
అశ్విన్‌కు ‘అర్జున’ అవార్డు అందజేత
న్యూఢిల్లీ: భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ప్రతిష్టాత్మక ‘అర్జున’ అవార్డును శుక్రవారం అందజేశారు. క్రికెటర్ గతేడాది ఈ పురస్కారానికి ఎంపికయ్యాడు. అయితే ఇంగ్లండ్ పర్యటన కారణంగా ఆగస్టు 29న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డుల కార్యక్రమానికి అశ్విన్ హాజరుకాలేకపోయాడు. దీంతో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ చేతుల మీదుగా అతను పురస్కారాన్ని స్వీకరించాడు. అవార్డును సాధించినందుకు చాలా గర్వంగా ఉందని స్పిన్నర్ వ్యాఖ్యానించాడు. ‘క్రికెట్‌తో నా ప్రయాణం ఆనందంగా సాగుతోంది. ఓ రకంగా నేను చాలా అదృష్టవంతుడిని. ఇందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. దేశానికి ఆడటం నాకు లభించిన అతి పెద్ద డిగ్రీ. మరింత మెరుగ్గా దేశానికి సేవలందిస్తూ ఎన్నో అవార్డులను సాధించాలని కోరుకుంటున్నా’ అని అశ్విన్ పేర్కొన్నాడు.