విజేందర్‌కు హర్యానా ప్రభుత్వ మద్దతు | Vijender Singh meets Haryana CM after coming under fire for turning pro | Sakshi
Sakshi News home page

విజేందర్‌కు హర్యానా ప్రభుత్వ మద్దతు

Published Fri, Jul 3 2015 12:14 AM | Last Updated on Sun, Sep 3 2017 4:45 AM

విజేందర్‌కు హర్యానా ప్రభుత్వ మద్దతు

విజేందర్‌కు హర్యానా ప్రభుత్వ మద్దతు

చండీగఢ్: ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారాలనుకున్న విజేందర్ సింగ్‌కు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. తమ అనుమతి లేకుండా విజేందర్ ప్రొఫెషనల్‌గా మారరాదని అతను ఉద్యోగిగా ఉన్న పోలీస్ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దాంతో ఈ విషయంలో సహకారం కోరుతూ విజేందర్ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిశాడు.
 
  లండన్ వెళ్లి ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో భాగమయ్యేందుకు అనుమతి ఇవ్వాలని అతను సీఎంకు విజ్ఞప్తి చేశాడు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ అంశంలో తాము నిబంధనలకు అనుగుణంగానే పని చేస్తామని, ప్రభుత్వంనుంచి ఏదైనా ఆదేశాలు వస్తే పాటిస్తామని హర్యానా డీజీపీ వైపీ సింఘాల్ స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement