ప్లాస్టింగ్ లేని మెట్ల విషయంపై ఆ«గ్రహం వ్యక్తం చేస్తున్న కలెక్టర్
శ్రీశైలం:
కృష్ణాపుష్కరాల పనుల అసంపూర్తిపై గురువారం కలెక్టర్ విజయమోహన్ ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన పాతాళగంగ, లింగాలగట్టు ఘాట్లను సందర్శించారు. లింగాలగట్టు వద్ద మెట్లమార్గంలో పై భాగాన నాసిరకం కుళాయిలను ఏర్పాటు చేయడంతో పాటు అందుకు సంబంధించిన పైపులు కూడా లీకేజీలు అవుతున్నాయి. ఆ నీరు మెట్ల మార్గం ద్వారా తిరిగి పాతాళగంగలో కలుస్తుండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్లమార్గం కూడా నాణ్యత లేకుండా నిర్మించారని, కనీసం ప్లాస్టింగ్ కూడా చేయకపోవడంతో ఇంజనీర్లపై మండిపడ్డారు.