ఆ పంచ్ లో పవర్ సూపర్! | Vijender Singh's Technical Know-How and Power Impressive, Says British Trainer Lee Beard | Sakshi
Sakshi News home page

ఆ పంచ్ లో పవర్ సూపర్!

Published Fri, Oct 9 2015 7:54 PM | Last Updated on Sun, Sep 3 2017 10:41 AM

ఆ పంచ్ లో పవర్ సూపర్!

ఆ పంచ్ లో పవర్ సూపర్!

మాంచెస్టర్: ప్రొఫెషనల్ బాక్సర్ గా శనివారం తొలిసారి రింగ్ లోకి దిగబోతున్న భారత క్రీడాకారుడు విజేందర్ సింగ్ పై అతనికి శిక్షణ అందిస్తున్న బ్రిటీష్ ట్రైనర్ లీ బీర్డ్ ప్రశంసల వర్షం కురిపించాడు.  విజేందర్ సింగ్ పంచ్ లో ఓ పవర్ ఉందంటూ కొనియాడాడు. విజేందర్ టెక్నీకల్ గా చాలా పరిణితి చెందిన బాక్సరే కాకుండా అతనిలో సహజసిద్ధమైన ప్రతిభ దాగి వుందన్నాడు.

 

'విజేందర్ పంచ్ గురించి అతని కంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు. అతని పంచ్ లో సూపర్ పవర్ ఉంది. దాంతో పాటు చాలా తెలివైన బాక్సర్. అతనిపై నాకు చాలా అంచనాలే ఉన్నాయి' అంటూ  లీ బీర్డ్ స్పష్టం చేశాడు.

రేపు మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్ బాక్సర్ వైటింగ్ తో తో విజేందర్ తలపడనున్నాడు. ఇప్పటికే ప్రొఫెషనల్ బాక్సర్ గా వైటింగ్ కు 2-1 రికార్డు ఉంది.  రాత్రి 10.20 ని.లకు సోనీ సిక్స్ లో ప్రసారం కానున్నఈ పోరులో విజేందర్ విజయం సాధించాలంటూ బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ముందుగా శుభాకాంక్షలు తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement