ఢిల్లీ: పార్లమెంట్‌లో బుధవారం జరిగిన ఆందోళనకర ఘటనలో ఆరో నిందితున్ని లలిత్ ఝాగా పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో పార్లమెంట్ ఆవరణలోనే లలిత్ ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేల్చారు. ఘటనకు సంబంధించిన వీడియోను పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎన్జీవో వ్వవస్థాపకురాలు నీలాక్ష ఐచ్‌కు షేర్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం లలిత్ ఝా పరారీలో ఉన్నాడు.
సామాజిక కార్యకర్తగా పేరొందిన లలిత్ ఈ కుట్ర వెనుక ప్రధాన సూత్రగారి అని పోలీసులు భావిస్తున్నారు. బెంగాల్‌లో పలు ఎన్జీవోలలో భాగస్వామిగా పాలు పంచుకుంటున్నట్లు గుర్తించారు. బెంగాల్‌లోని పురీలియా, ఝార్‌గ్రమ్ జిల్లాల్లో కీలక నెట్‌వర్క్ ఉన్నట్లు తన సహచరులతో చెప్పుకున్నట్లు దర్యాప్తులో తేలింది.
"లలిత్ నాకు కాల్ చేయలేదు. పార్లమెంటు వెలుపల నిరసనకారులు గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగిస్తున్న వీడియోను వాట్సాప్‌లో పంపాడు. మధ్యాహ్నం 1-2 గంటల మధ్య ఈ వీడియో పంపాడు. ఆ సమయంలో కాలేజీలో ఉండి చూసుకోలేదు. తర్వాత చూసి నిరసన వివరాలను అడిగాను." అని నీలాష్క ఐచ్ తెలిపారు.
కోల్‌కతాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో లలిత్ పరిచయమయ్యాడని నీలాష్క తెలిపారు. వెనకబడిన వర్గాల తరుపున సామాజిక కార్యక్రమాలు చేస్తుంటానని లలిత్ పరిచయమైనట్లు చెప్పారు. అంతకుమించి లలిత్ గురించి తనకు ఏం తేలియదని అన్నారు. లలిత్ ఐచ్ ఎన్జీవో 'సంయబడి సుభాస్ సభ' ప్రధాన కార్యదర్శిగా కూడా లలిత్ పనిచేశాడు. అయితే.. తమ ఎన్జీవోలోని సభ్యులందరూ వారు నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తుంటారని నీలాష్క పేర్కొన్నారు. ఈ కుట్ర గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు.
ఇదీ చదవండి: Parliament Issue: గ్యాస్ క్యానిస్టర్లు అంటే ఏంటి? ఎక్కడైనా వాడొచ్చా?
Comments
Please login to add a commentAdd a comment