
ఫైల్ ఫోటో
సాక్షి, శ్రీకాకుళం: హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి పురస్కరించుకొని జిల్లాలోని ఎన్టీఆర్ఎంహెచ్ స్కూల్ మైదానంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిథిగా హాజయరయ్యారు. ఈ సందర్భంగా ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏపీ షూటింగ్ అకాడమీ , విక్రాంత్ బాడ్మింటన్ అకాడమీలను ప్రారంభించారు.
అనంతరం కృష్ణదాస్ మాట్లాడుతూ.. ఉపముఖ్యమంత్రిగా క్రీడలంటే నాకు చాలా ఇష్టం. ఏపీలోని అన్ని జిల్లాలకు క్రీడాకారుడిగానే కృష్ణదాస్ అంటే తెలుసు.క్రీడలతోనే నాకు గుర్తింపు వచ్చింది. స్కూల్లో పాస్ మార్కులు వస్తే చాలనుకునేవాడిని ఆటల కోసమే విశాఖ వెళ్లి డిగ్రీలో చేరాను.గతంలో క్రీడలు ఎంతో దయనీయస్థితిలో ఉండేవి.. ప్రస్తుతం క్రీడలకు సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.. ఆన్ స్పోర్ట్స్ క్రీడలు నేటికీ నిరాదరణకు గురవుతున్నాయనేది నా వ్యక్తిగత అభిప్రాయం . ఈ విషయం పై ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు స్పోర్ట్స్ కు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. వైద్యం కోసం వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. క్రీడల కోసం కొంత ఖర్చు చేస్తే ... వైద్యానికి పెట్టే ఖర్చు కొంత తగ్గుతుందనేది నా భావన క్రీడలకు ఖర్చు చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్యవంతమైన సమాజం కావాలంటే క్రీడాకారులను ప్రోత్సహించాలి. సమాజం పట్ల గౌరవం , క్రమశిక్షణ ఒక్క క్రీడాకారుడికే ఉంటాయి.' అని మంత్రి చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment