షమీ​కి అర్జున.. చిరాగ్‌, సాత్విక్‌లకు ఖేల్‌రత్న అవార్డులు | National Sports Awards 2023: Mohammed Shami Gets Arjuna Award, Chirag Shetty Gets Khel Ratna Award - Sakshi
Sakshi News home page

షమీ​కి అర్జున.. చిరాగ్‌, సాత్విక్‌లకు ఖేల్‌రత్న అవార్డులు

Published Wed, Dec 20 2023 4:54 PM

National Sports Awards 2023: Mohammed Shami Gets Arjuna, Chirag Shetty Gets Khel Ratna Award - Sakshi

జాతీయ క్రీడా అవార్డులను కేంద్ర యువజన మరియు క్రీడల మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఈ ఏడాది వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 26 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు, బ్యాడ్మింటన్‌లో అత్యుత్తమంగా రాణించిన ఇద్దరికి మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డులు దక్కాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అత్యుత్తమంగా రాణించిన మొహమ్మద్‌ షమీని అర్జున అవార్డు వరించగా.. చిరాగ్‌ చంద్రశేఖర్‌ షెట్టి, రాంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌లకు మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డులు దక్కాయి.

అర్జున, ఖేల్‌రత్న అవార్డులతో పాటు కేంద్రం ద్రోణాచార్య (రెగ్యులర్‌, లైఫ్‌టైమ్‌), ధ్యాన్‌చంద్‌ (లైఫ్‌టైమ్‌ అఛీవ్‌మెంట్‌) అవార్డులను కూడా ప్రకటించింది. అవార్డు పొందిన వారందరూ వచ్చే ఏడాది (2024) జనవరి 9న భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకుంటారు.

మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డులు 2023: 

  1. చిరాగ్‌ చంద్రశేఖర్‌ షెట్టి (బ్యాడ్మింటన్‌)
  2. రాంకిరెడ్డి సాత్విక్‌సాయిరాజ్‌ (బ్యాడ్మింటన్‌)

అర్జున అవార్డులు 2023: 

  1. ఓజాస్‌ ప్రవీణ్‌ దియోటలే (ఆర్చరీ)
  2. అదితి గోపీచంద్‌ స్వామి (ఆర్చరీ)
  3. ఎం శ్రీశంకర్‌ (అథ్లెటిక్స్‌)
  4. పారుల్‌ చౌదరీ (అథ్లెటిక్స్‌)
  5. మొహమ్మద్‌ హుస్సాముద్దీన్‌ (బాక్సింగ్‌)
  6. ఆర్‌ వైశాలీ (చెస్‌)
  7. మొహమ్మద్‌ షమీ (క్రికెట్‌)
  8. అనూషా అగర్వల్లా (ఈక్వెస్ట్రియన్‌)
  9. దివ్యకృతి సింగ్ (ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్)
  10. దీక్షా దాగర్ (గోల్ఫ్)
  11. కృషణ్‌ బహదూర్ పాఠక్ (హాకీ)
  12. పుఖ్రంబం సుశీల చాను (హాకీ)
  13. పవన్ కుమార్ (కబడ్డీ)
  14. రీతు నేగి (కబడ్డీ)
  15. నస్రీన్ (ఖోఖో)
  16. పింకీ (లాన్ బౌల్స్)
  17. ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ (షూటింగ్)
  18. ఈషా సింగ్ (షూటింగ్)
  19. హరీందర్ పాల్ సింగ్ సంధు (స్క్వాష్)
  20. అహికా ముఖర్జీ (టేబుల్ టెన్నిస్)
  21. సునీల్ కుమార్ (రెజ్లింగ్)
  22. అంటిమ్ (రెజ్లింగ్)
  23. నౌరెమ్ రోషిబినా దేవి (ఉషు)
  24. శీతల్ దేవి (పారా ఆర్చరీ)
  25. ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి (బ్లైండ్ క్రికెట్)
  26. ప్రాచీ యాదవ్ (పారా కానోయింగ్)

 ద్రోణాచార్య అవార్డులు 2023 (రెగ్యులర్‌):

  1. లలిత్ కుమార్ (రెజ్లింగ్)
  2. ఆర్‌ బి రమేష్ (చదరంగం)
  3. మహావీర్ ప్రసాద్ సైనీ (పారా అథ్లెటిక్స్)
  4. శివేంద్ర సింగ్ (హాకీ)
  5. గణేష్ ప్రభాకర్ దేవ్రుఖ్కర్ (మల్లఖాంబ్)

 ద్రోణాచార్య అవార్డులు 2023 (లైఫ్‌టైమ్‌):

  1. జస్కీరత్ సింగ్ గ్రేవాల్ (గోల్ఫ్)
  2. ఈ భాస్కరన్ (కబడ్డీ)
  3. జయంత కుమార్ పుషీలాల్ (టేబుల్ టెన్నిస్)

ధ్యాన్‌చంద్ అవార్డులు 2023 (లైఫ్‌టైమ్‌):

  1. మంజుషా కన్వర్ (బ్యాడ్మింటన్)
  2. వినీత్ కుమార్ శర్మ (హాకీ)
  3. కవిత సెల్వరాజ్ (కబడ్డీ)

మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ 2023:

  1. గురునానక్ దేవ్ యూనివర్సిటీ, అమృత్సర్ (విజేత)
  2. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్ (మొదటి రన్నరప్‌)
  3. కురుక్షేత్ర విశ్వవిద్యాలయం, కురుక్షేత్ర (రెండో రన్నరప్‌)

Advertisement
Advertisement