
న్యూఢిల్లీ: భారత్ టేబుల్ టెన్నిస్ (టీటీ) మాజీ క్రీడాకారుడు, ‘అర్జున అవార్డు’ గ్రహీత వేణుగోపాల్ చంద్రశేఖర్ (64) కరోనాతో కన్నుమూశారు. మూడుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన చంద్రశేఖర్ 1982 కామన్వెల్త్ క్రీడల్లో సెమీఫైనల్ చేరారు. క్రీడాకారుడిగా కెరీర్ ముగిశాక ఆయన కోచ్‌గా మారారు. ప్రస్తుత యువ ఆటగాడు సత్యన్, జాతీయ మాజీ చాంపియన్ ఎస్.రామన్ ఆయన శిష్యులే. చనిపోయే సమయానికి చంద్రశేఖర్ చెన్నైలోనే ఎస్‌డీఏటీ–మెడిమిక్స్ టీటీ అకాడమీకి హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.