బెంగళూరు: ప్రధాని మోదీ భద్రతా ఏర్పాట్లలో లోపం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మరోసారి బయటపడింది. ఎస్పీజీ స్థాయి భద్రత ఉన్న ఓ ప్రధాని స్థాయి వ్యక్తి కాన్వాయ్‌లోకి ఇతర వాహనాలు రావడం, తరచూ కొందరు అతిసమీపంగా రావడం గతంలో చూశాం. ఆయా ఘటనలపై విమర్శలు రావడం తెలిసిందే. తాజాగా కర్ణాటక ఎన్నికల ప్రచారంలోనూ అలాంటి సీన్ రిపీట్ అయ్యింది.
ఆదివారం మైసూర్ ప్రధాని మోదీ రోడ్‌షోలో పాల్గొన్నారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం పైకి ఓ మొబైల్ వచ్చి పడింది. రోడ్‍షోకు హాజరైన ప్రజలకు ప్రధాని మోదీ అభివాదం చేస్తున్న టైంలో ఇది జరిగింది. మోదీకి అతి సమీపంగా వెళ్లి.. వాహనం బొనెట్‍పై మొబైల్ పడింది. ఈ విషయాన్ని ఎస్‌పీజీ సిబ్బంది గమనించినా.. వాహనం ఆగకుండా ముందుకు పోయింది. అయితే.. ఈ ఘటనపై ప్రధాని మోదీ సెక్యూరిటీ బృందం దర్యాప్తు చేపట్టింది.
విచారణలో.. ఆ మొబైల్ బీజేపీ మహిళా కార్యకర్తదేనని తేలింది.మోదీపై పూలు వేసే క్రమంలో, అత్యుత్సాహంతో ఆ మహిళ మొబైల్ సైతం విసిరారని భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(SPG) అధికారులు ఆమెను వదిలేశారు.
#WATCH | Security breach seen during Prime Minister Narendra Modi’s roadshow, a mobile phone was thrown on PM’s vehicle. More details awaited. pic.twitter.com/rnoPXeQZgB
— ANI (@ANI) April 30, 2023
ఇదిలా ఉంటే.. తాజా కేరళ పర్యటనలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ప్రజలకు అభివాదం చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఓ మొబైల్ ఆయన కాళ్ల దగ్గర పడింది. వెంటనే.. పక్కనున్న సిబ్బంది దానిని పక్కకు తన్నేశారు. ఎస్‌పీజీ స్థాయి భద్రతా సిబ్బంది ఉన్న ప్రధానికి.. స్థానిక పోలీసుల భద్రతా భారీగా కల్పిస్తున్నప్పటికీ పెద్దగా ఆంక్షలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే విమర్శ వినిపిస్తోంది ఇప్పుడు.
Amazing reflex of PM Modi's SPG. Today during his roadshow at Kochi, someone threw a mobile along with flowers by mistake and see how the SPG personal reacted. pic.twitter.com/s4YhxJycEi
— നചികേതസ് (@nach1keta) April 24, 2023
#WATCH | Karnataka: Security breach during PM Modi's roadshow in Davanagere, earlier today, when a man tried to run towards his convoy. He was later detained by police.
— ANI (@ANI) March 25, 2023
(Visuals confirmed by police) pic.twitter.com/nibVxzgekz
#WATCH | Karnataka: A young man breaches security cover of PM Modi to give him a garland, pulled away by security personnel, during his roadshow in Hubballi.
— ANI (@ANI) January 12, 2023
(Source: DD) pic.twitter.com/NRK22vn23S
ఇదీ చదవండి: బుల్లి పట్టణాల్లోనూ బిలియనీర్లు
Comments
Please login to add a commentAdd a comment