2022 ఏడాదికి గానూ భారత్ టేబుల్ టెన్నిస్ స్టార్ ఆచంట శరత్ కమల్‌ను సెలక్షన్ కమిటీ ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుకు సిఫార్సు చేసింది. ప్రతిష్టాత్మక పురస్కారానికి ఈ ఏడాది శరత్ కమల్ మినహా మరెవరిని ఎంపిక చేయకపోవడం విశేషం. దీంతో శరత్ కమల్‌కు ఖేల్‌రత్న అవార్డు రావడం గ్యారంటీ.
ఇక 40 ఏళ్ల ఆచంట శరత్ కమల్ ఈ ఏడాది టేబుల్ టెన్నిస్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. కామన్‌వెల్త్ గేమ్స్‌లో నాలుగు పతకాలు సాధించగా.. ఇందులో మూడు స్వర్ణాలు, ఒక రజతం ఉంది. అలాగే శరత్ కమల్ ఏషియన్ గేమ్స్‌లో రెండుసార్లు పతకాలు సాధించిన తొలి టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడిగా చరిత్రకెక్కాడు.
ఇక అర్జున అవార్డుకు 25 మంది పేర్లను సిఫార్సు చేసినట్లు సెలక్షన్ కమిటీ ప్రకటించింది. వీరిలో తెలంగాణకు చెందిన మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ కూడా ఉంది. జరీన్‌తో పాటు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్యసేన్, చెస్ సంచలనం ఆర్ ప్రజ్ఞానంద, రెజ్లర్ అన్షు మాలిక్ తదితరులు ఉన్నారు. అయితే ఈసారి అర్జున అవార్డుకు సిఫార్సు చేసిన జాబితాల ఒక్క క్రికెటర్ కూడా లేకపోవడం గమనార్హం.
ఇక తెలంగాణకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ కామన్‌వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించింది. అంతకముందు టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి దేశ ఖ్యాతిని పెంపొందించింది. ఇక తెలంగాణకే చెందిన టేబుల్ టెన్నిస్ సంచనలం ఆకుల శ్రీజ కూడా అర్జున అవార్డు బరిలో ఉంది.
ఖేల్ రత్న అవార్డు సిఫార్సు: ఆచంట శరత్ కమల్
అర్జున అవార్డు సిఫార్సులు: సీమా పునియా (అథ్లెటిక్స్), ఎల్దోస్ పాల్ (అథ్లెటిక్స్), అవినాష్ సేబుల్ (అథ్లెటిక్స్), లక్ష్య సేన్ (బ్యాడ్మింటన్), హెచ్ఎస్ ప్రణయ్ (బ్యాడ్మింటన్), అమిత్ పంఘల్ (బాక్సింగ్), నిఖత్ జరీన్ (బాక్సింగ్), భక్తి కులకర్ణి (చెస్), ఆర్ ప్రజ్ఞానంద (చెస్), దీప్ గ్రేస్ ఎక్కా (హాకీ), శుశీలా దేవి (జూడో), సాక్షి కుమారి (కబడ్డీ), నయన్ మోని సైకియా (లాన్ బౌల్స్), సాగర్ ఓవల్కర్ (మల్లాఖాంబ్), ఎలవేనిల్ వలరివన్ (షూటింగ్), ఓం ప్రకాష్ మిథర్వాల్ (షూటింగ్), శ్రీజ అకుల (టేబుల్ టెన్నిస్), వికాస్ ఠాకూర్ (వెయిట్ లిఫ్టింగ్), అన్షు మాలిక్ (రెజ్లింగ్), సరితా మోర్ (రెజ్లింగ్), పర్వీన్ (వుషు), మనాషి జోషి (పారా బ్యాడ్మింటన్), తరుణ్ ధిల్లాన్ (పారా బ్యాడ్మింటన్), స్వప్నిల్ పాటిల్ (పారా స్విమ్మింగ్), జెర్లిన్ అనికా (డెఫ్ బ్యాడ్మింటన్)
Comments
Please login to add a commentAdd a comment