ఉత్తమ ఆటగాడిగా శ్రీజేష్
బెంగళూరు: ఈ ఏడాది ‘అత్యుత్తమ హాకీ ఆటగాడు’ అవార్డును భారత గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ గెలుచుకున్నాడు. మహిళల విభాగంలో దీపికాకు ఈ పురస్కారం లభించింది. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో హాకీ ఇండియా (హెచ్‌ఐ) వార్షిక అవార్డులను ప్రదానం చేసింది. ఈ ఇద్దరికి చెరో రూ. 25 లక్షల నగదుతో పాటు ట్రోఫీలను బహూకరించారు.
దివంగత కెప్టెన్ శంకర్ లక్ష్మణ్‌కు... ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్‌చంద్ జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. ఈ అవార్డు కింద రూ. 30 లక్షల నగదుతో పాటు ట్రోఫీని అందజేశారు. భారత్ తరఫున 100 మ్యాచ్‌లు ఆడినందుకు ధర్మవీర్ సింగ్, కొతాజిత్ సింగ్, బీరేంద్ర లక్రా, సుశీలా చానులకు తలా రూ. 50 వేల నగదు పురస్కారం, ట్రోఫీని ఇచ్చారు. 200 మ్యాచ్‌లు ఆడిన వీఆర్ రఘునాథ్, గుర్బాజ్ సింగ్‌లకు చెరో లక్ష చొప్పున ఇచ్చారు. 36 ఏళ్ల తర్వాత రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మహిళల జట్టును ఈ సందర్భంగా సత్కరించారు.