
జైపూర్: ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి ఓటమి ఎరుగకుండా దూసుకెళ్తున్న భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ ఖాతాలో వరుసగా పదో విజయం వచ్చి చేరింది. ఘనా బాక్సర్ ఎర్నెస్ట్ అముజుతో శనివారం ఇక్కడ జరిగిన బౌట్‌లో విజేందర్ ఏకపక్ష విజయాన్ని సాధించాడు. మూడు నిమిషాల నిడివిగల 10 రౌండ్ల బౌట్‌లో విజేందర్ పూర్తి ఆధిపత్యం చలాయించాడు. బౌట్‌ను పర్యవేక్షించిన ముగ్గురు న్యాయ నిర్ణేతలు విజేందర్‌కు 100 పాయింట్ల చొప్పున ఇవ్వగా... అముజుకు 90 పాయింట్లు మాత్రమే ఇచ్చారు.
ఈ విజయంతో 32 ఏళ్ల విజేందర్ డబ్ల్యూబీవో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్‌తో పాటు ఓరియంటల్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. ఈ బౌట్‌కు ముందు విజేందర్‌ను ఓడించడంతో పాటు అతని ఎముకలు విరగ్గొడతానని చాలెంజ్ చేసిన 34 ఏళ్ల అముజుకు అసలు సమరంలో మాత్రం విజేందర్ పంచ్‌లకు చుక్కలు కనిపించాయి. ఒకానొక దశలో విజేందర్ పంచ్‌లకు తాళలేక అముజు రింగ్ చుట్టూ చక్కర్లు కొట్టాడు. ఘనా బాక్సర్‌ను అలవోకగా మట్టి కరిపిస్తానని మ్యాచ్‌కు ముందే చెప్పిన విజేందర్ చెప్పిందే చేసి చూపించాడు.
Comments
Please login to add a commentAdd a comment