క్రీడా పురస్కారాల కార్యక్రమానికి పుజారా దూరం
న్యూఢిల్లీ: ‘అర్జున’ అవార్డు పొందిన భారత స్టార్ క్రికెటర్ చతేశ్వర్ పుజారా... న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నేడు(మంగళవారం) జరిగే జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొనడంలేదు. ఇంగ్లండ్‌లోని కౌంటీ క్రికెట్ పోటీల్లో ఆడుతున్నందున తాను ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నానని పుజారా తెలిపాడు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి సాకేత్ మైనేని (టెన్నిస్), జ్యోతి సురేఖ (ఆర్చరీ) ‘అర్జున’ అవార్డులను... గంగుల ప్రసాద్ (బ్యాడ్మింటన్) ‘ద్రోణాచార్య’ అవార్డును, హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ షాహిద్ హకీమ్ (ఫుట్‌బాల్) ‘ధ్యాన్‌చంద్’ పురస్కారాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా స్వీకరించనున్నారు.