మహిళా షూటర్‌పై అత్యాచారం
Published Mon, Dec 5 2016 12:17 AM | Last Updated on Mon, Aug 20 2018 4:12 PM
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఓ జాతీయ స్థాయి మహిళా షూటర్‌పై సహచర ఆటగాడే అత్యాచారం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఆ అర్జున అవార్డీ షూటర్ చివరికి మోసం చేసి పరారయ్యాడు. దీంతో మహిళా షూటర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్న ఈ షూటర్ రెండేళ్ల నుంచి తెలుసని... భారత స్పోర్‌ట్స అథారిటీ (సాయ్) షూటింగ్ రేంజిలో జాతీయ చాంపియన్‌షిప్స్ కోసం జరిగిన శిక్షణ సందర్భంగా పరిచయం అయ్యాడని మహిళా షూటర్ తన ఫిర్యాదులో పేర్కొంది.
వివాహం చేసుకుంటానని నమ్మించి, గత నెలలో పానీయంలో మత్తు మందు కలిపి అత్యాచారం చేశాడని తెలిపింది. వైద్యపరీక్షల నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు. నిందితుడిని విచారణకు హాజరుకావాలని ఆదేశించినట్టు చెప్పారు. మరోవైపు ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్‌ఆర్‌ఏఐ) పేర్కొంది. అయితే మీడియా ద్వారానే ఈ విషయం తెలుసుకున్నామని, ఢిల్లీ పోలీసుల నుంచి పూర్తి వివరాలు అందాక తదుపరి చర్యలు తీసుకుంటామని ఎన్‌ఆర్‌ఏఐ కార్యదర్శి రాజీవ్ భాటియా తెలిపారు.
Advertisement
Advertisement