‘అర్జున’కు నేనూ అర్హుడినే: సంధూ | Arjuna this time Sandhu after third failed attempt | Sakshi

‘అర్జున’కు నేనూ అర్హుడినే: సంధూ

Aug 21 2017 12:51 AM | Updated on Aug 20 2018 4:12 PM

‘అర్జున’కు నేనూ అర్హుడినే: సంధూ - Sakshi

‘అర్జున’కు నేనూ అర్హుడినే: సంధూ

‘అర్జున’ అవార్డుల విషయంలో మరో క్రీడాకారుడు నిరసన గళం విప్పాడు.

న్యూఢిల్లీ: ‘అర్జున’ అవార్డుల విషయంలో మరో క్రీడాకారుడు నిరసన గళం విప్పాడు. మూడోసారి కూడా ఈ అవార్డు కోసం తనను విస్మరించడంపై భారత స్టార్‌ స్క్వాష్‌ ప్లేయర్‌ హరీందర్‌ పాల్‌ సంధూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత జట్టులో అతను సభ్యుడు. ‘ఈసారి కచ్చితంగా నా పేరు జాబితాలో ఉంటుందని భావించాను. అయితే అర్హత ఉన్నప్పటికీ నన్ను పరిగణనలోకి తీసుకోకపోవడం తీవ్రంగా నిరాశపరిచింది’ అని 28 ఏళ్ల సంధూ తెలిపాడు.

తనకు సహచరుడు సౌరవ్‌ ఘోషాల్‌కు మద్దతు తెలుపుతూ 2014లోనే అతడికి అర్జున రావాల్సిందని అన్నాడు. అయితే సంధూ టీమ్‌ ఈవెంట్స్‌లో కీలకంగా ఉంటున్నా... వ్యక్తిగత విభాగంలో ఆసియా, కామన్వెల్త్‌ గేమ్స్‌లో పతకాలు సాధించకపోవడం అతడి అవకాశాలను దెబ్బతీస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement