ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై దాడికి ప్రయత్నం జరిగింది. వెంటనే అప్రమత్తమైన ఆప్ నాయకులు.. దాడికి పాల్పడిన యువకుడిని అడ్డుకున్నారు. దీంతో, అక్కడ ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది.
వివరాల ప్రకారం.. మాజీ సీఎం కేజ్రీవాల్ కైలాశ్ ప్రాంతంలో శనివారం పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనూహ్యంగా పాదయాత్రలోకి ఓ యువకుడు చొరబడి.. కేజ్రీవాల్‌పై దాడికి యత్నించాడు. తన చేతిలో ఉన్న ఏదో ద్రావణాన్ని కేజ్రీవాల్‌పై చల్లే ప్రయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన ఆప్ నాయకులు, కార్యకర్తలు.. సదురు యువకుడిని పట్టుకున్నారు. అనంతరం, అతడిని చితకబాదారు. ఈ ఘటనతో అక్కడి ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
🚨 Security breach: Man throws liquid at former CM Arvind Kejriwal, detained by police 🚨 pic.twitter.com/92nVej1YUJ
— Rahul kushwaha (@myy_Rahul) November 30, 2024
అయితే, కేజజ్రీవాల్‌పై దాడి చేసింది బీజేపీ కార్యకర్తే అని ముఖ్యమంత్రి అతిశి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో దాడికి పాల్పడిన వ్యక్తికి సంబంధించిన ఫొటోను ఆమె.. తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. మోదీతో సహా అతను ఆ ఫొటోలో ఉండటం గమనార్హం.
आज दिन दहाड़े भाजपा के कार्यकर्ता ने @ArvindKejriwal जी पर हमला किया। दिल्ली का चुनाव तीसरी बार हारने की बौखलाहट भाजपा में दिख रही है।
भाजपा वालों: दिल्ली के लोग ऐसी घटिया हरकतों का बदला लेंगे। पिछली बार 8 सीटें आयीं थी, इस बार दिल्ली वाले भाजपा को ज़ीरो सीट देंगे pic.twitter.com/LgJGN1aQ0T— Atishi (@AtishiAAP) November 30, 2024
ఇదిలా ఉండగా, అంతకుముందు కేజ్రీవాల్.. ఢిల్లీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీని గ్యాంగ్‌స్టర్లు నడిపిస్తున్నారని ఆరోపించారు. నగరంలో నిత్యం కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఘాటు విమర్శలు చేశారు. ఢిల్లీని కొన్ని ముఠాలు నడిపిస్తున్నట్లు తనకు అనిపిస్తోందని సంచలన కామెంట్స్ చేశారు. దీంతో, మరోసారి కేంద్రం, ఆప్ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం మొదలైంది. అనంతరం, ఆప్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment