
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. పంజాబ్ పర్యటనలో ఎదుర్కొన్న భద్రత వైఫల్యాలను గురించి తెలియజేశారు. ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ప్రధానికి ఫోన్ చేశారు. ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, నిన్న పంజాబ్ పర్యటనకు వెళ్లిన మోదీని నిరసన కారులు అడ్డుకోవడంతో.. ఒక ఫైఓవర్‌పై 20 నిముషాలపాటు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి, తన పర్యటన రద్దు చేసుకుని వెనక్కువచ్చేశారు.
ప్రధాని భద్రత విషయంలో పంజాబ్ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.
చదవండి: ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యంపై సుప్రీంకోర్టులో విచారణ!