
ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు(కేసీఆర్) శనివారం ప్రారంభించారు.
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు(కేసీఆర్) శనివారం ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలో ఐఏఎంసీ ప్రారంభించడం ఆనందంగా ఉందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. రాజీ-మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. తక్కువ కాలంలో మంచి వసతులతో ఐఏఎంసీ ఏర్పాటైందని.. ఐఏఎంసీ ఏర్పాటుకు సహకరించిన సీఎం కేసీఆర్‌కు ఎన్వీ రమణ ధన్యవాదాలు తెలిపారు.
చదవండి: వచ్చే ఐదేళ్లలో 50 వేల ఉద్యోగాలు!
అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా హైదరాబాద్: సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా హైదరాబాద్ పురోగమిస్తోందని.. అనేక రంగాల్లో హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారుతోందన్నారు. ఐఏఎంసీ ఏర్పాటుకు జస్టిస్ ఎన్వీ రమణ ప్రధాన పాత్ర పోషించారన్నారని సీఎం కేసీఆర్ అన్నారు.