security breach
-
పార్లమెంట్‌లోకి నోట్ల కట్ట తీసుకెళ్లకూడదా?
రాజ్యసభలో కరెన్సీ నోట్ల కట్ట కనిపించడం తాజాగా కలకలం సృష్టించింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వాదానికి కారణమైంది. సమగ్ర దర్యాప్తు-కుట్ర అని పరస్పరం ఆరోపించుకున్నాయవి. తీవ్ర గందరగోళం మధ్య సభ వాయిదా కూడా పడింది. కానీ, ఒక చట్ట సభ్యుడు నిజంగా అలా నోట్ల కట్టతో సభకు వెళ్లకూడదా?.. ఇది రాజకీయ రాద్ధాంతం చేయాల్సిన అంశమా?.. అసలు అంత తీవ్రంగా పరిగణించాల్సిన విషయమా?పార్లమెంట్ అంటే చట్ట సభ్యులు కొలువుదీరే భవనం. కాబట్టి.. హైసెక్యూరిటీ జోన్ అని అందరికీ ఓ అభిప్రాయం ఉంటుంది. అయితే పార్లమెంట్లో భాగమైన రాజ్యసభలో.. అదీ ఓ సభ్యుడి సీటు దగ్గర డబ్బు దొరకడం కచ్చితంగా తీవ్రమైన అంశమే!. పార్లమెంట్‌లోకి ఏది పడితే అది తీసుకురావడానికి ఆస్కారం ఉందన్న సంకేతాలను పంపిచింది ఈ ఘటన.‘‘ప్రతి సీటు చుట్టూ గాజు గదినిగానీ, ముళ్లతో కూడిన ఇనుప కంచెనుగానీ ఏర్పాటుచేయాలి. సభ్యులు వాటికి తాళాలు వేసుకుంటే.. తాము ఇంటికెళ్లాక సీట్ల వద్ద ఇతరులెవరూ గంజాయి, కరెన్సీ నోట్లు పెట్టకుండా నివారించొచ్చు’’.. నోట్ల కట్ట దొరికిన సీటు ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ కామెంట్అసలేం జరిగిందంటే..శుక్రవారం రాజ్యసభ నడుస్తుండగా.. చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ మాట్లాడుతూ.. ‘‘గురువారం సభ వాయిదా పడిన తర్వాత భద్రతా అధికారులు లోపల సాధారణ తనిఖీలు చేపట్టారు. 222వ నంబరు సీటు వద్ద నోట్ల కట్టను వారు గుర్తించారు. అది తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన సీటు. ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకురాగానే నిబంధనల ప్రకారం దర్యాప్తునకు ఆదేశించా. ఈ విషయాన్ని సభకు తెలియజేయడం నా బాధ్యత’’ అన్నారు.#WATCH | Rajya Sabha Chairman Jagdeep Dhankhar says, "I here by inform the members that during the routine anti-sabotage check of the chamber after the adjournment of the House yesterday. Apparently, a wad of currency notes was recovered by the security officials from seat number… pic.twitter.com/42GMz5CbL7— ANI (@ANI) December 6, 2024రాజకీయ దుమారంతో..చైర్మన్ చేసిన ఈ ప్రకటన రాజకీయ దుమారం రేపింది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు పరస్పరం మాటల యుద్ధానికి దిగారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలంటూ బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ధన్‌ఖడ్ ప్రకటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. నోట్ల కట్ట వ్యవహారంపై దర్యాప్తునకు తమకు అభ్యంతరమేమీ లేదని.. కానీ, దర్యాప్తు పూర్తికాకముందే సభ్యుడి పేరు బయటకు చెప్పడమేంటని ప్రశ్నించారు. సభను సజావుగా జరగనివ్వకూడదనే కుట్రలో ఇది భాగంకావొచ్చని అనుమానం వ్యక్తం చేశారాయన. అయితే..ఖర్గే స్పందనను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తప్పుబట్టారు. ఏ సీటు వద్ద కరెన్సీ దొరికిందో.. అక్కడ ఎవరు కూర్చుంటారో.. ఛైర్మన్ చెప్పడంలో తప్పేముందని ప్రశ్నించారు. నోట్ల కట్టను సభకు తీసుకురావడం చాలా తీవ్రమైన అంశమని, దానిపై సమగ్ర దర్యాప్తు అవసరమని పేర్కొన్నారు. రాజ్యసభ సమగ్రతకు కాంగ్రెస్ భంగం కలిగించిందంటూ మరో సభ్యుడు, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. సభ్యులెవరూ శాంతించకపోవడంతో.. సభ వాయిదా పడింది. అరుదుగా జరిగిన ఘటన.. అందునా రాజకీయ దుమారం రేగడంతో మీడియా కూడా అంతే హైలైట్ చేసి చూపించింది.మరి ఇంత వీకా?అయితే సదరు సభ్యుడు ఆరోపిస్తున్నట్లు ఇది ముమ్మాటికీ భద్రతా వైఫల్యమే!. గత అనుభవాల దృష్ట్యా సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం గురించి ఇక్కడ ప్రస్తావించాలి. సరిగ్గా కిందటి ఏడాది ఇదే నెలలో లోక్‌సభలోనూ భద్రతా వైఫల్యం బయటపడింది. సెషన్ జరుగుతున్న టైంలో పబ్లిక్ గ్యాలరీ నుంచి ఛాంబర్లోకి దూకిన ఇద్దరు.. టియర్ గ్యాస్ షెల్స్‌తో అలజడి సృష్టించేందుకు ప్రయత్నించారు. కొందరు ఎంపీలు, సెక్యూరిటీ సిబ్బంది ఆ ఇద్దరినీ నిలువరించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. హైటెక్ హంగులతో నిర్మించిన కొత్త పార్లమెంట్‌లోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే.. ఇక పాత పార్లమెంట్ భవనం ఉన్నప్పుడు 2001లో జరిగిన ఉగ్రదాడి సంగతి సరేసరి.ఇదీ చదవండి: పార్లమెంట్ భద్రతా ఎవరి బాధ్యతో తెలుసా? మరోవైపు ఈ ఘటనతో పార్లమెంట్ ఔనత్యంపై ప్రజల్లోనూ పలు అనుమానాలు కలగొచ్చు. చట్ట సభల్లోనే సభ్యుల్ని కొనుగోలు చేసే ప్రయత్నమా? లేదంటే డబ్బుతో ప్రభావితం చేయాలనుకుంటున్నారా? లేకుంటే.. విపక్ష సభ్యుడి సీటు దగ్గరే దొరకడంలో ఏదైనా కుట్ర దాగి ఉందా?.. అనే ప్రశ్నలు తలెత్తే అవకాశం లేకపోలేదు. వీటిని నివృత్తి చేయడానికైనా రాజ్యసభలో నోట్ల కట్ట బయటపడడంపై రాద్ధాంతం కాకుండా.. చర్చ జరగాల్సిందేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. -
Arvind Kejriwal: ఢిల్లీలో టెన్షన్.. కేజ్రీవాల్‌పై దాడికి యత్నం.!
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై దాడికి ప్రయత్నం జరిగింది. వెంటనే అప్రమత్తమైన ఆప్ నాయకులు.. దాడికి పాల్పడిన యువకుడిని అడ్డుకున్నారు. దీంతో, అక్కడ ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది.వివరాల ప్రకారం.. మాజీ సీఎం కేజ్రీవాల్ కైలాశ్ ప్రాంతంలో శనివారం పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనూహ్యంగా పాదయాత్రలోకి ఓ యువకుడు చొరబడి.. కేజ్రీవాల్‌పై దాడికి యత్నించాడు. తన చేతిలో ఉన్న ఏదో ద్రావణాన్ని కేజ్రీవాల్‌పై చల్లే ప్రయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన ఆప్ నాయకులు, కార్యకర్తలు.. సదురు యువకుడిని పట్టుకున్నారు. అనంతరం, అతడిని చితకబాదారు. ఈ ఘటనతో అక్కడి ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.🚨 Security breach: Man throws liquid at former CM Arvind Kejriwal, detained by police 🚨 pic.twitter.com/92nVej1YUJ— Rahul kushwaha (@myy_Rahul) November 30, 2024 అయితే, కేజజ్రీవాల్పై దాడి చేసింది బీజేపీ కార్యకర్తే అని ముఖ్యమంత్రి అతిశి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో దాడికి పాల్పడిన వ్యక్తికి సంబంధించిన ఫొటోను ఆమె.. తన ట్విట్టర్లో షేర్ చేశారు. మోదీతో సహా అతను ఆ ఫొటోలో ఉండటం గమనార్హం.आज दिन दहाड़े भाजपा के कार्यकर्ता ने @ArvindKejriwal जी पर हमला किया। दिल्ली का चुनाव तीसरी बार हारने की बौखलाहट भाजपा में दिख रही है।भाजपा वालों: दिल्ली के लोग ऐसी घटिया हरकतों का बदला लेंगे। पिछली बार 8 सीटें आयीं थी, इस बार दिल्ली वाले भाजपा को ज़ीरो सीट देंगे pic.twitter.com/LgJGN1aQ0T— Atishi (@AtishiAAP) November 30, 2024ఇదిలా ఉండగా, అంతకుముందు కేజ్రీవాల్.. ఢిల్లీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీని గ్యాంగ్స్టర్లు నడిపిస్తున్నారని ఆరోపించారు. నగరంలో నిత్యం కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఘాటు విమర్శలు చేశారు. ఢిల్లీని కొన్ని ముఠాలు నడిపిస్తున్నట్లు తనకు అనిపిస్తోందని సంచలన కామెంట్స్ చేశారు. దీంతో, మరోసారి కేంద్రం, ఆప్ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం మొదలైంది. అనంతరం, ఆప్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండించారు. -
జగన్ పిఠాపురం పర్యటనలో భద్రతా లోపం
సాక్షి, పిఠాపురం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలో మరోసారి భద్రతా లోపం స్పష్టంగా కనిపించింది. వైఎస్ జగన్ పిఠాపురం పర్యటన సందర్భంగా ఆయన భద్రత అంశం ప్రశ్నార్థకంగా మారింది. ఇంతకుముందు జిల్లాల పర్యటనల సమయంలో కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తింది.కాగా, వైఎస్ జగన్‌కు కల్పిస్తున్న భద్రత సరిపోలేదని ఇది వరకే పలుమార్లు వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉద్దేశ్యపూర్వకంగానే వైఎస్ జగన్‌కు భద్రతను కుదించింది. ఇక, వైఎస్ జగన్ జిల్లాల పర్యటన సందర్భంగా భద్రతా లోపం బయటపడుతున్నప్పటికీ కూటమి సర్కార్‌కు చీమకుట్టినట్టు కూడా లేదు. ఇదే విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం గమనార్హం. దీంతో, చంద్రబాబు సర్కార్ తీరుపై వైస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.తాజాగా వైఎస్ జగన్ పిఠాపురంలో పర్యటిస్తున్న సమయంలో ఆయన కారుపైకి కొందరు యువకులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. కొందరు యువకులు ఒక్కసారిగా ఆయనను చుట్టుముట్టారు. అలాగే ఈరోజు ఉదయం హెలికాప్టర్ ల్యాండ్ అయిన సందర్భంలో కూడా హెలిపాడ్ కిక్కిరిసిపోయింది. ఇక్కడ తగినంత భద్రతను పోలీసులు కల్పించలేదు. అయితే, వైఎస్ జగన్ అంటే గిట్టని వారు అభిమానుల ముసుగులో ఏదైనా చేస్తే బాధ్యత ఎవరు వహిస్తారని పార్టీ నేతలు ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా గతంలో వైఎస్ జగన్‌పై జరిగిన దాడులను గుర్తు చేస్తున్నారు. -
పార్లమెంట్ అలజడి ఘటన.. నిందితులకు మానసిక పరీక్షలు
ఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసులో నిందితులను మానసిక పరీక్షలు(సైకో ఎనాలసిస్) నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలతో పార్లమెంట్ అలజడి ఘటనకు పాల్పడటానికి నిందితుల అసలు ఉద్దేశం తెలుసుకునే అవకాశం ఉంటుంది. గురువారం ఒక నిందితున్ని ఫోరెన్సిక్ సైన్స్ లాబెరేటరీకి తీసుకెళ్లారు. ఒక్కొక్కర్ని ఈ పరీక్షలకు తీసుకెళ్లనున్నారు. సైకో ఎనాలసిస్ పరీక్షల్లో నిందితుల అలవాట్లు, నిత్య జీవణ శైలి, స్వభావం తదితరాలు తెలుసుకుంటారు. సైక్రియాట్రిస్ట్ ప్రశ్న-జవాబుల విధానంలోనే ఈ టెస్ట్ ఉంటుంది. ఇచ్చిన జవాబుల ఆధారంగా నిందితుల వెనక ఉన్న అసలు ఉద్దేశాలను వైద్యులు అంచనా వేస్తారు. ఈ పరీక్షలు దాదాపు మూడు గంటలపాటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరుపుతారు. శ్రద్ధా వాకర్ మర్డర్ కేసు, షహ్బాద్ డైరీ మర్డర్ కేసుల్లో నిందితులపై పోలీసులు ఇలాంటి పరీక్షలను నిర్వహించారు. డిసెంబర్ 13న పార్లమెంట్‌లోకి నలుగురు ఆగంతకులు ప్రవేేశించారు. ఇద్దరు లోక్‌సభ లోపల గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో గ్యాస్ బాంబులను ప్రయోగించారు. దీంతో పార్లమెంట్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అంశంతో పార్లమెంట్ భద్రతా విధులను ఢిల్లీ పోలీసుల నుంచి కేంద్ర బలగాలకు బదిలీ చేశారు. ఇదీ చదవండి: పార్లమెంట్లో మరో ముగ్గురు ఎంపీల సస్పెండ్.. మొత్తం 146 మంది -
పార్లమెంట్.. విపక్షాలది ఫ్రస్ట్రేషన్: మోదీ
Parliament Winter Session 2023 Updates ►లోక్‌సభలో కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్.. స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. టెలికమ్యునికేషన్ బిల్లు-2023 పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లు భవిష్యత్తులో ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. Deputy Leader of Congress in Lok Sabha, Gaurav Gogoi writes to Lok Sabha Speaker Om Birla, expressing his "deep concern about the Telecominniocation Bill 2023. In its current form, the Bill raises several serious concerns that have the potential to negatively impact the future of… pic.twitter.com/81nSyleKma — ANI (@ANI) December 19, 2023 ►కేంద్ర వస్తు సేవల పన్ను (రెండవ సవరణ) బిల్లు- 2023 లోక్‌సభలో ఆమోదం పొందింది. The Provisional Collection of Taxes Bill, 2023 taken up for consideration and passing in Lok Sabha. — ANI (@ANI) December 19, 2023 ► ప్రొవిజినల్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్-2023ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. The Provisional Collection of Taxes Bill, 2023 taken up for consideration and passing in Lok Sabha. — ANI (@ANI) December 19, 2023 ► రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంఖర్‌పై మిమిక్రీ చేయడం సభ హక్కులను దిక్కరించడమేనని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు అన్నారు. "Contemptible": Kiren Rijiju slams Rahul Gandhi for filming TMC's Kalyan Banerjee mimicking Rajya Sabha Chairman Read @ANI Story | https://t.co/B5BomJ328f#KalyanBanerjee #RajyaSabha #RahulGandhi pic.twitter.com/6wQgyUPRrW — ANI Digital (@ani_digital) December 19, 2023 ► ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి తర్వాత విపక్షాలు ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నాయని ప్రధాని మోదీ చురకలు అంటించారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. Venting out frustration after poll routs: PM Modi calls out Oppn for 'political spin' to Parliament security breach Read @ANI Story | https://t.co/r9FJB4hexS#BJP #PMModi #Parliament pic.twitter.com/dP60IxCqg3 — ANI Digital (@ani_digital) December 19, 2023 ►పార్లమెంటు వెలుపల తనపై మిమిక్రీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ మండిపడ్డారు. ఎంపీ స్థానంలో ఉండి సభాధ్యక్షున్ని హేళన చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. #WATCH | "Ridiculous, unacceptable", says Jagdeep Dhankhar after TMC MP Kalyan Banerjee mimics Rajya Sabha Chairman and Congress MP Rahul Gandhi films the act. pic.twitter.com/F3rftvDmhJ — ANI (@ANI) December 19, 2023 ఎన్సీఆర్ ఢిల్లీ సవరణ బిల్లు, సీజీఎస్టీ సవరణ బిల్లులకు లోక్‌సభ ఆమోదం #WATCH | National Capital Territory of Delhi Laws (Special Provisions) Second (Amendment) Bill, 2023 taken up for consideration and passing in Lok Sabha. pic.twitter.com/dmAXVkSdtp — ANI (@ANI) December 19, 2023 పార్లమెంట్ నుంచి మరింత మంది ఎంపీల సస్పెన్షన్ లోక్‌సభ, రాజ్యసభల నుంచి మరింత మంది ఎంపీల సస్పెన్షన్ ఇవాళ ఒక్కరోజే లోక్‌సభ నుంచి 49 మంది ఎంపీల సస్పెన్షన్ నిన్న 33 మంది ఎంపీలు..అంతకుముందు 13 మంది సస్పెన్షన్ లోక్‌సభ నుంచి 95 మంది, రాజ్యసభ నుంచి 46 మంది ఎంపీల సస్పెండ్ ఈ సెషన్లో మొత్తం 141 మంది ఎంపీలు బయటికి More Opposition MPs in Lok Sabha including Supriya Sule, Manish Tewari, Shashi Tharoor, Md Faisal, Karti Chidambaram, Sudip Bandhopadhyay, Dimple Yadav and Danish Ali suspended for the remainder of the winter session of Parliament pic.twitter.com/nxcUVnlVEn — ANI (@ANI) December 19, 2023 అపోజిషన్ ముక్త్ పార్లమెంట్‌కు బీజేపీ ప్రయత్నం : శశి థరూర్ ప్రభుత్వం ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తోంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసి చర్చ లేకుండా బిల్లులు పాస్ చేసుకోవాలనుకుంటోంది పార్లమెంట్ డెమొక్రసీకి ఇవాళ చచ్చిపోయింది #WATCH | On suspension of more than 40 MPs from Lok Sabha, including his own, Congress MP Shashi Tharoor says, "...It is clear that they want an Opposition-mukt Lok Sabha and they will do something similar in Rajya Sabha. At this point, unfortunately, we have to start writing… pic.twitter.com/mh9LeXEgiB — ANI (@ANI) December 19, 2023 లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా విపక్షాల నినాదాల మధ్య లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా ప్లకార్డులు ప్రదర్శించవద్దని కోరిన స్పీకర్ పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై హోం మంత్రి స్టేట్మెంట్కు విపక్షాల పట్టు గాంధీ విగ్రహం వద్ద ఖర్గే, శరద్‌పవార్ నిరసన 92 మంది ఎంపీల సస్పెన్షన్‌పై విపక్షాల ఆందోళన పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద నేతల నిరసన #WATCH | Opposition MPs including NCP's Sharad Pawar and Congress' Mallikarjun Kharge stage protest in front of Gandhi Statue in Parliament premises, after the suspension of 92 MPs for the remainder of the ongoing winter session pic.twitter.com/WKzk0xa1TP — ANI (@ANI) December 19, 2023 పార్లమెంటు సమావేశాలను బహిష్కరించిన విపక్షాలు నేడు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలో విపక్ష నేతల భేటీ పార్లమెంట్ సమావేశాల బహిష్కరించాలని నిర్ణయించిన పార్టీలు ఒక్కరోజే ఉభయ సభలో 78 మంది ఎంపీల సస్పెన్షన్ పై విపక్షాల ఆగ్రహం మొత్తం 92 మంది ఎంపీలపై పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ వేటు సస్పెండైన ఎంపీలు మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నా చేయాలని నిర్ణయం కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ భద్రతా వైఫల్యానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలు నేడు పార్లమెంటులో కీలక బిల్లులు ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్టుల స్థానంలో కొత్త బిల్లులు నిన్న విపక్ష ఎంపీల సస్పెన్షన్ తో సాఫీగా సభా కార్యక్రమాలు జరిగే చాన్స్ సస్పెన్షన్‌పై పార్లమెంట్ బయట ఆందోళన చేపట్టనున్న విపక్ష ఎంపీలు లోక్ సభలో బిల్లులపై చర్చ ప్రారంభించనున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా బ్రిటిష్ కాలం నాటి చట్టాల పేరు మార్పు ఐపీసీని భారత న్యాయ సంహితగా పేరు మార్పు సిఆర్పీసీకి భారత నాగరిక సురక్ష సంహితగా చేంజ్ ఎవిడెన్స్ యాక్టుకు భారత సాక్ష బిల్లుగా నామకరణం కొత్త బిల్లులకు హిందీ పేర్లు పెట్టడంపై విపక్షాల ఆందోళన హిందీ పేర్లతో వల్ల న్యాయ ప్రక్రియలో అయోమయం ఏర్పడే అవకాశం ఉందంటున్న విపక్షాలు -
Parliament security breach: వారి ‘ఫేస్బుక్’ వివరాలివ్వండి
న్యూఢిల్లీ: లోక్‌సభలో పొగబెట్టిన ఉదంతంలో అరెస్టయిన నిందితుల ‘ఫేస్బుక్’ ఖాతాల వివరాలు ఇవ్వాలని ‘మెటా’ సంస్థను ఢిల్లీ పోలీసులు కోరారు. నిందితులు సభ్యులుగా ఉన్న, ప్రస్తుతం మనుగడలో లేని ‘భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్’ ఫేస్బుక్ పేజీ వివరాలను అందించాలని ‘మెటా’కు ఢిల్లీ పోలీస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం లేఖ రాసిందని సంబంధితవర్గాలు వెల్లడించాయి. ఈ ఫేస్బుక్ పేజీని నిందితులే క్రియేట్ చేసి ఘటన తర్వాత డిలీట్ చేశారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లకు ‘మెటా’ మాతృసంస్థ. ఈ నేపథ్యంలో నిందితుల మధ్య జరిగిన వాట్సాప్ ఛాటింగ్లనూ తమకు ఇవ్వాలని పోలీసులు ‘మెటా’ను కోరారు. -
పార్లమెంట్లో అలజడి ఘటన దురదృష్టకరం: మోదీ
ఢిల్లీ: పార్లమెంటు అలజడి ఘటన అత్యంత దురదృష్టకరమని ప్రధాని మోదీ అన్నారు. ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అవసరమైన చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్రతను తక్కువ అంచనా వేయవద్దని మోదీ అన్నారు. "పార్లమెంట్లో జరిగిన ఘటన తీవ్రతను ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. అందుకే స్పీకర్ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు" అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దర్యాప్తు సంస్థలు సమగ్రంగా విచారణ జరుపుతున్నాయి. "దీని వెనుక ఉన్న అంశాలు, ప్రణాళికలు ఏమిటో అర్థం చేసుకోవడం, పరిష్కారాన్ని కనుగొనడం కూడా అంతే ముఖ్యం. పరిష్కారాల కోసం అన్వేషించాలి. ప్రతి ఒక్కరూ అలాంటి విషయాలపై వివాదాలు లేదా ప్రతిఘటనలకు దూరంగా ఉండాలి" అని ప్రధాని మోదీ కోరారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా డిసెంబర్ 13న జీరో అవర్ సమయంలో ఇద్దరు యువకులు సాగర్ శర్మ, మనోరంజన్ పబ్లిక్ గ్యాలరీ నుండి లోక్‌సభ ఛాంబర్లోకి దూకారు. స్మోక్ క్యానిస్టర్లతో పసుపు పొగను విడుదల చేశారు. పార్లమెంట్ భవనంలో నినాదాలు చేశారు. అదే సమయంలో పార్లమెంట్ ఆవరణలో మరో ఇద్దరు అమోల్ షిండే, నీలం దేవి రంగు పొగను విడుదల చేశారు. ఈ కేసులో మొత్తంగా ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఏడు రోజుల కస్టడీలో ఉన్నారు. పోలీసుల వారిని దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన సూత్రధారి లలిత్ ఝా నిందితుల ఫోన్లను దహనం చేసిన ప్రదేశాన్ని పోలీసులు గుర్తించారు. నిందితుల వెనక విదేశీ, ఉగ్రవాదులు హస్తం ఉందా?అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: పార్లమెంట్ అలజడి కేసులో వెలుగులోకి కీలక అంశాలు -
లోక్‌సభ అలజడి ఘటన.. మరో అరెస్ట్
ఢిల్లీ: లోక్‌సభ అలజడి ఘటన కేసులో మరో వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌కు చెందిన మహేష్ కుమావత్ అనే వ్యక్తిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. గంట సేపు ప్రశ్నించిన అనంతరం.. ఢిల్లీ పోలీసులు అరెస్ట్ ప్రకటన చేశారు. ఈ కుట్రలో మహేష్ కూడా భాగం అయ్యాడని పేర్కొంటూ.. కేసులో ఆరో నిందితుడిగా అతని పేరును చేర్చారు. రాజస్థాన్ నాగౌర్ జిల్లాకు చెందిన మహేష్.. ఘటన జరిగిన తేదీన ఢిల్లీకి వచ్చినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు నలుగురిని తొలుత అరెస్ట్ చేశారు. అయితే వాళ్లకు సహకరించడం, వాళ్ల ఫోన్లను ధ్వంసం చేయడం లాంటి అభియోగాల మీద లలిత్ ఝా అనే వ్యక్తిని ఇది వరకే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కుట్ర కేసులో లలిత్‌నే కీలక నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరూ లొంగుబాటు గురువారం లలిత్‌తో పాటు మహేష్ కూడా లొంగిపోయినట్లు తెలుస్తోంది. లలిత్ అరెస్ట్‌ను శుక్రవారం పోలీసులు నిర్ధారించగా.. మహేష్‌ను, అతని బంధువు కైలాష్‌ను సైతం ప్రశ్నించిన పోలీసులు అరెస్ట్ చేయకుండా వదిలేశారు. అయితే శనివారం మరోసారి మహేష్‌ను ప్రశ్నించిన పోలీసులు ఆ తర్వాతే అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. పార్లమెంటులో ఘటనల అనంతరం లలిత్ ఝా ఢిల్లీ నుంచి రాజస్థాన్‌కు పారిపోయాడు. అక్కడ మహేష్ అతనికి ఆశ్రయం ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. నలుగురు నిందితుల ఫోన్లను ధ్వంసం చేసేందుకు లలిత్‌కు మహేష్ సహకరించాడని పోలీసులు నిర్ధారించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో.. లలిత్‌తో పాటు మహేష్‌ను కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఢిల్లీ నుంచి రాజస్థాన్‌లో వాళ్లు తిరిగిన ప్రాంతాలకు తీసుకెళ్లనున్నారు. అలాగే.. పార్లమెంట్‌లోనూ ‘సీన్ రీక్రియేషన్’ చేయనున్నట్లు తెలుస్తోంది. మరో ప్లాన్‌తో.. పార్లమెంట్ శీతాకాల సమాశాల్లో భాగంగా.. డిసెంబర్ 13వ తేదీన లోక్‌సభలో జీరో అవర్ కొనసాగుతుండగా ఒక్కసారిగా అలజడి రేగింది. ఇద్దరు వ్యక్తులు పబ్లిక్ గ్యాలరీ నుంచి వెల్ వైపుగా దూసుకెళ్లే యత్నం చేశారు. అయితే నిలువరించిన ఎంపీలు.. వాళ్లను చితకబాది భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఈలోపు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. కలర్ స్మోక్ షెల్స్‌ను ప్రయోగించారు. అదే సమయంలో బయట కూడా ఇద్దరు నిరసన వ్యక్తం చేస్తూ కనిపించారు. వాళ్లనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా నిందితులు విస్తూపోయే వివరాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. లోక్‌సభలో అలజడి ఘటనలో నిందితులు తొలుత తమకు తాము నిప్పంటించుకోవడం వంటి ప్రణాళికలూ రూపొందించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే.. చివరకు ఆ ప్రయత్నాలను విరమించి, బుధవారం అమలు చేసిన ప్లాన్‌తో ముందుకెళ్లినట్లు తెలిపారు. మరోవైపు.. ఈ కేసులో ఇద్దరు నిందితులకు విజిటర్ పాసులు జారీ చేసిన భాజపా ఎంపీ ప్రతాప్ సింహా వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేయాలని యోచిస్తోన్నట్లు సమాచారం. -
అరాచకం సృష్టించడానికి కుట్ర.. వెలుగులోకి కీలక విషయాలు
ఢిల్లీ: లోక్‌సభలో అలజడి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనతో దేశంలో అరాచకం చెలరేపడమే నిందితుల అజెండా అని లలిత్ ఝ కస్టడీ పిటిషన్ లో పోలీసులు పేర్కొన్నారు. దేశంలో అలజడి సృష్టించి తద్వారా తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలని నిందితులు భావించినట్లు వెల్లడించారు. ఈ దాడి వెనక నిందితులకు ఏమైనా విదేశీ, ఉగ్రవాద సంస్థల నుంచి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే అంశంపై దర్యాప్తును వేగవంతం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసేందుకు దేశంలో అరాచకం సృష్టించాలని భావించినట్లు కీలక సూత్రధారి లలిత్ ఝా వెల్లడించినట్లు కస్టడీ విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసులు పాటియాలా కోర్టుకు తెలిపారు. లలిత్ ఝా తన ఫోన్‌ను ఢిల్లీ-జైపూర్ సరిహద్దులో విసిరివేసినట్లు అంగీకరించాడు. ఈ కుట్ర ప్రణాళికను అమలు చేయడానికి ముందు ఢిల్లీలో అనేకమార్లు కలిసినట్లు లలిత్ ఝా చెప్పాడు. ఇతర నిందితుల ఫోన్లను ధ్వంసం చేసినట్లు తెలిపాడని పోలీసులు వెల్లడించారు. ఈ చర్య వెనక విదేశీ ప్రమేయం ఉందని దర్యాప్తు బృందం అనుమానిస్తోంది. నిందితులకు ఏదైనా శత్రు దేశంతో లేదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయా అనే విషయాన్ని నిర్ధారించేందుకు విచారించాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఝా తన ఫోన్‌ను విసిరిన, ఇతర నిందితుల ఫోన్లను కాల్చిన ప్రదేశాలను కనుగొనడానికి పోలీసులు రాజస్థాన్‌కు తీసుకెళ్లనున్నారు. లోక్‌సభ ఛాంబర్లోకి నిందితులు దూకిన ఘటనను రీక్రియేట్ చేసేందుకు ఢిల్లీ పోలీసులు పార్లమెంట్ అనుమతిని కోరే అవకాశం ఉంది. ఇదీ చదవండి: ‘పార్లమెంట్ భద్రత.. ప్రభుత్వ బాధ్యత కాదు’ -
పార్లమెంట్ అలజడి కేసు సూత్రధారి లలిత్ ఝా అరెస్టు
ఢిల్లీ: పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటన కేసుమాస్టర్ మైండ్ లలిత్ ఝా అరెస్ట్ అయ్యాడు. తనంతట తానుగా వచ్చి ఢిల్లీ పోలీసులకు లొంగిపోయాడు. గురువారం రాత్రి లలిత్ ఝా మరో వ్యక్తితో కలిసి కర్తవ్య పథ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. అతన్ని పోలీసు ప్రత్యేక బృందాలకు అప్పగించినట్లు పేర్కొన్నారు. మనోరంజన్, సాగర్ శర్మ, నీలమ్, అమోల్ శిందె, విశాల్, లలిత్ అనే ఆరుగురు దుండగులు ఈ ఘటనకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇందులో మనోరంజన్, సాగర్‌శర్మ లోక్‌సభలోకి చొరబడగా.. నీలమ్, అమోల్ శిందే పార్లమెంట్ భవనం వెలుపల గందరగోళం సృష్టించారు. ఈ నలుగురితో పాటు వీరికి బస ఏర్పాటు చేసిన విశాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఐదుగురి మొబైల్ ఫోన్స్‌తో పరారైన లలిత్ ఝా ప్రస్తుతం లొంగిపోయాడు. పార్లమెంట్లో నిందితులు బుధవారం గందరగోళం సృష్టించారు. పక్కా ప్రణాళికతో పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన నిందితులు గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. ఇద్దరు నిందితులు లోక్‌సభ లోపలికి ప్రవేశించి పసుపు రంగు గ్యాస్‌ను ప్రయోగించారు. దీంతో ఎంపీలంతా భయాందోళనకు గురయ్యారు. నిందితులను ఎంపీలే పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో అలజడి సృష్టించారు. ఈ కేసులో నలుగురు నిందితులను ఉపా(దేశ వ్యతిరేక కార్యకాలాపాల చట్టం) చట్టం కింద అరెస్టు చేశారు. 2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌పై దాడి జరిగిన రోజే మళ్లీ ఈ ఘటన జరగడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఇదీ చదవండి: Parliament Attack: జాతికి జవాబు కావాలి! -
జూలైలోనే పక్కాగా రెక్కీ
న్యూఢిల్లీ: అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్లమెంటులో పొగగొట్టాలతో కలకలం రేపిన నిందితులు ఇందుకు కొద్ది నెలల క్రితమే పక్కా ప్రణాళిక రచించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పార్లమెంట్‌లోకి పొగగొట్టాలను ఎలా దాచి తీసుకెళ్లాలన్న దానిపై రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్‌కు వచి్చన వారి షూలను తనిఖీ చేయట్లేరనే విషయాన్ని ‘రెక్కీ’ సందర్భంగా వీరు కనుగొన్నారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. నిందితుల్లో ఒకరైన మనోరంజన్ జులైలోనే ఈ మేరకు ఒకసారి సందర్శకుల పాస్‌తో లోపలికి వచ్చి రెక్కీ నిర్వహించాడని తెల్సింది. షూలు విప్పి తనిఖీలు చేయట్లేరనే విషయం గమనించి పొగ గొట్టాలను షూలో దాచి తెచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా లక్నోలో షూలను తయారుచేయించారట. మరోవైపు పార్లమెంట్లో ‘పొగ’ ఘటనకు కీలక సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝాను గురువారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో పాల్గొన్న మరో నలుగురిపాటు వారికి ఆశ్రయం కలి్పంచిన మరో వ్యక్తినీ అరెస్ట్‌చేశారు. లోక్‌సభ లోపల, వెలుపల పొగ గొట్టాలను విసిరిన నలుగురిపై కఠినమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా)సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నలుగురికీ ప్రత్యేక కోర్టు ఏడు రోజుల రిమాండ్‌కు పంపించింది. ఘటనకు కీలక సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝా వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. కోల్‌కతాకు చెందిన ఇతడు విప్లవ యోధుడు భగత్ సింగ్ వీరాభిమాని. లలిత్, సాగర్, మనోరంజన్ ఏడాది క్రితం మైసూర్లో కలిశారు. అప్పుడే పార్లమెంట్ లోపలికి చొరబడేందుకు ప్రణాళిక రచించారు. వీరికి తర్వాత నీలమ్ దేవి, అమోల్ షిండే తోడయ్యారు. ఫేస్బుక్లో భగత్‌సింగ్ ఫ్యాన్స్ క్లబ్ పేరుతో సృష్టించిన పేజీలో వీరంతా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపేవారు. లలిత్ వీరిని ముందుండి నడిపాడు. ప్రణాళిక ప్రకారమే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ అన్ని ప్రవేశ ద్వారాల వద్ద మనోరంజన్ రెక్కీ నిర్వహించాడు. జూలైలో సందర్శకుల పాస్‌తో పార్లమెంట్ ప్రాంగణంలోకి వచ్చాడు. భద్రతా సిబ్బంది సందర్శకుల షూలను విప్పి తనిఖీ చేయడం లేదని విషయం గమనించాడు. ఆ మేరకు ప్రణాళిక సిద్ధమైంది. మంగళవారం రాత్రి గురుగ్రామ్‌లోని విశాల్ శర్మ అలియాస్ వికీ ఇంట్లో సాగర్, మనోరంజన్, అమోల్, నీలం, లలిత్‌లు బస చేశారు. ఉదయం అందరూ కలిసి పార్లమెంట్ వద్దకు చేరుకున్నారు. వీరి సెల్ఫోన్లను లలిత్ తన వద్దే ఉంచుకున్నాడు. పాస్‌లు ఇద్దరికి మాత్రమే రావడంతో మిగతా ముగ్గురు బయటే ఉండిపోయారు. అమోల్, నీలమ్‌లు పార్లమెంట్ ఆవరణలో పొగ గొట్టాలు విసురుతుండగా లలిత్ వీడియో చిత్రీకరించాడు. అనంతరం ఈ వీడియోను అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. నిందితులిచ్చిన సమాచారం ఆధారంగా కోల్‌కతాకు చెందిన ఒక ఎన్జీవో నిర్వాహకుడు నీలా„Š అయి‹Ùతో స్పెషల్ సెల్ పోలీసులు మాట్లాడారు. ఈ ఎన్జీవోతోనే లలిత్ ఝాకు సంబంధాలున్నట్లు భావిస్తున్నారు. దర్యాప్తు వేగవంతం చేసిన అధికారులు గురువారం రాత్రి లలిత్ ఝాను అదుపులోకి తీసుకున్నారు. ఇతడి ద్వారానే పార్లమెంట్ ఘటన వెనుక నిజాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. వారం రోజుల రిమాండ్ పార్లమెంట్ భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన కేసులో పట్టుబడిన నలుగురిపై ఉపా చట్టంతోపాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. గురువారం మనోరంజన్, సాగర్, అమోల్, నీలమ్‌లను ‘పటియాలా’ కోర్టుకు తీసుకొచ్చి ఎన్ఐఏ కేసులను విచారించే జడ్జి ఎదుట హాజరుపరిచారు. జడ్జి ఏడు రోజుల రిమాండ్‌కు అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఒకే రకమైన సమాధానాలు సాగర్ శర్మ(26), మనోరంజన్(34), అమోల్ షిండే(25), నీలమ్ దేవి(37)లకు రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో వైద్యుల బృందంతో పోలీసులు మెడికల్ పరీక్షలు చేయించారు. అనంతరం వీరిని చాణక్యపురిలోని డిప్లొమాటిక్ సెక్యూరిటీ ఫోర్స్(డీఎస్ఎఫ్) కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ జరిపారు. ముందుగా, నీలమ్, అమోల్‌లను పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌స్టేషన్‌కు, తర్వాత డీఎస్ఎఫ్ కార్యాలయానికి తరలించారు. విచారణలో వీరు రెండు సంస్థల పేరు వెల్లడించారు. నిందితులు చెబుతున్న సమాధానాలన్నీ ఒకే రకంగా ఉండటాన్ని బట్టి చూస్తే, ముందుగానే ప్రిపేర్ అయినట్లుగా తెలుస్తోందని అధికారులు చెబుతున్నారు. ‘దేశంలో రైతుల ఆందోళనలు, మణిపూర్‌లో హింస, నిరుద్యోగం వంటి సమస్యలను చూసి నిరాశకు లోనై ఈ చర్యకు పాల్పడ్డాం. ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయడం కోసం, ఎంపీలు పై అంశాలపై చర్చ జరపాలనే ఉద్దేశంతో రంగుల పొగను వినియోగించాం. బ్రిటిష్ పాలనలో విప్లవయోధుడు భగత్ సింగ్ చేసినట్లుగా పార్లమెంట్లో అలజడి సృష్టించడం ద్వారా దేశ ప్రజల్లో ఇది చర్చనీయాంశంగా మారాలని భావించాం’ అని నలుగురు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు చెప్పారు. ఆధారాలు దొరక్కండా చేసేందుకే లలిత్ ఝా వీరి ఫోన్లను వెంటతీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. బహుశా అతడు వీటిని ధ్వంసం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
పార్లమెంట్లో అలజడికి సూత్రదారి?
ఢిల్లీ: పార్లమెంట్లో బుధవారం జరిగిన ఆందోళనకర ఘటనలో ఆరో నిందితున్ని లలిత్ ఝాగా పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో పార్లమెంట్ ఆవరణలోనే లలిత్ ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేల్చారు. ఘటనకు సంబంధించిన వీడియోను పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎన్జీవో వ్వవస్థాపకురాలు నీలాక్ష ఐచ్కు షేర్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం లలిత్ ఝా పరారీలో ఉన్నాడు. సామాజిక కార్యకర్తగా పేరొందిన లలిత్ ఈ కుట్ర వెనుక ప్రధాన సూత్రగారి అని పోలీసులు భావిస్తున్నారు. బెంగాల్లో పలు ఎన్జీవోలలో భాగస్వామిగా పాలు పంచుకుంటున్నట్లు గుర్తించారు. బెంగాల్‌లోని పురీలియా, ఝార్గ్రమ్ జిల్లాల్లో కీలక నెట్వర్క్ ఉన్నట్లు తన సహచరులతో చెప్పుకున్నట్లు దర్యాప్తులో తేలింది. "లలిత్ నాకు కాల్ చేయలేదు. పార్లమెంటు వెలుపల నిరసనకారులు గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగిస్తున్న వీడియోను వాట్సాప్‌లో పంపాడు. మధ్యాహ్నం 1-2 గంటల మధ్య ఈ వీడియో పంపాడు. ఆ సమయంలో కాలేజీలో ఉండి చూసుకోలేదు. తర్వాత చూసి నిరసన వివరాలను అడిగాను." అని నీలాష్క ఐచ్ తెలిపారు. కోల్‌కతాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో లలిత్ పరిచయమయ్యాడని నీలాష్క తెలిపారు. వెనకబడిన వర్గాల తరుపున సామాజిక కార్యక్రమాలు చేస్తుంటానని లలిత్ పరిచయమైనట్లు చెప్పారు. అంతకుమించి లలిత్ గురించి తనకు ఏం తేలియదని అన్నారు. లలిత్ ఐచ్ ఎన్జీవో 'సంయబడి సుభాస్ సభ' ప్రధాన కార్యదర్శిగా కూడా లలిత్ పనిచేశాడు. అయితే.. తమ ఎన్జీవోలోని సభ్యులందరూ వారు నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తుంటారని నీలాష్క పేర్కొన్నారు. ఈ కుట్ర గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. ఇదీ చదవండి: Parliament Issue: గ్యాస్ క్యానిస్టర్లు అంటే ఏంటి? ఎక్కడైనా వాడొచ్చా? -
పార్లమెంట్ భద్రత ఎవరి బాధ్యతో తెలుసా?
అది దేశ చట్టసభ్యులు సమావేశం అయ్యే చోటు. అత్యున్నత చట్టాల రూపకల్పన.. పాత వాటికి సవరణలు జరిగే చోటు. కాబట్టి.. దేశంలోనే కట్టుదిట్టమైన భద్రత ఉండొచ్చని అంతా భావించడం సహజం. కానీ, రెండు దశాబ్దాల కిందట పార్లమెంట్ మీదే జరిగిన ఉగ్రదాడి భారత్‌కు మాయని మచ్చని మిగిల్చింది. మళ్లీ అదే తేదీన, కొత్తగా హైటెక్ హంగులతో తీర్చిదిద్దిన పార్లమెంట్ వద్ద మళ్లీ అలాంటి అలజడే ఒకటి చెరేగింది. ఏకంగా దిగువ సభ లోపల ఆగంతకులు దాడికి దిగడంతో ‘పార్లమెంట్లో భద్రతా తీవ్ర వైఫల్యం’ గురించి చర్చ నడుస్తోంది. ఇక్కడ దాడి జరిగింది లోక్‌సభలోనా? రాజ్యసభలోనా? అనేది ఇక్కడ ప్రశ్న కాదు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం అనేది తీవ్రమైన అంశం. ఇంత విస్తృతమైన భద్రత ఉన్నప్పటికీ ఇద్దరు వ్యక్తులు లోపలికి ఎలా ప్రవేశించగలిగారు? భద్రతా ఉల్లంఘనకు ఎలా పాల్పడ్డారు? అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.. లోక్‌సభ ఘటనపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే వ్యక్తం చేసిన ఆందోళన. ఈ వాదనకు రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ సైతం సానుకూల స్థాయిలోనే స్పందించడం గమనార్హం. ఇంతకీ పార్లమెంట్ భద్రతను పర్యవేక్షించాల్సింది ఎవరు?.. ఢిల్లీ పోలీసులా? కేంద్ర బలగాలా?.. మొత్తం దానిదే! తాజా పార్లమెంట్ దాడి ఘటన నేపథ్యంలో ఓ సీనియర్ ఢిల్లీ పోలీస్ అధికారి ఈ అంశంపై స్పందించారు. పార్లమెంట్ బయట వరకే భద్రత కల్పించడం ఢిల్లీ పోలీసుల బాధ్యత. ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద భద్రత మాత్రం ఢిల్లీ పోలీసుల పరిధిలోకి రాదు. అయితే లోపలి భద్రతను మొత్తం పర్యవేక్షించేది పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్(Parliament Security Services..PSS). పీఎస్ఎస్ సీఆర్‌పీఎఫ్‌గానీ, మరేయిత కేంద్ర బలగాల సమన్వయంతో అంతర్గత భద్రత పర్యవేక్షిస్తుంటుంది. బహుశా ఇవాళ్టి ఘటనలో నిందితుల్ని వాళ్లే అదుపులోకి తీసుకుని ఉండొచ్చని వ్యాఖ్యానించారాయన. ఈ అధికారి వ్యాఖ్యలకు తగ్గట్లే.. పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు వచ్చేదాకా నిందితులు పార్లమెంట్ భద్రతా సిబ్బంది అదుపులోనే ఉన్నారు. ఆపై వాళ్లకు అప్పగించి ఫిర్యాదు చేశారు. ఇంతకీ భద్రతా సంస్థల కలగలుపు పీఎస్ఎస్ ఎలా పని చేస్తుందంటే.. పీఎస్ఎస్ చరిత్ర పెద్దదే.. 1929 ఏప్రిల్ 8వ తేదీన అప్పటి పార్లమెంట్ భవనం సెంట్రల్ లెజిస్టేటివ్ అసెంబ్లీలో బాంబు దాడి జరిగింది. ఆ దాడి తర్వాత అప్పుడు సీఎల్‌ఏకు అధ్యక్షుడిగా ఉన్న విఠల్‌భాయ్ పటేల్ చట్ట సభ, అందులోని సభ్యుల భద్రత కోసం సెప్టెంబర్ నెలలో ‘వాచ్ అండ్ వార్డ్’ పేరిట ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చైర్మన్ సర్ జేమ్స్ క్రెరార్ ‘డోర్ కీపర్ అండ్ మెసేంజర్స్’ పేరిట 21 మంది సిబ్బందిని చట్టసభ కాంప్లెక్స్‌లో నియమించాలని ప్రతిపాదించారు. భద్రతతో పాటు చట్ట సభ్యులకు ఏదైనా సమాచారం అందించాలన్నా వీళ్ల సేవల్ని వినియోగించుకోవాలని సూచించారాయన. అయితే.. ఆ ప్రతిపాదనకు తగ్గట్లే అప్పటి ఢిల్లీ మెట్రోపాలిటన్ పోలీస్ వ్యవస్థ నుంచి పాతిక మందిని సిబ్బందిగా, వాళ్లను పర్యవేక్షించేందుకు ఓ అధికారిని నియమించారు. అలా ఏర్పడిన భద్రతా విభాగం.. ఆ తర్వాత స్వతంత్ర భారతంలోనూ దశాబ్దాల తరబడి కొనసాగింది. క్రమక్రమంగా అందులో సిబ్బంది సంఖ్య పెరగడం, ఇతర బలగాలతో సమన్వయం వాచ్ అండ్ వార్డ్ తన విధుల్ని కొనసాగిస్తూ వచ్చింది. చివరకు.. అన్నింటా కీలకంగా.. .. 2009 ఏప్రిల్ 19వ తేదీన వాచ్ అండ్ వార్డ్‌ను పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్‌గా పేరు మార్చారు. భారతదేశ చట్ట సభ పార్లమెంట్ భవనం భద్రతను పూర్తిగా పర్యవేక్షించేది పీఎస్ఎస్. పార్లమెంట్ లోపలికి వచ్చే వాహనాలను.. వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీలు చేయడం దగ్గరి నుంచి బయటకు వెళ్లేదాకా పూర్తి పనులు కూడా ఈ విభాగం పరిధిలోకే వస్తాయి. స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవాల సమయంలో భారత సైన్యం, ఢిల్లీ పోలీసులతో కలిసి పీఎస్ఎస్ భద్రత కల్పిస్తుంది. రాష్ట్రపతుల ప్రమాణ స్వీకార సమయంలో రాష్ట్రపతి భవన్ వద్ద.. అలాగే ఎట్ హోమ్ కార్యక్రమాలకు భద్రత ఇచ్చేది పీఎస్ఎస్సే. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో దీని పాత్ర గురించి ఎక్కువ చెప్పుకోవాలి. ఎన్నికల సంఘం, విమానాయన శాఖ(చట్ట సభ్యుల రాకపోకలు.. బ్యాలెట్ బాక్సుల తరలింపు), భద్రతా బలగాలతో కలిసి రాష్ట్రపతి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంలో పీఎస్ఎస్దే కీలక పాత్ర. అలాగే.. ఎంపీలతో పాటు పార్లమెంట్‌కు వచ్చే వీఐపీలు, వీవీఐపీల భద్రత, స్టడీ టూర్ల మీద వచ్చే విద్యార్థులు, సందర్శించే విదేశీయులు, సాధారణ సందర్శకుల భద్రత కూడా పీఎస్ఎస్ చూసుకుంటుంది. స్వతంత్రంగా పని చేయదు.. పీఎస్ఎస్ అనేది పార్లమెంట్ భవనం పూర్తి కాంప్లెక్స్ భద్రతను పర్యవేక్షించే ఒక నోడల్ భద్రతా సంస్థ. ఢిల్లీ పోలీసులు, పార్లమెంట్ డ్యూటీ గ్రూప్/సీఆర్పీఎఫ్, ఢిల్లీ ఫైర్ సర్వీస్, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎస్పీజీ, ఎన్ఎస్జీలు పార్లమెంట్ పరిధిలో పీఎస్ఎస్ సమన్వయంతోనే పని చేస్తుంటాయి. అలాగని ఇది స్వతంత్రంగా పని చేయదు. పార్లమెంట్ భద్రతా విభాగం సంయుక్త కార్యదర్శి పీఎస్ఎస్కు హెడ్‌గా ఉంటారు. లోక్‌సభ సెక్రటేరియట్ అదనపు సెక్రటరీ (సెక్యూరిటీ), రాజ్యసభ సెక్రటేరియట్ అదనపు సెక్రటరీ(సెక్యూరిటీ) విడివిడిగా వాళ్ల వాళ్ల పరిధిలో పీఎస్ఎస్ పనితీరును పర్యేవేక్షిస్తారు. పీఎస్‌ఎస్‌లో సిబ్బందిని డిప్యూటేషన్ మీద ఇతర విధులకు కూడా పంపిస్తుంటారు. అయితే అది పార్లమెంట్ పరిధిలోనే. పార్లమెంట్ విరామ సమయాల్లో సందర్శన కోసం వచ్చే విద్యార్థులకు, విదేశీయులకు పార్లమెంట్ చరిత్ర, గొప్పదనం గురించి, అలాగే అక్కడ ఏర్పాటు చేసే మహోన్నత వ్యక్తుల విగ్రహాల(వాళ్ల గురించి..) వివరించడం లాంటి బాధ్యతలు అప్పగిస్తుంటుంది. పార్లమెంటరీ గార్డ్ డైరెక్టరేట్‌తో పాటు సభ లోపలి మార్షల్స్ కూడా పీఎస్ఎస్ పరిధిలోకే వస్తారు. మూడంచెల తనిఖీలు.. పార్లమెంట్ భవనం చుట్టూ పటిష్ఠమైన భద్రతా వలయం ఉంటుంది. ఎంపీలు మినహా పార్లమెంట్‌కు వచ్చే సిబ్బంది, విజిటర్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. సందర్శకులు విజిటర్స్ గ్యాలరీకి వెళ్లాలంటే మూడంచెల భద్రతా వ్యవస్థను దాటాలి. తొలుత పార్లమెంట్ ప్రాంగణంలోని ప్రవేశ ద్వారం వద్ద సందర్శకులను తనిఖీ చేస్తారు. ఆ తర్వాత పార్లమెంట్ భవనం వద్ద ఉన్న ఎంట్రీ గేట్ వద్ద మరోసారి చెకింగ్స్ నిర్వహిస్తారు. చివరగా విజిటర్స్ గ్యాలరీ వెళ్లే మార్గంలోని కారిడార్‌లో మూడోసారి తనిఖీలు చేస్తారు. ఇక, పార్లమెంట్లో పనిచేసే ప్రతి సెక్యూరిటీ గార్డుకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వారు తోటమాలి, స్వీపర్లు సహా పార్లమెంట్లో పనిచేసే ప్రతి సిబ్బందిని గుర్తించేలా శిక్షణ ఇస్తారు. పార్లమెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిత్యం ఐడీకార్డులు ధరించాలి. ఇక, సమయానుసారం సిబ్బందికి కూడా భద్రతా తనిఖీలు చేస్తారు. ఇక మెటల్ డిటెక్టర్లు, వాహనాల రాకపోకలను నియంత్రించే రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్లు, బాడీ స్కానర్ల వంటి అధునాతన గ్యాడ్జెట్స్‌తో పార్లమెంట్ పరిసరాల్లో భద్రతను ఏర్పాటు చేశారు. అలా ఎలా..? సాధారణ విజిటర్ పాస్‌ల మీదే సందర్శకులు పార్లమెంట్‌కు వస్తుంటారు. ఈ పాస్‌లు జారీ చేసేముందు బ్యాక్‌గ్రౌండ్ చెక్ కచ్చితంగా జరుగుతుంది. అందులో ఏమాత్రం లోటుపాట్లు కనిపించినా పాస్‌లు జారీ చేయరు. ప్రస్తుత దాడి ఘటనలో ఓ ఎంపీ పేరు మీద ఒక నిందితుడి పాస్ తీసుకున్నట్లు తేలింది. ఆ సంగతి పక్కన పెడితే.. పార్లమెంట్ భవనం లోపల సెక్యూరిటీ చెకింగ్లు, స్కానర్లు ఉండనే ఉంటాయి. హైసెక్యూరిటీ జోన్ పరిధిలో ఉండే పార్లమెంట్ భవనం అన్ని వైపులా సీసీ కెమెరాలు నిఘా ఉంటుంది. మరి ఇన్నీ దాటుకుని ఆ ఇద్దరు స్మోక్ షెల్స్‌తో ఎలా రాగలిగారనే అనుమానాలు తలెత్తుతున్నాయి ఇప్పుడు. నాడు జరిగింది ఇదే.. 2001 డిసెంబర్ 13వ తేదీ గుర్తుందా?.. పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగిన రోజు. సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజున పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. 2001 డిసెంబరు 13న లష్కరే తొయిబా, జైషే మహ్మద్ ముఠాలకు చెందిన ఉగ్రవాదులు పార్లమెంట్ ప్రాంగణంలోకి చొచ్చుకొచ్చి కాల్పులు జరిపారు. ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. ఈ దాడిలో 9 మంది అమరులయ్యారు. వీరిలో ఆరుగురు ఢిల్లీ పోలీసులు కాగా.. ఇద్దరు పార్లమెంట్ సెక్యూరిటీ సిబ్బంది, ఒక తోటమాలి ప్రాణాలు కోల్పోయారు. తక్షణమే స్పందించిన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపి ముష్కరులను హతమార్చారు. అప్పటి నుంచి పార్లమెంట్ భవనం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉంటోంది. అయితే డిసెంబర్ 13, 2023 నాటి ఘటన కొత్త పార్లమెంట్ భవనంలో జరిగింది. అదీ హైటెక్ హంగులతో, అత్యాధునిక సెక్యూరిటీ ఏర్పాట్లతో ఉంది. అయినా ఈ దాడి జరగడంపైనే తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
లోక్‌సభలో టియర్ గ్యాస్ అలజడి..పరుగులు తీసిన ఎంపీలు
సాక్షి,న్యూఢిల్లీ: లోక్‌సభలో బుధవారం ఉదయం తీవ్ర భద్రతా వైఫల్యం తలెత్తింది. పార్లమెంట్‌పై దాడి జరిగి నేటికి 22 ఏళ్లు పూర్తయిన వేళ సంచలనం జరిగింది. రాజ్యాంగాన్ని కాపాడాలని నినాదాలు చేస్తూ ఇద్దరు వ్యక్తులు సందర్శకుల గ్యాలరీ నుంచి ఒక్కసారిగా సభలోకి దూకారు. సభలోకి దూకిన వ్యక్తులు టియర్ గ్యాస్ వదిలారు. దీంతో సీట్లలో ఉన్న ఎంపీలంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. జీరో అవర్ కొనసాగుతుండగా ఘటన జరిగింది. ఘటన జరిగిన వెంటనే స్పీకర్ సభను వాయిదా వేశారు. ‘ఇద్దరు వ్యక్తులు గ్యాలరీలో నుంచి కిందకు దూకారు. వారి టియర్ గ్యాస్ చల్లుతూ పరుగులు తీశారు. వారిని ఎంపీలు పట్టుకున్నారు. తర్వాత భద్రతా సిబ్బంది వచ్చి ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇది కచ్చితంగా భద్రతా వైఫల్యమే’అని లోక్‌సభలో ప్రతిపక్షనేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. కాళ్లకు వేసుకున్న బూట్లలో టియర్ గ్యాస్ క్యాన్లను దాచుకున్న ఇద్దరు ఆగంతకులు గ్యాలరీలో నుంచి కిందకు దూకిన తర్వాత టియర్ గ్యాస్ వదులుతూ భయ భ్రాంతులు సృష్టించారు. 2001 సంవత్సరంలో ఇదే రోజున పార్లమెంట్ పై కొందరు ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. పార్లమెంటు ఆవరణలో కాల్పులకు దిగిన టెర్రరరిస్టులను భద్రతా బలగాలు ఎదురు కాల్పుల్లో మట్టుబెట్టాయి. ఈ ఘటనలో అమరులైన భద్రతా సిబ్బందికి ఇవాళ ఉదయం ప్రధాని, రాష్ట్రపతి, ఎపీలు నివాళులర్పిచారు. మళ్లీ ఇదే రోజు పార్లమెంటులో దుండగులు టియర్ గ్యాస్ వదలడం ఒక్కసారిగా భయాందోళనలు రేపింది. — ANI (@ANI) December 13, 2023 #WATCH | Leader of Congress in Lok Sabha, Adhir Ranjan Chowdhury speaks on an incident of security breach and commotion in the House. "Two young men jumped from the gallery and something was hurled by them from which gas was emitting. They were caught by MPs, they were brought… pic.twitter.com/nKJf7Q5bLM — ANI (@ANI) December 13, 2023 -
ప్రధాని భద్రతలో లోపాలు..ఏడుగురు పోలీసుల సస్పెన్షన్
చండీగఢ్: గత ఏడాది జనవరిలో పంజాబ్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ భద్రతలో లోపాలకుగాను మొత్తం ఏడుగురు పోలీసులు సస్పెండ్ అయ్యారు. వీరిలో ఒక ఎస్పీ స్థాయి అధికారి గతంలోనే సస్పెండ్ అవగా తాజాగా ఆరుగురిని పంజాబ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రధాని భద్రతలో లోపాలపై సుప్రీం కోర్టు అపాయింట్ చేసిన కమిటీ మొత్తం ఏడుగురు పోలీసు అధికారులను బాధ్యులుగా తేల్చింది. వీరందరినీ సీఎం భగవంత్‌మాన్ సింగ్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం ఈ నెల 22న సస్పెండ్ చేసింది. వీరిలో అప్పటి ఫిరోజ్‌పూర్ ఎస్పీ గుర్బీందర్ సింగ్ గతంలోనే సస్పెండ్ అయ్యారు. తాజాగా ఆరుగురు అధికారులు వేటుకు గురయ్యారు. గతేడాది జనవరి 5న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ ప్రచారం కోసం పంజాబ్ వెళ్లారు. ఎన్నికల ర్యాలీకి వెళుతున్న ఉన్న ఆయన కాన్వాయ్ ఓ ఫ్లై ఓవర్‌పై 20 నిమిషాల పాటు ఎటూ కదలకుండా నిలిచిపోయింది. రైతు చట్టాలపై ఆందోళన చేస్తున్న రైతులు ప్రధాని కాన్వాయ్కి ట్రక్కులను అడ్డంగా పెట్టారు. ఈ ఘటనపై అప్పట్లో పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రధాన మంత్రి తన టూర్ షెడ్యూల్‌ను చివరి నిమిషంలో మార్చుకోవడం వల్లే సమస్య వచ్చిందని అప్పటి సీఎం చన్నీ తెలిపారు. ఇదీచదవండి..సుప్రీం కోర్టులో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి -
కర్ణాటక అసెంబ్లీలోకి చొరబడ్డ ఆగంతకుడు.. ఎందుకొచ్చాడంటే..
బెంగుళూరు: కర్ణాటక అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ నడుస్తుండగా ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ 70 ఏళ్ల సామాన్య వృద్ధుడు నేరుగా అసెంబ్లీలోకి చొరబడి ఏకంగా ఎమ్మెల్యే సీటులోనే కూర్చున్నాడు. సభలోని ఓ ఎమ్మెల్యే అతడిని అనుమానించి భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేయడంతో వారు ఆ పెద్దమనిషిని అదుపులోకి తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని దాటుకుని సామాన్యుడు అసెంబ్లీలోకి చొరబడటంతో అక్కడి భద్రతా వ్యవస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా ప్రయోజనాల నిమిత్తం చట్టాలను తయారు చేసే చట్టసభలను దేవాలయాలుగా పరిగణిస్తూ ఉంటాం. ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులకు మాత్రమే అందులో అడుగుపెట్టే అర్హత ఉంటుంది. అటువంటి చోటుకి సామాన్యులు వెళ్లడమంటే మాటలు కాదు. అలాంటిది అక్కడి భద్రతా వలయాన్ని చేధించుకుని అసెంబ్లీ లోపలికి చొరబడటమే కాకుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని దర్జాగా బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్నాడు ఓ ఆగంతకుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మొలకాల్మోర్ నియోజకవర్గంలోని చిత్రదుర్గ జిల్లాకు చెందిన 70 ఏళ్ల తిప్పేరుద్రప్ప అలియాస్ కరియప్ప మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అసెంబ్లీకి వచ్చి అక్కడి సెక్యూరిటీ వారికి తనని తాను ఒక ఎమ్మెల్యేగా పరిచయం చేసుకుని లోపలికి ఎంటరయ్యాడన్నారు. అసెంబ్లీ లోపల దేవదుర్గ జేడీఎస్ ఎమ్మెల్యే కరియమ్మ సీటులో కూర్చుని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బడ్జెట్ ప్రకటిస్తుండగా 15 నిముషాల పాటు బడ్జెట్ సమావేశాలను తిలకించాడని, పక్కన ఉన్న మరో జేడీఎస్ ఎమ్మెల్యేకి అతడిపై అనుమానం రావడంతో అక్కడి సెక్యూరిటీకి ఫిర్యాదు చేయగా వారు అతడిని అదుపులోకి తీసుకుని కస్టడీకి తరలించారని, బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనాలన్న ఆసక్తితోనే అతడు అసెంబ్లీలోకి చొరబడినట్లు తెలిపారు పోలీసులు. ఇది కూడా చదవండి: మెట్రోలో యువతుల పోల్ డ్యాన్సింగ్.. వీడియో వైరల్.. -
London: పట్టాభిషేకం వేళ లండన్‌లో కలకలం
లండన్: కింగ్ ఛార్లెస్ పట్టాభిషేకానికి ముహూర్తం దగ్గర పడుతున్న వేళ.. లండన్ బకింగ్హమ్ ప్యాలెస్ వద్ద భద్రతా వైఫల్యం బయటపడింది. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం సాయంత్రం ప్యాలెస్ గేటు వద్దకు చేరుకున్న ఓ వ్యక్తి.. ప్యాలెస్ మైదానంలోకి కొన్ని వస్తువులను విసిరేశాడు. అందులో తుపాకీ మందుగుండు shotgun cartridges కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 6వ తేదీన కింగ్ ఛార్లెస్III పట్టాభిషేకం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల అధినేతలు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. గుర్తు తెలియని ఓ వ్యక్తి.. భారీ భద్రతను దాటుకుని గేట్ వద్దకు చేరుకున్నాడు. తన బ్యాగులో ఉన్న వస్తువులను ప్యాలెస్ వైపు విసరడం ప్రారంభించాడు. అయితే అవి ప్యాలెస్ గ్రౌండ్లో పడిపోయాయి. సకాలంలో గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ చీఫ్ వెల్లడించారు. అయితే ఆ బ్యాగులో ఓ ఆయుధం కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాల్పులు లాంటి పరిణామాలు చోటు చేసుకోలేదని, ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు? అలా చేశాడనే దానిపై స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు. ఆగంతకుడి దాడి సమయంలో.. ఛార్లెస్(74), ఆయన భార్య కామిల్లా(75) ప్యాలెస్‌లోనే ఉన్నారా? అనేదానిపై బకింగ్హమ్ ప్యాలెస్ వర్గాలు స్పందించ లేదు. శనివారం జరగబోయే పట్టాభిషేక మహోత్సవం కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ప్యాలెస్‌కు వెళ్లే దారులను జల్లెడ పడుతూ.. కొన్ని మాల్స్‌ను తాత్కాలికంగా మూయించేస్తున్నారు. దాదాపు 70 ఏళ్ల తర్వాత మళ్లీ బ్రిటన్‌లో పట్టాభిషేకం జరుగుతోంది. కిందటి ఏడాది క్వీన్ ఎలిజబెత్-2 మరణించగా.. ఆమె తనయుడు ఛార్లెస్(Charles 3)ని రాజుగా ప్రకటించింది రాజప్రసాదం. అయితే పట్టాభిషేకం మాత్రం దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఇప్పుడు జరుగుతోంది. సెంట్రల్ లండన్ మీదుగా నో-ఫ్లై జోన్‌ను ప్రకటించడంతో పాటు రూఫ్‌టాప్ స్నిపర్, రహస్య అధికారులు, అలాగే ఎయిర్పోర్ట్-స్టైల్ స్కానర్లు, స్నిఫర్ డాగ్‌లతో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఇదీ చదవండి: 18 ఏళ్లుగా ఒక్క మరక కూడా లేకుండా.. -
PM Modi: ప్రధాని మోదీకి ఇదేం భద్రత?!
బెంగళూరు: ప్రధాని మోదీ భద్రతా ఏర్పాట్లలో లోపం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మరోసారి బయటపడింది. ఎస్పీజీ స్థాయి భద్రత ఉన్న ఓ ప్రధాని స్థాయి వ్యక్తి కాన్వాయ్‌లోకి ఇతర వాహనాలు రావడం, తరచూ కొందరు అతిసమీపంగా రావడం గతంలో చూశాం. ఆయా ఘటనలపై విమర్శలు రావడం తెలిసిందే. తాజాగా కర్ణాటక ఎన్నికల ప్రచారంలోనూ అలాంటి సీన్ రిపీట్ అయ్యింది. ఆదివారం మైసూర్ ప్రధాని మోదీ రోడ్‌షోలో పాల్గొన్నారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం పైకి ఓ మొబైల్ వచ్చి పడింది. రోడ్‌షోకు హాజరైన ప్రజలకు ప్రధాని మోదీ అభివాదం చేస్తున్న టైంలో ఇది జరిగింది. మోదీకి అతి సమీపంగా వెళ్లి.. వాహనం బొనెట్పై మొబైల్ పడింది. ఈ విషయాన్ని ఎస్పీజీ సిబ్బంది గమనించినా.. వాహనం ఆగకుండా ముందుకు పోయింది. అయితే.. ఈ ఘటనపై ప్రధాని మోదీ సెక్యూరిటీ బృందం దర్యాప్తు చేపట్టింది. విచారణలో.. ఆ మొబైల్ బీజేపీ మహిళా కార్యకర్తదేనని తేలింది.మోదీపై పూలు వేసే క్రమంలో, అత్యుత్సాహంతో ఆ మహిళ మొబైల్ సైతం విసిరారని భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(SPG) అధికారులు ఆమెను వదిలేశారు. #WATCH | Security breach seen during Prime Minister Narendra Modi’s roadshow, a mobile phone was thrown on PM’s vehicle. More details awaited. pic.twitter.com/rnoPXeQZgB — ANI (@ANI) April 30, 2023 ఇదిలా ఉంటే.. తాజా కేరళ పర్యటనలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ప్రజలకు అభివాదం చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఓ మొబైల్ ఆయన కాళ్ల దగ్గర పడింది. వెంటనే.. పక్కనున్న సిబ్బంది దానిని పక్కకు తన్నేశారు. ఎస్పీజీ స్థాయి భద్రతా సిబ్బంది ఉన్న ప్రధానికి.. స్థానిక పోలీసుల భద్రతా భారీగా కల్పిస్తున్నప్పటికీ పెద్దగా ఆంక్షలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే విమర్శ వినిపిస్తోంది ఇప్పుడు. Amazing reflex of PM Modi's SPG. Today during his roadshow at Kochi, someone threw a mobile along with flowers by mistake and see how the SPG personal reacted. pic.twitter.com/s4YhxJycEi — നചികേതസ് (@nach1keta) April 24, 2023 #WATCH | Karnataka: Security breach during PM Modi's roadshow in Davanagere, earlier today, when a man tried to run towards his convoy. He was later detained by police. (Visuals confirmed by police) pic.twitter.com/nibVxzgekz — ANI (@ANI) March 25, 2023 #WATCH | Karnataka: A young man breaches security cover of PM Modi to give him a garland, pulled away by security personnel, during his roadshow in Hubballi. (Source: DD) pic.twitter.com/NRK22vn23S — ANI (@ANI) January 12, 2023 ఇదీ చదవండి: బుల్లి పట్టణాల్లోనూ బిలియనీర్లు -
ప్రధాని కాన్వాయ్‌వైపు దూసుకొచ్చిన వ్యక్తి
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం మరోసారి వెలుగు చూసింది. తాజాగా కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్‌కు ఎదురొచ్చే యత్నం చేశాడు ఓ యువకుడు. అయితే.. అది గుర్తించిన సిబ్బంది అప్రమత్తమై అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలో వేసవిలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందునా.. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పర్యటించారు. ఈ క్రమంలో.. దావణగెరెలో ప్రధాని మోదీ ఇవాళ రోడ్‌షో నిర్వహించారు. అయితే ఆ సమయంలో ప్రధాని ప్రజలకు అభివాదం చేస్తూ వాహనంలో ముందుకు కదిలారు. ఆ సమయంలో బారికేడ్లను దూకేసిన ఓ యువకుడు ప్రధాని ప్రయాణిస్తున్న కాన్వాయ్ వైపు అకస్మాత్తుగా దూసుకొచ్చే యత్నం చేశాడు. అది గమనించిన స్థానిక పోలీసులు, పీఎం సెక్యూరిటీ సిబ్బంది.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సదరు యువకుడిది కొప్పాల్ అని, అతడు బీజేపీ కార్యకర్తగానే గుర్తించారు పోలీసులు. ఇదిలా ఉంటే.. ప్రధాని మోదీ పర్యటనలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఇదే కర్ణాటకలో హుబ్బళి వద్ద ప్రధాని మోదీ రోడ్‌షోలో.. ఇలాగే ఓ వ్యక్తి దూసుకొచ్చే యత్నం చేయగా, పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. #WATCH | Karnataka: Security breach during PM Modi's roadshow in Davanagere, earlier today, when a man tried to run towards his convoy. He was later detained by police. (Visuals confirmed by police) pic.twitter.com/nibVxzgekz — ANI (@ANI) March 25, 2023 -
భారత్ జోడో యాత్ర బుల్లెట్ ప్రూఫ్ కారులో చేసేది కాదు: రాహుల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహల్ గాంధీ ఢిల్లీలో భారత్ జోడో యాత్ర నిర్వహించినప్పుడు భద్రతా వైఫల్యాలపై ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిన సీఆర్పీఎఫ్ రాహులే నిబంధనలు ఉల్లంఘించారని బదులిచ్చింది. తాజాగా రాహుల్ గాంధీ ఈ విషయంపై స్పందించారు. తాను బుల్లెట్ ప్రూఫ్ కారులో తిరుగుతూ భారత్ జోడో యాత్రలో పాల్గొనలా? అని ప్రశ్నించారు. అది ఎలా సాధ్యమని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు బుల్లెట్ ప్రూఫ్ కార్లను విస్మరించి నిబంధనలను తుంగలో తొక్కినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. వ్యక్తులను, పార్టీలను బట్టి ప్రోటోకాల్స్ మారుతాయా అని నిలదీశారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈమేరకు మాట్లాడారు. భారత్ జోడో యాత్ర దేశ భావోద్వేగాలకు సంబంధించిందని, తనకు చాలా విషయాలు నేర్పిందని రాహుల్ అన్నారు. తాను ఊహించిన దానికంటే ఎక్కువే నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే 2024లో ప్రతిపక్షాలు అన్నీ ఏకమైతే బీజేపీ గెలవడం కష్టం అన్నారు రాహుల్. ప్రతిపక్షాలు ప్రత్యామ్నాయ విజన్‌తో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. అయితే కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరు? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. తన దృష్టంతా విద్వేషం, ఆగ్రహావేశాలపై పోరాడటమేనని పేర్కొన్నారు. చదవండి: తల్లి హీరాబెన్ పాడె మోసిన ప్రధాని మోదీ -
రాహులే భద్రతా నిబంధనలు ఉల్లంఘించారు: సీఆర్పీఎఫ్
న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఢిల్లీలో పర్యటించినప్పుడు సరైన భద్రత కల్పించలేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు కాంగ్రెస్ లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై కేంద్ర పారామిలిటరీ దళం(సీఆర్పీఎఫ్) స్పందించింది. రాహుల్ గాంధీనే భద్రతా నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంది. ఢిల్లీ పోలీసులు, ఇతర సెక్యూరిటీ సంస్థలతో కలిసి రాహుల్ పర్యటను తామే భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీఆర్పీఎఫ్ పేర్కొంది. అన్ని మార్గదర్శకాలను పాటించినట్లు చెప్పింది. అవసరమైన సిబ్బందిని మోహరించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారని పేర్కొంది. డిసెంబర్ 24 పర్యటనలో రాహుల్ గాంధీనే తరచూ భద్రగా నిబంధనలు ఉల్లంఘించారని సీఆర్పీఎఫ్ పేర్కొంది. ఈ విషయాన్ని ఆయనకు పదే పదే చెప్పినట్లు వివరించింది. రాహుల్ పర్యటనలో భద్రతా వైఫల్యాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్.. అమిత్ షాకు బుధవారం లేఖ రాశారు. ఈ మరునాడే సీఆర్పీఎఫ్ ఈ విషయంపై స్పదించింది. చదవండి: 'నా భర్త గే.. ఎంత ట్రై చేసినా దగ్గరకు రానివ్వట్లేదు..' కోర్టు కీలక తీర్పు -
రాహుల్ గాంధీ భద్రతపై కాంగ్రెస్ ఆందోళన
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ. భారత్ జోడో యాత్రలో పలు సందర్భాల్లో భద్రతా ఉల్లంఘనలు జరిగాయాని, సరైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ రాసింది. జోడో యాత్ర శనివారం ఢిల్లీకి చేరుకోనుంది. అయితే, ఈ నేపథ్యంలో పలు సందర్భాల్లో యాత్ర భద్రత చర్యల్లో లోపాలు బయటపడ్డాయని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. రాహుల్ గాంధీకి ప్రస్తుతం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉంది. అయితే భారత్ జోడో యాత్రలో జనాలను నియంత్రించడం, వారిని రాహుల్ గాంధీకి సమీపంలోకి రాకుండా చూడడంలో ఢిల్లీ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని లేఖలో పేర్కొంది కాంగ్రెస్. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, రాహుల్‌తో పాదయాత్ర చేస్తున్న వారు ఆయనకు భద్రత వలయంగా ఏర్పడి రక్షణ కల్పిస్తున్నారని తెలిపింది. ఢిల్లీ పోలీసులు మౌన ప్రేక్షకులుగా ఉండిపోతున్నారని వెల్లడించింది. హరియాణాలో కొందరు దుండగులు భారత్ జోడో యాత్ర కంటెయినర్లలోకి ప్రవేశించారని గురుగ్రామ్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు లేఖలో పేర్కొంది. ‘భారత్ జోడో యాత్ర అనేది దేశంలో శాంతి, సామర్యాన్ని తీసుకొచ్చేందుకు చేస్తున్న పాదయాత్ర. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతీకార రాజీకీయాలకు పాల్పడకూడదు. కాంగ్రెస్ నేతల భద్రత, రక్షణకు భరోసా కల్పించాలి. జనవరి 3 నుంచి భద్రతా పరంగా సున్నితమైన పంజాబ్, జమ్మూకశ్మీర్‌లోకి యాత్ర ప్రవేశించనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నేతలకు సరైన భద్రత కల్పించాలని కోరుతున్నాం.’అని లేఖలో డిమాండ్ చేసింది కాంగ్రెస్. ఇదీ చదవండి: అత్యంత అవినీతిమయం.. సోనియా కుటుంబంపై బీజేపీ తీవ్ర విమర్శలు -
స్టేజ్ ఎక్కి.. మైక్ లాక్కొని.. అస్సాం సీఎంను నిలదీసే యత్నం!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు శుక్రవారం వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనడానికి వచ్చిన అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టమైంది. మొజంజాహి (ఎంజే) మార్కెట్ వద్ద హిమంత ఉన్న వేదిక పైకి టీఆర్ఎస్ నేత నంద కిషోర్ వ్యాస్ దూసుకువెళ్లారు. ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు ప్రసంగిస్తుండగా అడ్డుకుని మైక్ లాగా రు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఎంజే మార్కెట్ ప్రాంతానికి చేరుకోవడానికి ముందు హిమంత చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. అక్కడి నుంచి ఎంజే మార్కెట్ వద్దకు చేరుకున్న హిమంత ఉత్సవ సమితి వేదిక పైకి ఎక్కారు. ఆ సమయంలో భగవంతరావు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అప్పుడు వేదిక పైకి దూసుకెళ్లిన నంద కిషోర్.. భగవంతరావు మైకును పక్కకు లాగారు. పక్కనున్న హిమంతను నిలదీసేందుకు ప్రయత్నించారు. వేదికపై ఉన్న సమితి నేతలు అప్రమత్తమై నంద కిషోర్‌ను బలవంతంగా స్టేజ్ కిందకు తీసుకుపోయారు. అక్కడే ఉన్న మహిళా భక్తులు నంద కిషోర్‌పై అసహనం వ్యక్తం చేయడంతోపాటు ఆయనపై దాడికి ప్రయత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని అబిడ్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గులాబీ కండువా ధరించిన నంద కిషోర్ ముఖ్యమంత్రి ఉన్న వేదికపైకి వెళ్తున్నా పోలీసులు అడ్డుకోలేదంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతకుముందు మార్కెట్ దగ్గర ఫ్లెక్సీ వివాదం చెలరేగింది. టీఆర్ఎస్ నేతలు, హిమంతకు పోటీగా మంత్రి తలసాని ఫ్లెక్సీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఉత్సవ సమితి సభ్యులు, టీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. బండి సంజయ్, డీకే అరుణ ఖండన అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మను మాట్లాడనీయకుండా టీఆర్ఎస్ నేత మైక్ లాక్కోవడం హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే ఆరుణ వేర్వేరు ప్రకటనల్లో మండిపడ్డారు. హిమంతపై దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ నేతను అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసు పెట్టాలని, ఈ దాడికి పురిగొల్పిన రాష్ట్ర మంత్రులపైనా కేసు నమోదు చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసింగ్ గురించి గొప్పలు చెప్పుకునే కేసీఆర్, అస్సాం సీఎంకు సరైన భద్రత కల్పించలేక పోవడం సిగ్గుచేటని అరుణ విమర్శించారు. కుటుంబ పార్టీలు దేశం కోసం ఆలోచించవు: హిమంత తెలంగాణలో ఒక్క కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందుతోందని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ విమ ర్శించారు. ప్రభుత్వం అనేది ప్రజలందరి కోసం పనిచేయాలి గానీ, ఒక కుటుంబం కోసం కాదన్నారు. కుటుంబ పార్టీలు కొడుకు, కూతురు గురించి తప్ప దేశం కోసం ఆలోచించవని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు మంచి జరగాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని, గణపతిని కోరుకున్నట్లు చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశ ప్రజల్ని ఏకం చేయడానికి కేసీఆర్‌కు మరో 50 ఏళ్లు పడుతుందేమోనని ఎద్దేవాచేశారు. రాహుల్‌గాంధీకి నిజంగా దేశ భక్తి ఉంటే 1947లో ఎక్కడైతే విభజన జరిగిందో అక్కడ భారత్ జోడో యాత్ర చేయాలని వ్యాఖ్యానించారు. ఎక్కడైతే జోడించాలో అక్కడ ఆ పనిచేయాలి తప్ప పటిష్టంగా ఉన్న దేశంలో ‘భారత్ జోడోలు’ ఎందుకని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో వినాయక శోభాయాత్రను చూడటం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కేసీఆర్‌ను విమర్శిస్తే సహించేది లేదు అబిడ్స్: సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తే సహించేది లేదని టీఆర్ఎస్ నాయకుడు నందకిశోర్ వ్యాస్ (నందుబిలాల్) పేర్కొన్నారు. కేసీఆర్‌ను విమర్శించినందుకే తాను మైకు లాక్కున్నానని చెప్పారు. అబిడ్స్ పోలీస్‌స్టేషన్ దగ్గర నందకిశోర్ మీడియాతో మాట్లాడుతూ.. గణేశ్ ఉత్సవాలకు వచ్చిన అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ఆధ్యాత్మిక భావంతో, దేవుడిపైనే ప్రసంగించాలన్నారు. సీఎం కేసీఆర్‌ను, మంత్రి కేటీఆర్‌ను విమర్శిస్తూ హైదరాబాద్‌లో అలజడి సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఇదీ చదవండి: పాన్ ఇండియా పార్టీ.. దరసరాకు విడుదల! -
పాస్వర్డ్ మేనేజర్ సంస్థకే హ్యాకర్ల షాక్:మూడు కోట్ల యూజర్ల భద్రత గోవిందేనా?
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఉపయోగించే పాస్వర్డ్ మేనేజర్, లాస్ట్‌పాస్‌కు హ్యాకర్లు భారీ షాకిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 33మిలియన్లకు పైగా ప్రజలు ఉపయోగించే పాస్వర్డ్ మేనేజర్ లాస్ట్‌పాస్‌కు సేబర్ కేటుగాళ్లు హ్యాక్ చేశారు. ఇటీవల సంస్థ సిస్టమ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి సోర్స్ కోడ్, యాజమాన్య సమాచారాన్ని దొంగిలించారని తెలుస్తోంది. అయితే దీని ప్రభావాన్ని అంచనా వేయడానికి కొంత సమయం పడుతుందని, కానీ తమ కస్టమర్ల భద్రతకు ఢోకా లేదని తెలిపింది. ఈ మేరకు సంస్థ ట్విటర్ ద్వారా సమాచారాన్ని వెల్లడించింది. అయితే తమ ఖాదారులు పాస్ట్వరర్డ్స్కు వచ్చిన ప్రమాదమేమీ లేదని స్పష్టం చేసింది.ప్రస్తుతానికి వారుఎలాంటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. లాస్ట్‌పాస్ నిర్వహణకు ఉద్యోగులు ఉపయోగించే సాఫ్ట్వేర్ డెవలపర్ లోకి "అనధికారిక పార్టీ" ప్రవేశించిందని తన పరిశోధనలో తేలిందని తెలిపింది. నేరస్థులు ఒక్క డెవలపర్ అకౌంట్‌కి మాత్రమే యాక్సెస్ పొందారని పేర్కొంది. అయితే సైబర్ సెక్యూరిటీ వెబ్సైట్ బ్లీపింగ్ కంప్యూటర్ రెండు వారాల క్రితమే ఉల్లంఘన గురించి లాస్ట్‌పాస్ అడిగిందని నివేదించింది. మరోవైపు లాస్ట్‌పాస్ తక్షణమే స్పందించి సమాచారం అందించడంపై కంప్యూటర్ సైబర్ సెక్యూరిటీ విశ్లేషకుడు అలెన్ లిస్కా సంతోషం వ్యక్తంచేశారు. అయితే చాలామందికి రెండు వారాలు చాలా ఎక్కువ సమయం అనిపించినప్పటికీ, పరిస్థితిని పూర్తిగా అంచనా వేయడానికి టీమ్స్‌కి కొంత సమయం పట్టొచ్చన్నారు. కానీ కస్టమర్ పాస్‌వర్డ్‌లను యాక్సెస్ చేసే అవకాశం లేదని లిస్కా చెప్పారు. ఇది ఇలా ఉంటే సోర్స్‌కోడ్, ప్రొప్రయిటరీ సమాచారాన్ని దొంగిలించిన హ్యాకర్లకు,కస్టమర్ల డేటా చోరీ చేయడంపెద్ద కష్టం కాదని, పాస్వర్డ్ వాల్ట్‌ల కీలను యాక్సెస్ చేసేసి ఉంటారని సోషల్ మీడియాలో ఊహాగానాలు జోరుగా వ్యాపించాయి. అయితే ఈ అంచనాలపై లాస్ట్సాప్ స్పందిస్తుందో వేచి చూడాలి. కాగా మాన్యువల్‌గా ఆధారాలను నమోదు చేయాల్సిన అవసరం లేకుండానే తన యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ లేదా జీమెయిల్ లాంటి బహుళ ఖాతాల కోసం హార్డ్-టు-క్రాక్, ఆటోమేటెడ్ జనరేటెడ్ పాస్‌వర్డ్‌లను అందిస్తుంది లాస్ట్‌పాస్. We recently detected unusual activity within portions of the LastPass development environment and have initiated an investigation and deployed containment measures. We have no evidence that this involved any access to customer data. More info: https://t.co/cV8atRsv6d pic.twitter.com/HtPLvK0uEC — LastPass (@LastPass) August 25, 2022 -
పంజాబీయులు మన సహోదరులు
దేశంలోని అన్ని రాష్ట్రాలూ దేనికవే ప్రత్యేకమైనవే అయినా, పంజాబ్ మరింత ప్రత్యేకమైనది. దేశ సరిహద్దులో ఉండటం వల్ల రక్షణ అనేది వారి రక్తంలో కలిసిపోయింది. దానికి సాక్ష్యంగా ఇప్పటికీ దేశ జనాభా ప్రాతిపదికన అత్యధిక శాతం మంది సైన్యంలో కొనసాగుతున్నది అక్కడి నుంచే. స్వాతంత్య్రోద్యమ కాలంలో ఎందరో వీరులు ఇక్కడ ఉదయించారు. హరిత విప్లవం కాలంలో దేశానికి అన్నం గిన్నె అయింది ఈ రాష్ట్రమే. అలాగే ఇటీవలి రైతుల ఉద్యమాన్ని ముందుండి నడిపింది కూడా పంజాబీ రైతులే. అలాంటి వారిని ప్రధాని కాన్వాయ్‌ను అడ్డుకున్నారని ఆరోపిస్తూ కొంతమంది దేశద్రోహులుగా నిందిస్తున్నారు; ఇది తగని పని. అది వారి సమగ్రతను అనుమానించడమే. వారి త్యాగాల చరిత్రను అవమానించడమే. జనవరి 5వ తేదీన పంజాబ్‌లోని ఫిరోజ్ పూర్ జిల్లా సమీపంలోని పయరయన గ్రామం దగ్గర ఫ్లైఓవర్ పైన దాదాపు 20 నిమిషాల పాటు ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ నిలిచిపోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న వీరుల సమాధి హుస్సేనివాలా దగ్గర జరిగే సభలో పాల్గొనడానికి వెళుతున్న ప్రధానికి ఎదురైన ఈ ఘటన యావత్ దేశంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైతులు అడ్డుకోవడం వల్లనే ప్రధాని కాన్వాయ్ ముందుకు వెళ్ళలేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే రైతాంగ ఉద్య మానికి సారథ్యం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా ఈ వాదనను ఖండించింది. ప్రధాని కాన్వాయ్‌ను రైతులు అడ్డుకోలేదనీ, ఆ దారిలో ప్రధాని వస్తున్న విషయం కూడా రైతులకు తెలియదనీ కిసాన్ మోర్చా జనవరి 6వ తేదీన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అయితే ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తూ, నిరసనలు తెలియజేయాలని నిర్ణయించిన మాట నిజమనీ, జనవరి 2వ తేదీన గ్రామస్థాయిలో, 5వ తేదీన జిల్లా స్థాయిలో ప్రదర్శనలు నిర్వహించాలనీ నిర్ణయించినట్టు కూడా ఆ ప్రకటన తెలిపింది. నల్ల చట్టాల రద్దుతో పాటు, ధాన్యపు మద్దతు ధర ప్రకటించాలనీ, రైతులపై మోపిన అక్రమ కేసులను ఎత్తివేయాలనీ, ఇప్పటికీ జైళ్ళలో ఉన్న రైతాంగ నాయకులను విడుదల చేయాలనే డిమాండ్లతో ఈ నిరసనలు చేపట్టామనీ కిసాన్ మోర్చా వెల్లడించింది. కిసాన్ మోర్చా నుంచి వచ్చిన ప్రకటన వల్ల, కొన్ని పత్రికలు రాసిన కథనాల వల్ల రైతులకు నరేంద్ర మోదీ కాన్వాయ్‌ని అడ్డుకునే ఉద్దేశమే లేదని తెలుస్తున్నది. అయినా కొంతమంది అదేపనిగా ప్రధాని కాన్వాయ్‌ని అడ్డుకోవడం దేశ ద్రోహమనీ, వీళ్ళంతా జాతి వ్యతిరేకులనీ... ఇంకాస్త ముందుకు వెళ్ళి, సిక్కులు ఇతర దేశాలతో చేతులు కలిపి ప్రధాని పైన దాడి చేయాలనుకొన్నారనీ... ఇలా అనేక అసత్య ప్రచారాలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న రైతాంగ ఉద్యమానికి పంజాబ్‌లోని రైతులు, ప్రత్యేకించి సిక్కులు బలమైన శక్తిగా నిలబడ్డారు. అందువల్లే కావొచ్చు, సిక్కుల పైన గతం నుంచీ కొంత మందికి ఉన్న విద్వేషాన్ని మళ్ళీ మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇది ఎంత మాత్రం సరైనది కాదు. సిక్కులు... ప్రత్యేకించి పంజాబ్ సిక్కులు మనం ఈ రోజు అనుకుంటున్న భారతదేశానికి ఎంతో సేవ చేశారు. ప్రాణాలను తృణప్రాయంగా భావించి బలిదానాలు చేశారు. ఈ రోజు మనం పిలుస్తున్న సిక్కు సంప్రదాయం, లేదా సిక్కు మతం ఆవిర్భవించిందే భారతదేశ రక్షణకు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. భారతదేశానికి పంజాబ్ పశ్చిమంగా ఉండి, నిత్యం దాడులకు, యుద్ధాలకు గురైంది. అయితే వందల ఏండ్లుగా సాగుతున్న విదేశీ దాడులను ఎదుర్కోవాలంటే కుల వ్యవస్థ వల్ల ఉన్న అనైక్యత ఉండకూడదనీ, మూఢనమ్మకాలు సమసి పోవాలనీ, వందల దేవుళ్ళ పేరుతో విభజనకు గురవడం సరికాదనీ గురునానక్ గుర్తించారు. విదేశీ దాడులను ఆపాలన్న ఉన్నత లక్ష్యంతో క్రీ.శ.1469లో గురు నానక్ ప్రారంభించిన సిక్కు సంప్రదాయదాన్ని, ఏడవ గురువైన గురుగోవింద్ సింగ్ ఒక శక్తిమంతమైన మతంగా అభివృద్ధి చేశారు. చదువు, యుద్ధ విద్య, క్రమశిక్షణ, సత్ప్రవర్తనలో కాగిన ఒక జీవన విధానాన్ని గురుగోవింద్ సింగ్ ప్రబోధించారు. వీరివల్లనే భారత దేశం విదేశీయుల దాడులను ప్రత్యేకించి మొఘల్ దాడులను, బ్రిటిష్ దాడులను ఎదుర్కోగలిగింది. శత్రువుల గుండెల్లో భయోత్పాతాన్ని సృష్టించిన సిక్కుల త్యాగా లను చరిత్ర సుస్థిరం చేసింది. ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన విప్లవ కారుల్లో సిక్కుల పాత్ర చిరస్మరణీయం. ఉరికొయ్యల ఉయ్యాలలూగుతానని ప్రకటించిన నూనూగు మీసాల షాహీద్ భగత్ సింగ్ త్యాగం వెలకట్టలేనిది. భగత్‌సింగ్‌ను ఈ నేల ఏనాటికీ మరువజాలదు. లాల్, బాల్, పాల్ త్రయంలో లాల్‌గా పిలుచుకునే లాలా లజపతి రాయ్ పంజాబ్ బిడ్డనే విషయాన్ని మరువకూడదు. జలియన్ వాలా బాగ్ మారణకాండకు లండన్ వెళ్లి ప్రతీకారం తీర్చుకున్న ఉద్దండుడు ఉద్ధం సింగ్ సైతం ఈ గడ్డమీది వాడే. భారతదేశ విభజన సందర్భంగా వేలాదిమంది సిక్కులు మత కలహాలకు బలయ్యారు. భారతదేశ స్వాతంత్య్రానంతరం రాజ్యాం గంలో పంజాబ్‌కు ప్రత్యేకంగా కొన్ని హక్కులు కల్పిస్తామని చెప్పి, ఆనాటి నాయకులు ఇచ్చిన మాట మరిచిపోయారు. దాంతో 1980 ప్రాంతంలో ఖలిస్తాన్ ఉద్యమం బయలుదేరింది. అది క్రమంగా హింసారూపం దాల్చింది. ఎందరో సిక్కు యువకులు టెర్రరిస్టులుగా ముద్రపడి ప్రాణాలు కోల్పోయారు. ఆ పగ, ప్రతీకారమే మన ప్రధాని ఇందిరాగాంధీ ప్రాణాలను బలిగొన్నది. ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీలో సిక్కుల ఊచకోత జరిగింది. అయినప్పటికీ పంజాబ్ ప్రజలు, రైతులు దేశ ఆర్థికాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారు. స్వాతంత్య్రానంతరం దేశం ఎదుర్కొన్న సమస్యల్లో ప్రధానమై నది ఆహార కొరత. అందుకుగాను దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల ఉత్పత్తులను పెంచాలని అప్పటి ప్రభుత్వాలు నూతన వ్యవసాయ విధానాలను ప్రకటించాయి. దానిపేరే సస్యవిప్లవం. అందులో మళ్ళీ మొదటి వరసలో నిలిచింది పంజాబ్, హరియాణా రైతులే. 1970 నాటికి దేశంలోని ఆహార అవసరాలలో 70 శాతం అందించిన రాష్ట్రం పంజాబ్ ప్రాంతమేనంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇది అందరికీ తెలుసు. ఒక రకంగా దేశాన్ని కాపాడింది పంజాబ్ మాత్రమే నంటే అనుమానం అక్కర్లేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు పంజాబ్, హరియాణా దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తున్నాయి. అదేవిధంగా మొదటగా చెప్పినట్లుగానే, ఇప్పటికీ దేశ రక్షణ కర్తవ్య నిర్వహణలో పంజాబ్, హరియాణా ప్రజల, ప్రత్యేకించి సిక్కుల పాత్రను విస్మరించలేం. ఇటీవల పార్లమెంటులో ప్రకటించిన సైన్యం వివరాల ప్రకారం మొత్తం దేశ సైన్యం 11 లక్షల 51 వేలు. ఇందులో 89, 088 మంది పంజాబీయులే. ఇది మొత్తం సైన్యంలో 7.7 శాతం. దేశ జనాభాలో పంజాబ్ జనాభా 2.3 శాతం. అంటే జనాభా దామాషా కన్నా 5.4 శాతం అధికంగా పంజాబీలు సైన్యంలో ఉన్నారు. సైన్యంలో పంజాబ్‌ది రెండోస్థానం. ఉత్తరప్రదేశ్‌ది మొదటిస్థానం. ఉత్తరప్రదేశ్ నుంచి సైన్యంలో ఉన్నవారు 1,67,000. కానీ దాని జనాభా దేశంలో 16.5 శాతం కాగా, సైన్యంలో వారు ఉన్నది 14.5 శాతం. అంటే జనాభా ప్రాతిపదికన 2 శాతం తక్కువ. అదేవిధంగా హరియాణా నుంచి సైన్యంలో ఉన్నవారి సంఖ్య 65, 978. కాగా దేశా జనాభాలో వారిది 2.09 శాతం. అయినా సైన్యంలో ఉన్నవాళ్లు 5.7 శాతం. అంటే దాదాపు మూడున్నర శాతం అధికం. పంజాబ్, హరి యాణాల్లో ఎక్కువ మంది సిక్కులు ఉన్నారనే విషయాన్ని మరవద్దు. దేశ ఆర్థికాభివృద్ధిలో, దేశ రక్షణలో, దేశభక్తిలో పంజాబ్‌ది అగ్ర భాగం. అటువంటి దేశభక్తి నరనరాన నింపుకున్న పంజాబ్ ప్రజలను, దేశానికే అన్నం పెట్టిన పంజాబ్ రైతులను దేశ ద్రోహులుగా, జాతి వ్యతిరేకశక్తులుగా ముద్ర వేయడం ఎంత మాత్రం విజ్ఞత అనిపించు కోదు. ప్రధాని కాన్వాయ్ నిలచిపోవడం విషయంపై విచారణ జర గాలి. నిజాలను రాబట్టాలి. అది పోలీసుల పని. కానీ పంజాబ్ రైతులు ఎందుకు ఇంకా ఆగ్రహంతో ఉన్నారో తెలుసుకొని, పరిష్కారాలను కనిపెట్టడం రాజనీతిజ్ఞుల కర్తవ్యం. పాలకులు ప్రజాస్వామ్యయు తంగా ఆలోచించగలగాలి. ఇప్పటికే విద్వేషాలు, వివక్షలు ఎన్నో ప్రతి కూల ఫలితాలను ఇచ్చాయి. ఇప్పటికైనా రాజనీతిజ్ఞతతో వ్యవహరి స్తారో, ప్రజల ఆశలను అడియాసలు చేసి దోషులుగా మిగిలిపోతారో తేల్చుకోవాల్సిందే పాలకులే. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077