నాగండ్ల (ఇంకొల్లు), న్యూస్‌లైన్: బ్యాడ్మింటన్‌లో అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి గడించిన పుల్లెల గోపీచంద్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును శనివారం ప్రకటించడంతో ఆయన స్వగ్రామం ఇంకొల్లు మండలం నాగండ్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గోపీచంద్ కీర్తి కిరీటంలో ఇప్పటికే ఎన్నో అవార్డులున్నాయి. గతంలో అర్జున అవార్డు, రాజీవ్ ఖేల్త్న్ర, పద్మశ్రీ, ద్రోణాచార్య అవార్డులు ఆయనకు లభించాయి.
గోపీచంద్ ప్రాథమిక విద్య ఒంగోలులోనే పద్మభూషణుడు పూర్తిచేశారు. ఉన్నత విద్యను హైదరాబాద్‌లో అభ్యసించారు. పిన్ని మాంచాల ప్రోద్బలంతో అన్నదమ్ములు బ్యాడ్మింటన్ క్రీడపై ఆసక్తి కనబరిచారు. గోపీచంద్, ఆయన అన్న రాజశేఖర్ ఇద్దరూ డబుల్స్ ఆడుతూ జాతీయ క్రీడాకారులుగా మంచి గుర్తింపు పొందారు. రాజశేఖర్‌కు ఐటీఐ సీటు లభించడంతో క్రీడలకు స్వస్తి పలికారు.
తల్లి సుబ్బరావమ్మ గృహిణి కాగా తండ్రి పుల్లెల శుభాష్‌చంద్రబోస్ ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు జనరల్ మేనేజర్‌గా ఉద్యోగ విరమణ చేశారు. గోపీచంద్‌కు పద్మభూషణ్ అవార్డు లభించడంతో ఆయన స్వగ్రామంలో ఉన్న అమ్మమ్మ, తాతయ్యలు గోరంట్ల వీరయ్య, ఆదిలక్ష్మిలతో పాటు ఆలిండియా బ్యాడ్మింటన్ కార్యదర్శి కేసీహెచ్ పున్నయ్య చౌదరి, బాబాయిలు సోమేపల్లి రామ్మోహన్‌రావు, మార్కండేయులు, కొరిటాల శివప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు.
బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌కు పద్మభూషణ్ అవార్డు
Published Sun, Jan 26 2014 3:35 AM | Last Updated on Mon, Aug 20 2018 4:12 PM
Advertisement