చెన్నై: అప్పట్లో మనం వెండితెరపై తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్... తనను పోలిన రోబోతో ఇంచుమించు యుద్ధమే చేస్తాడు. ఇదంతా సినిమా‘ట్రిక్’. కానీ నిజజీవితంలో భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) ఆటగాడు సత్యన్ జ్ఞానశేఖరన్... రోబోతో తన ఆట ప్రాక్టీస్ చేస్తున్నాడు. కరోనా వైరస్ వ్యాపిస్తుండటంతో ప్రపంచంతో పాటు భారత్ కూడా లాక్‌డౌన్‌లో ఉంది. అడుగు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో సత్యన్ తన భాగస్వామిగా మరో మనిషిని కాకుండా మరమనిషిని ఎంచుకున్నాడు. రోబోతోనే తన ప్రాక్టీస్ చురుగ్గా సాగుతోందని చెప్పాడు. ఈ రోబోను జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నాడు. ఇది నిమిషానికి 120 బంతుల్ని నెట్‌పై ఆడగలదు. అన్నట్లు బంతుల స్పిన్, వేగ నియంత్రణను చేసుకునే సౌకర్యం ఇందులో ఉంది. ఈ మరమనిషితోనే రోజు గంటన్నర సేపు ప్రాక్టీస్ చేస్తున్నట్లు 27 ఏళ్ల సత్యన్ తెలిపాడు. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) మొత్తం ఈవెంట్లను జూన్ 30 దాకా రద్దు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment