
విజేందర్ సింగ్(ఫైల్)
చండీగఢ్: ప్రొఫెషనల్ గా మారిన భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ గురువారం హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిశాడు. సీఎం అధికార నివాసంలో అరగంట పాటు మనోహర్ లాల్ తో మంతనాలు జరిపాడు. సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయాడు. అమెచ్యూర్ నుంచి ప్రొఫెషనల్ గా మారే క్రమంలో నిబంధనలు పాటించాలని విజేందర్ కు సీఎం చెప్పినట్టు తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోకుంటే డీఎస్పీ హోదాలో ఉన్న విజేందర్ పై చర్య తీసుకుంటామని హర్యారా పోలీసు విభాగం హెచ్చరించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. అమెచ్యూర్ కెరీర్ కు స్వస్తి చెప్పిన ఈ హర్యానా బాక్సర్ లండన్ లోని క్వీన్స్ బెర్రీ ప్రమోషన్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసింది.