ఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసులో నిందితులను మానసిక పరీక్షలు(సైకో ఎనాలసిస్) నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలతో పార్లమెంట్ అలజడి ఘటనకు పాల్పడటానికి నిందితుల అసలు ఉద్దేశం తెలుసుకునే అవకాశం ఉంటుంది. గురువారం ఒక నిందితున్ని ఫోరెన్సిక్ సైన్స్ లాబెరేటరీకి తీసుకెళ్లారు. ఒక్కొక్కర్ని ఈ పరీక్షలకు తీసుకెళ్లనున్నారు.
సైకో ఎనాలసిస్ పరీక్షల్లో నిందితుల అలవాట్లు, నిత్య జీవణ శైలి, స్వభావం తదితరాలు తెలుసుకుంటారు. సైక్రియాట్రిస్ట్ ప్రశ్న-జవాబుల విధానంలోనే ఈ టెస్ట్ ఉంటుంది. ఇచ్చిన జవాబుల ఆధారంగా నిందితుల వెనక ఉన్న అసలు ఉద్దేశాలను వైద్యులు అంచనా వేస్తారు. ఈ పరీక్షలు దాదాపు మూడు గంటలపాటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరుపుతారు. శ్రద్ధా వాకర్ మర్డర్ కేసు, షహ్‌బాద్ డైరీ మర్డర్ కేసుల్లో నిందితులపై పోలీసులు ఇలాంటి పరీక్షలను నిర్వహించారు.
డిసెంబర్ 13న పార్లమెంట్‌లోకి నలుగురు ఆగంతకులు ప్రవేేశించారు. ఇద్దరు లోక్‌సభ లోపల గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో గ్యాస్ బాంబులను ప్రయోగించారు. దీంతో పార్లమెంట్‌లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అంశంతో పార్లమెంట్ భద్రతా విధులను ఢిల్లీ పోలీసుల నుంచి కేంద్ర బలగాలకు బదిలీ చేశారు.
ఇదీ చదవండి: పార్లమెంట్‌లో మరో ముగ్గురు ఎంపీల సస్పెండ్.. మొత్తం 146 మంది
Comments
Please login to add a commentAdd a comment