సాయిప్రణీత్‌కు సీఎం జగన్‌ అభినందనలు | CM YS Jagan Appreciate Sai Praneeth For Getting Arjuna Award | Sakshi
Sakshi News home page

సాయిప్రణీత్‌కు సీఎం జగన్‌ అభినందనలు

Published Thu, Aug 29 2019 10:03 PM | Last Updated on Thu, Aug 29 2019 10:11 PM

CM YS Jagan Appreciate Sai Praneeth For Getting Arjuna Award - Sakshi

సాక్షి, అమరావతి : అర్జున అవార్డు గ్రహిత సాయిప్రణీత్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రతిష్టాత్మక అర్జున అవార్డును సాధించడం తెలుగు రాష్ట్రాలకు గర్వంగా ఉందన్నారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. కాగా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ రోజు (ఆగష్టు 29)న ఢిల్లీలోని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా సాయిప్రణీత్‌ అర్జున అవార్డును అందుకున్నారు.

(చదవండి : ఒలంపిక్స్‌లో పతకంమే నా లక్ష్యం : సాయిప్రణీత్‌)

రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగిన ఈ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో జాతీయ క్రీడా పురస్కారాలు అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు, రాజీవ్ ఖేల్ రత్నఅవార్డులకు ఎంపికైన క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ అవార్డులను అందజేశారు. 

(చదవండి : రాష్ట్రపతి భవన్‌లో క్రీడా పురస్కారాల ప్రదానం)   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement