్తి చెల్లింపులు జరగడంతో నిర్మాణానికి ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ ప్రాజెక్టు ద్వారా మహారాష్ట్రలోని దెగ్లూర్, ముఖేడ్ తాలూకాల పరిధిలోని గ్రామాల్లో 39,275 ఎకరాల ఆయకట్టుకు, తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాలోని మద్నూర్, బిచ్కుంద మండలాల్లోని గ్రామాల పరిధిలో 22 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు ప్రతిపాదించారు. 75శాతం పనులు పూర్తి.... గోజేగావ్ వద్ద చేపట్టిన లెండి ప్రాజెక్టు నిర్మాణ పనులు దాదాపు 75 శాతం పూర్తయ్యాయి. ప్రాజెక్టుకు 14 గేట్లు నిర్మించాల్సి ఉండగా, 10 గేట్ల నిర్మాణం అప్పుడే పూర్తయ్యింది. మరో నాలుగు గేట్ల నిర్మాణాలు పూర్తి కావలసి ఉంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత లెండి ప్రాజెక్టు పనులను కొలిక్కి తెచ్చే ప్రయత్నం జరిగింది. ప్రాజెక్టు కోసం రూ . 43.14 కోట్లు ఖర్చు చేశారు. అప్పుడు కామారెడ్డి జిల్లా పరిధిలోని మద్నూర్, బిచ్కుంద మండలాలకు సంబంధించి కెనాల్స్ పనులు జరిగాయి. కాని ప్రాజెక్టు పనులు మాత్రం అసంపూర్తిగానే ఉండిపోయాయి. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత లెండి ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.554.54 కోట్లని తేల్చారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 42 శాతం కింద రూ.236.10 కోట్లు, మిగతా మొత్తం రూ.318.45 కోట్లు మహారాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. రాష్ట్ర వాటాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.189.73 కోట్లు విడుదల చేసింది. అయినా పనులు మాత్రం ముందుకు సాగలేదు. దీంతో ప్రాజెక్టు అంచనా వ్యయం ఏటేటా పెరుగుతూనే ఉంది. పరిహారమే అసలు సమస్య... మహారాష్ట్రలో ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలకు పరిహారం విషయంలో అక్కడి ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడం వల్లే సమస్య పరిష్కారం కావడంలేదని అంటున్నారు. ఏటేటా అంచనా వ్యయం పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ప్రాజెక్టు వ్యయం రూ.వెయ్యి కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. అక్కడి ప్రభుత్వం చేస్తున్న జాప్యం వల్లే లెండి పనులు పూర్తి కాలేదని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్రఫడ్నవీస్తో ప్రాజెక్టులపై జరిగిన చర్చల సందర్భంగా సీఎం కేసీఆర్ లెండి ప్రాజెక్టు సమస్యపై కూడా చర్చించారు. అయినప్పటికీ సమస్య కొలిక్కిరావడం లేదు. రైతుల ఆశలు నెరవేరడం లేదు. జల వనరుల శాఖతోనైనా న్యాయం జరిగేనా.... రాష్ట్ర ప్రభుత్వం నీటి పారుదల శాఖలోని ఆయా విభాగాలన్నింటినీ కలిపి జలవనరుల శాఖను ఏర్పాటు చేసింది. కామారెడ్డి జిల్లా పరిధిలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, ఎత్తిపోతల పథకాలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 22వ ప్యాకేజీతో సహా అన్నింటినీ కామారెడ్డిలో ఏర్పాటు చేయబోయే చీఫ్ ఇంజనీర్ పరిధిలోకి తీసుకువచ్చారు. పరిపాలనా సౌలభ్యం కలుగనున్నందున లెండి ప్రాజెక్టు సమస్యపై పర్యవేక్షణ, పరిశీలనకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం లెండి ప్రాజెక్టుపై దృష్టి సారించాలని మద్నూర్, బిచ్కుంద ప్రాంత రైతాంగం వేడుకుంటోంది. ఏండ్ల సంది ఎదురు చూస్తున్నం... మాకు ఎలాంటి నీటి సౌకర్యం లేదు. లెండి ప్రాజెక్టు కడితే నీళ్లు వస్తయని ఏండ్ల సంది ఎదురు చూస్తున్నం. అప్పట్లో కాలువలు తవ్వి, లైనింగ్ జేసిండ్రు. నీళ్లు వచ్చినట్టేనని సంబరపడ్డం. ఏండ్లు గడుస్తున్నా పనులు పూర్తి కాలేదు. నీళ్ల సౌకర్యం లేక వానల మీద ఆధారపడి ఆరుతడి పంటలు వేస్తున్నం. కాలువలు వస్తే మా కష్టాలు తీరుతయి. –రాములు, రైతు, మద్నూర్ లెండి నీళ్లు వస్తయని చెపుతూనే ఉన్నరు... లెండి నీళ్లు వస్తయని, నీళ్లొస్తే మా భూములకు నీటి కష్టం తీరుతదని ఎదురు చూస్తున్నం. మస్తు సంవత్సరాల నుంచి లెండి ముచ్చట చెప్పుతనే ఉన్నరు. ఎప్పుడు కట్టుడు అయిపోతుందో, నీళ్లు ఎప్పుడు వస్తయో తెలుస్తలేదు. వానలు పడితేనే మాకు పంటలు, లేకుంటే ఇబ్బందులు తప్పడం లేదు. సర్కారు ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ఆదుకోవాలె. –నాగనాథ్, రైతు, మద్నూర్ -
విద్యార్థులకు విషమ ‘పరీక్ష’
* సిలబస్ పూర్తవకుండానే.. నిర్వహిస్తారట * 21 నుంచి సమ్మెటివ్–1 పరీక్షలు ప్రారంభం * వాయిదా వేయాలంటున్న ఉపాధ్యాయ సంఘాలు గుంటూరు ఎడ్యుకేషన్: సిలబస్ పూర్తి కాకముందే త్రైమాసిక పరీక్షలకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. పాఠశాల స్థాయి విద్యార్థులకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన పాఠ్యాంశాల బోధన పూర్తికాక ముందుగానే ఈ నెల 21 నుంచి సమ్మెటివ్–1 పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ రూపొందించిన అకడమిక్ కేలండర్లో పొందుపర్చారు. ఫలితంగా విద్యార్థులు చదవని పాఠ్యాంశాలకు సంబంధించి పరీక్షలు జరగనున్నాయి. చదవని పాఠాలపై పరీక్షలు! విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ కేలండర్‌ను అనుసరించి మొదటి నిర్మాణాత్మక మూల్యాంకనం (సమ్మెటివ్–1) పరీక్షలను ఈ నెల 21వ తేదీ నుంచి 28 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి 10వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులకు నిర్వహించాల్సి ఉంది. ఒకటో తరగతి నుంచి ఐదు తరగతి విద్యార్థులకు 24 నుంచి 28వ తేదీ వరకూ పరీక్షలు జరగనున్నాయి. సెప్టెంబర్ ముగిసేందుకు మరో 10 రోజులు వ్యవధి ఉండగానే, నెల మొత్తానికి సంబంధించిన సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుని పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థులు చదవని పాఠ్యాంశాలను సైతం ప్రశ్నపత్రాల్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులకు నష్టం.. గతంలో ఏటా ఆగస్టు నెల వరకూ మూడు నెలల సిలబస్‌పై ప్రథమ యూనిట్ పరీక్షలు నిర్వహిస్తున్న విధానంలో చేసిన మార్పుల కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఎదురయ్యాయి. ఉపాధ్యాయులు సైతం సిలబస్‌ను హడావుడిగా పూర్తి చేసి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరీ ముఖ్యంగా నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం (సీసీఈ) తో 20 శాతం మార్కులను విద్యార్థుల ఆల్‌రౌండ్ ప్రతిభ ఆధారంగా లెక్కించాల్సి ఉన్న దృష్ట్యా వారి ప్రగతిపై ప్రభావం చేపే అవకాశముంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నాయి. దసరా సెలవుల తర్వాత నిర్వహించాలి... సమ్మెటివ్–1 పరీక్షలను అక్టోబర్‌లో దసరా సెలవుల తర్వాత నిర్వహించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సీవీఎస్ మణి, ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. సెప్టెంబర్ పూర్తవకముందుగానే విద్యార్థులకు తెలియని పాఠ్యాంశాలపై ప్రశ్నపత్రాలను ఏ విధంగా రూపొందిస్తారని ప్రశ్నించారు. పరీక్షను వాయిదా వేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను కలవనున్నట్లు వారు చెప్పారు. -
కలెక్టర్ సీరియస్
శ్రీశైలం: కృష్ణాపుష్కరాల పనుల అసంపూర్తిపై గురువారం కలెక్టర్ విజయమోహన్ ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన పాతాళగంగ, లింగాలగట్టు ఘాట్లను సందర్శించారు. లింగాలగట్టు వద్ద మెట్లమార్గంలో పై భాగాన నాసిరకం కుళాయిలను ఏర్పాటు చేయడంతో పాటు అందుకు సంబంధించిన పైపులు కూడా లీకేజీలు అవుతున్నాయి. ఆ నీరు మెట్ల మార్గం ద్వారా తిరిగి పాతాళగంగలో కలుస్తుండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్లమార్గం కూడా నాణ్యత లేకుండా నిర్మించారని, కనీసం ప్లాస్టింగ్ కూడా చేయకపోవడంతో ఇంజనీర్లపై మండిపడ్డారు. -
ఇంకా అసంపూర్తిగా!
ప్రధాన ఘాట్లూ పూర్తికాలేదు పుష్కర నగర్‌లదీ అదే స్థితి పెండింగ్‌లోనే విద్యుద్దీకరణ, సుందరీకరణ పనులు సాక్షి, అమరావతి : పుష్కరాల గడువు రోజుల నుంచి గంటలకు వచ్చేస్తోంది. అయినా జిల్లాలో పుష్కర పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నా యి. ప్రధాన ఘాట్ల పనులూ ఇంకా పూర్తికాలేదు. పుష్కర నగర్‌లదీ అదే పరిస్థితి. భక్తులకు సౌకర్యాలు, వసతులు ఇంకా ఏర్పాటు కాలేదు. దీంతో బ్యూటిఫికేషన్, విద్యుదీకరణ పనులూ పెండింగ్‌లోనే ఉన్నాయి. జిల్లాలో ప్రధాన ఘాట్లయిన అమరావతి, సీతానగరం, పెనుమూడి సహా దాదాపు అనేక ఘాట్ల పరిస్థితి ఇలాగే ఉంది. విజయపురి సౌత్ నుంచి అమరావతి వరకు సాక్షి యంత్రాంగం క్షేత్రస్థాయిలో జరిపిన పరిశీలనలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనుపు ఘాట్ నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ తాత్కాలికంగా వేసిన విద్యుత్తు స్తంభాలు.. నీళ్లు వస్తే ఏక్షణానైనా కూలిపోయే ప్రమాదం ఉంది. పెనుమూడిలో అధికారులు జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఘాట్ వద్దకు నీళ్లు అవకాశం లేకపోవడంతో ఈ చర్యలు తీసుకుంటున్నారు. అమరావతిలో పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ఇంకా కొన్ని ఘాట్ల పనులు నిర్వహిస్తున్నారు. కాంక్రీట్, విద్యుద్దీకరణ పనులు కొనసాగుతున్నాయి. సీతానగరంలో టైల్స్ పనులు కొనసాగుతున్నాయి. పుష్కర నగర్లలో పూర్తికాని ఏర్పాట్లు.. అమరావతిలో మూడు పుష్కర నగర్లు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. గుంటూరు గోరంట్లలో 10 వేల మంది భక్తులు ఉండేం దుకు వీలుగా ఏర్పాటు చేస్తున్న పుష్కర నగర్ పనులు ఇంకా పూర్తికాలేదు. సౌకర్యాలకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అమరావతి ఆలయంలో సైతం దేవదాయ శాఖ పనులు సాగుతూనే ఉన్నాయి. ఘాట్లు, పుష్కరనగర్లకు నియమించిన ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు పదో తేదీ నాటికి చేరుకుని విధుల్లో పాలుపంచుకోనున్నారు. పులిచింతల నుంచి నీరు విడుదల చేసిన నేపథ్యంలో ప్రత్యేకాధికారులు విధుల్లో చేరాక ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఘాట్ల పనులు పూర్తి కాకుండానే ట్రయల్‌రన్ నిర్వహించాలంటే అధికారులు ఆందోళన చెందుతున్నారు. -
ఎక్కడి పనులు అక్కడే..!
సాక్షి, అమరావతి: జిల్లాలో ఘాట్ల నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. అనుపు ఘాట్ నిర్మాణ ఇంకా జరుగుతూనే ఉంది. అక్కడ తాత్కాలికంగా వేసిన విద్యుత్ స్తంభాలు నీళ్లు వస్తే ఏక్షణాన్నయినా కూలిపోయే ప్రమాదం ఉంది. పొందుగలో ఘాట్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అయితే నదిలో స్నానాలు చేసే దగ్గరే మురుగు, చెత్త వేశారు. అమరావతిలో పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఇంకా కొన్ని ఘాట్ల వద్ద 50 శాతం పనులు కూడా ప Nర్తికాని పరిస్థితి నెలకొంది. కాంక్రీట్, లైటింగ్ పనులు సాగుతున్నాయి. మొత్తం 1.3 కిలోమీటర్ల మేర ఘాట్ ఉంది. అయితే ఇక్కడ పనులు పూర్తి కాకపోవడంతో ధ్యానబుద్ద, అమరావతి ఘాట్లను కలుపకుండానే పనులు నిలిపివేశారు. అసంపూర్తిగా పుష్కర ఘాట్ల పనులు గడువు దాటిపోయినా సా..గుతున్న వైనం -
పుష్కర పనులు ఎక్కడివక్కడే!
కృష్ణా పుష్కరాలకు ఇంకా పది రోజులే సమయం పూర్తికాని ఘాట్లు, రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభ దశలోనే పుష్కరనగర్లు కృష్ణా పుష్కరాలు తరుముకొస్తున్నాయి.. ఇంకా పదిరోజులే గడువున్నా క్షేత్రస్థాయిలో పనులు పూర్తికాలేదు. ఘాట్ల పనులే అసంపూర్తిగా ఉంటే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసే పనులు ఎప్పటికి పూర్తవుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. అధికారుల మధ్య సమన్వయ లోపం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. సాక్షి, అమరావతి : జిల్లాలో పుష్కర పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత నెల 31 నాటికే పనులన్నీ పూర్తిచేస్తామని మంత్రులు, అధికారులు ప్రకటించినా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోలేదు. పుష్కరాలకు వచ్చే భక్తులకు చేయాల్సిన ఏర్పాట్లదీ అదే పరిస్థితి. పుష్కరాల విధుల్లో పాల్గొనే సిబ్బందికి భోజనం, వసతి ఏర్పాట్లు పూర్తికాలేదు. ఎక్కడ ఏర్పాటు చేయాలనేదానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. అసంపూర్తిగా పనులు.. జిల్లాలో ప్రధాన ఘాట్ల పనులు ఇంకా పూర్తికాలేదు. అమరావతిలో ఇంకా టైల్స్ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. అవి పూర్తయ్యాక టూరిజం శాఖ ఆధ్వర్యంలో విద్యుద్దీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. పుష్కర నగర్ల పనులు ప్రారంభ దశలోనే ఉన్నాయి. పిండ ప్రదానం షెడ్ల పనులూ మందకొడిగా సాగుతున్నాయి. సీతానగరం, పెనుమూడి ఘాట్ల పనులు కొలిక్కిరాలేదు. ఈ పనులన్నీ ఎప్పటికి పూర్తవుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. దాదాపు 15 ఘాట్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయి.. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే ముఖ్యమైన ఘాట్ల పనులు పూర్తికాకపోవడం అధికారులను కలవరపెడుతోంది. ఆర్అండ్బీ శాఖ చేపట్టే పనులూ ఇంకా పూర్తికాలేదు. ఈ నెల ఐదో తేదీ నాటికి పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గుంటూరు నగరంలో రోడ్డు పనులు ఆశించిన స్థాయిలో జరగటం లేదు. ఇంకా కార్పొరేషన్ అధికారులే డ్రెయిన్ల పనులు పూర్తి చేయని పరిస్థితి నెలకొంది. రోడ్లు భవనాల శాఖ పనులు కూడా పూర్తిస్థాయిలో పూర్తవలేదు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా తాత్కాలికంగా రోడ్డు పనులు చేసి సరిపెట్టే యత్నాల్లో ఆ శాఖ అధికారులు ఉన్నారు. అధికారుల్లో సమన్వయలోపం.. పుష్కర పనుల్లో వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఘాట్ల వద్ద బారికేడింగ్ ఏర్పాట్లు ఎవరు చేయాలనే అంశం ప్రత్యేకాధికారి రాజశేఖర్ సమీక్ష చేసేవరకు పట్టించుకోకపోవడం గమనార్హం. దేవాదాయ, నీటిపారుదల, రహదారులు, భవనాల శాఖల మధ్య సమన్వయం కొరవడటమే దీనికి కారణం. వైద్యశాఖ తరఫున శిబిరాల ఏర్పాటు, మందుల కొనుగోలు కోసం అధికారులను నియమించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎవ్వరూ దృష్టిసారించలేదు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆలయాల ఆధునికీకరణకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించినా పనులు మాత్రం పూర్తికాలేదు. ఘాట్లలో పూజలు చేసేందుకు వీలుగా పూజారులను గుర్తించామని చెబుతున్నా, వారికి గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. జిల్లాలో జరుగుతున్న పుష్కర పనులు, ఏర్పాట్లపై ఆదివారం జరిగిన సమీక్ష సమావేశంలో పుష్కరాల ప్రత్యేకాధికారి రాజశేఖర్ పలు శాఖల అధికారులపై మండిపడ్డారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులు, ఏర్పాట్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం జిల్లాలో పుష్కర పనులకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్లో సమాచారాన్ని అప్డేట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పూర్తి కాని సెర్చ్
♦ అసంపూర్తిగా కమిటీ సమావేశం ♦ 6న మరోసారి సమావేశం ♦ వీసీ అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ ఏయూ క్యాంపస్: సెర్చ్ పూర్తి కాలేదు.. అలా అనే కంటే.. ప్రభుత్వం తరఫున సీఎం ఒక పేరు ఇంకా సూచించనందునే కమిటీ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. దాంతో ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ పదవికి అభ్యర్థి ఎంపికకు ఏప్రిల్ ఆరో తేదీన మరోసారి సమావేశం కావాలని సెర్చ్ కమిటీ నిర్ణయించింది. ఉపకులపతి ఎంపిక కోసం ఏర్పాటు చేసిన ఈ కమిటీ తొలిసారి శుక్రవారం ఉదయం సమావేశమైంది. హైదరాబాదులో జరిగిన ఈ సమావేశానికి సభ్యులు అనందకృష్ణన్, రాజ్‌పాల్ సింగ్, సుమిత్రా దావ్రాలు హాజరయ్యారు. తమకు అందిన దరఖాస్తులను మధ్యాహ్నం 2 గంటల వరకు పరిశీలించినట్లు తెలిసింది. అయితే దరఖాస్తులు ఎక్కువగా రావడం, పరిశీలన పూర్తికాకపోవడంతో వచ్చేనెల ఆరో తేదీన మరోసారి భేటీ కావాలని సభ్యులు నిర్ణయించినట్లు సమాచారం. ఆ సమావేశంలో తుది జాబితా సిద్ధం చేసే అవకాశం ఉంది. కమిటీ తమకు అందిన దరఖాస్తులను పరిశీలించి వడపోసి ముగ్గురు పేర్లతో జాబితాను ముఖ్యమంత్రికి, అక్కడ నుంచి గవర్నర్‌కు పంపాల్సి ఉంది. అయితే వీసీ పదవికి వందకు పైగా దరఖాస్తులు అందాయి. వీటన్నింటినీ పరిశీలించడం పెద్దపనిగా మారింది. ఈ పని పూర్తి కాకపోవడంతో తుది జాబితా తయారీకి మరో సమావేశం నిర్వహించడం తప్పనిసరి అయ్యింది. కాగా వీసీ ప్యానల్ జాబితాకు ముఖ్యమంత్రి నుంచి ప్రభుత్వం తరపున ఒక పేరును సూచించాల్సిన అవసరం ఉంది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆ పదవిని ఎవరికి కేటాయించాలనే విషయంలో తుది నిర్ణయానికి రాలేకపోతున్నారని సమాచారం. సమావేశం అసంపూర్తిగా ముగియడానికి ఇదీ ఓ కారణమని తెలిసింది. సీఎం కార్యాలయం నుంచి ఖచ్చితమైన సమాచారం అందితే రానున్న సమావేశంలో ముగ్గురి పేర్లతో జాబితా సిద్ధం అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా గతంలో వీసీ ఎంపిక విషయంలోనూ సెర్చ్ కమిటీ పలుమార్లు సమావేశం కావడాన్ని వర్సిటీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. రెండు పర్యాయాలు కమిటి సభ్యులు భేటీ అయిన తరువాతనే పేర్లు కొలిక్కి వచ్చిందంటున్నారు. ఈసారి కూడా అదే సంప్రదాయం కొనసాగుతోందని అంటున్నారు. -
సర్దార్ పటేల్ లేకుంటే గాంధీ లేరు: మోదీ
న్యూఢిల్లీ: మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకుంటే మహాత్మా గాంధీ పోరాటం సైతం అసంపూర్తిగా మిగిలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత స్వాతంత్ర్యోద్యమంలో సర్దార్ పటేల్, గాంధీ పాత్ర అసాధారణమని, ఉద్యమాన్ని బలోపేతం చేసిందని మోదీ పేర్కొన్నారు. శుక్రవారం పటేల్ 139 జయంతిని పురస్కరించుకుని మోదీ ఘనంగా నివాళులు అర్పించారు. పటేల్ జయంతిని కేంద్రం జాతీయ ఏక్తా దినోత్సవంగా ఘనంగా నిర్వహిస్తోంది. న్యూఢిల్లీలో నిర్వహించిన సమైక్యత పరుగులో మోదీ పాల్గొనగా, వేలాదిమంది ఆయనను అనుసరించారు. అంతకుముందు పార్లమెంట్‌కు సమీపంలోని పటేల్ విగ్రహానికి మోదీ పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. దేశానికి పటేల్ చేసిన సేవలను కొనియాడారు. పటేల్ తన జీవితాన్ని జాతి సమగ్రత కోసం అంకితం చేశారన్నారు. ఇదే రోజు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్థంతి. మోదీ ఇందిరను గుర్తు చేసుకుంటూ.. 30 ఏళ్ల క్రితం దురదృష్టవశాత్తు ఇదే రోజు దారుణం చోటుచేసుకుందని అన్నారు. 1984లో జరిగిన అల్లర్లు జాతి సమగ్రతను దెబ్బతీశాయన్నారు. కాంగ్రెస్ సంకుచిత సిద్ధాంతాల కోసం చరిత్రను, వారసత్వాలను చీల్చవద్దని మోదీ హితవు పలికారు. కాగా ఇందిరా గాంధీకి మోదీ ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించారు. -
నా జీవితం అసంపూర్తిగా ఉంది: ప్రియాంక
మిస్ వరల్డ్‌గా గ్లామర్ ప్రపంచంలో వెలుగుచూసిన అందాల ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా.. నటనలోనూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. బాలీవుడ్ అగ్రతారల్లో ఒకరిగా ఎదిగారు. అయినా తన జీవితం అసంపూర్తిగా ఉందని ప్రియాంక చెబుతోంది. దీనికి కారణం తండ్రి లేని లోటేనని అన్నారు. భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్‌గా రిటైరయిన ప్రియాంక తండ్రి అశోక్ చోప్రా ఆమె కెరీర్ ఉన్నతికి ఎంతో కృషి చేశారు. కేన్సర్ బారిన పడ్డ అశోక్ గతేడాది మరణించారు. శనివారం ప్రియాంక తండ్రి అశోక్ చోప్రా తొలి జయంతి. ఈ సందర్భంగా ఆమె తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు. 'కొన్ని సార్లు ఎక్కువగా మాట్లాడుతుంటాను. ఈ రోజు మాత్రం మౌనంగా ఉండాలనిపిస్తోంది. నాన్నా నీవు లేనందుకు నా జీవితం ఎప్పుడూ అసంపూర్తిగానే ఉంటుంది. ఈ రోజు నా మనస్సులో అన్నీ నీ జ్ఞాపకాలు, ఆలోచనలే. ఏదో వెలితిగా ఉన్నట్టుంది. హ్యాపీ బర్త్డ్డ్డే నాన్నా' అంటూ ప్రియాంక ట్వీట్ చేశారు.