
సురేఖకు ప్రధాని అభినందన
‘అర్జున అవార్డు’కు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ మంగళవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. ఈ సందర్భంగా ఆమెను అభినందించిన మోదీ... భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు, మురళీమోహన్, ‘శాప్’ చైర్మన్ పీఆర్ మోహన్ తదితరులు సురేఖ వెంట ఉన్నారు.