President Draupadi Murmu To Presents National Sports Awards 2022 Today In Delhi - Sakshi
Sakshi News home page

National Sports Awards: రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం

Published Wed, Nov 30 2022 4:31 PM | Last Updated on Thu, Dec 1 2022 8:24 AM

President Draupadi  Murmu Presents National Sports Awards 2022 Delhi - Sakshi

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం బుధవారం(నవంబర్‌ 30న) కన్నుల పండువగా జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా క్రీడాకారులు పురస్కారాలు అందుకున్నారు. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న అవార్డును టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ ఆచంట శరత్‌ కమల్‌ అందుకోగా.. 25 మంది క్రీడాకారులు అర్జున అవార్డు అందుకున్నారు.

వీరిలో బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌, బ్యాడ్మింట్‌న్‌ స్టార్‌ హెచ్‌ ప్రణయ్‌, చెస్‌ సంచలనం ఆర్‌ ప్రజ్ఞానంద, ఆకుల శ్రీజ తదితరులు ఉన్నారు. ఇక 8 మంది కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డులను అందజేశారు.భారత క్రీడా మంత్రిత్వ శాఖ ఈ ఏడాది క్రీడా అవార్డులను నవంబర్ 14న ఈ అవార్డులను ప్రకటించింది. 

విజేతల జాబితా:

మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు: ఆచంట శరత్ కమల్

అర్జున అవార్డులు: సీమా పూనియా (అథ్లెటిక్స్), ఆల్డస్ పాల్ (అథ్లెటిక్స్), అవినాష్ సాబుల్ (అథ్లెటిక్స్), లక్ష్య సేన్ (బ్యాడ్మింటన్), హెచ్ఎస్ ప్రణయ్ (బ్యాడ్మింటన్), అమిత్ (బాక్సింగ్), నిఖత్ జరీన్ (బాక్సింగ్), భక్తి కులకర్ణి (చెస్) , ఆర్ ప్రజ్ఞానంద (చెస్), దీప్ గ్రేస్ ఇక్కా (హాకీ), ​​సుశీలా దేవి (జూడో), సాక్షి కుమారి (కబడ్డీ), నయన్ మోని సైకియా (లోన్‌బాల్), సాగర్ ఓవల్కర్ (మల్కాంబ్), ఎలవెనిల్ వలరివన్ (షూటింగ్), ఓంప్రకాష్ మిథర్వాల్ (షూటింగ్) శ్రీజ ఆకుల (టేబుల్ టెన్నిస్), వికాస్ ఠాకూర్ (వెయిట్ లిఫ్టింగ్), అన్షు (రెజ్లింగ్), సరిత (రెజ్లింగ్), పర్వీన్ (వుషు), మాన్సీ జోషి (పారా బ్యాడ్మింటన్), తరుణ్ ధిల్లాన్ (పారా బ్యాడ్మింటన్), స్వప్నిల్ పాటిల్ (పారా స్విమ్మింగ్), జెర్లిన్ అనికా జె (చెవిటి బ్యాడ్మింటన్)

ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్ విభాగంలో కోచ్‌లకు): జీవన్‌జోత్ సింగ్ తేజ (ఆర్చరీ), మహ్మద్ అలీ కమర్ (బాక్సింగ్), సుమా షిరూర్ (పారా-షూటింగ్) మరియు సుజిత్ మాన్ (రెజ్లింగ్)

జీవితకాల పురస్కారం: దినేష్ లాడ్ (క్రికెట్), బిమల్ ఘోష్ (ఫుట్‌బాల్), రాజ్ సింగ్ (రెజ్లింగ్)

ధ్యాన్ చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు: అశ్విని అక్కుంజీ (అథ్లెటిక్స్), ధరమ్‌వీర్ సింగ్ (హాకీ), ​​బిసి సురేష్ (కబడ్డీ), నీర్ బహదూర్ గురుంగ్ (పారా అథ్లెటిక్స్)

చదవండి: FIFA WC: దేశాల మధ్య మాత్రమే యుద్ధం.. ఆటగాళ్లకు కాదు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement