క్రీడల్లో రెండో అత్యున్నత పురస్కారమైన అర్జున అవార్డుకు టీమిండియా డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్, భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానల పేర్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రతిపాదించింది. ఈ విషయాన్ని బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి బుధవారం మీడియాకు తెలిపారు. ప్రస్తుతం కెరీర్ అత్యుత్తమ ఫామ్లో ఉన్న ఈ ఆటగాళ్లు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని, అందుకే వారిని అర్జున అవార్డుతో సత్కరించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే వారి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
‘అర్జున’కు ధావన్, మంధాన
Published Wed, Apr 25 2018 10:15 PM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM
Advertisement
Advertisement
Advertisement