
ప్రమోటర్స్‌తో విజేందర్ తెగతెంపులు
న్యూఢిల్లీ: భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ తన ప్రమోటర్స్ ‘క్వీన్స్‌బెరీ ప్రమోషన్స్’తో కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకున్నాడు. విజేందర్ ఇప్పటి వరకు 8 బౌట్‌లలో పాల్గొని అజేయంగా నిలవగా, క్వీన్స్‌బెరీ వాటిని ప్రమోట్ చేసింది. అయితే గత ఏడాది కాలంలో క్వీన్స్‌బెరీ ప్రతినిధులు తాను ఆశించిన స్థాయిలో అవకాశాలు కల్పించలేకపోయారని విజేందర్ చెప్పాడు. ‘ఏడాదిలో కనీసం ఆరు బౌట్‌లలో పాల్గొనే అవకాశం ఇస్తామని వారు ఒప్పందం చేసుకున్నారు.
తొలి ఏడాది అలాగే ఆరు బౌట్‌లు జరిగాయి. కానీ తర్వాతి సంవత్సరం మాత్రం రెండే బౌట్‌లు రాగా, వాటిలోనూ వారి ప్రమేయం పెద్దగా లేదు. కాబట్టి వారిని కొనసాగించాల్సిన అవసరం లేదని భావించి నిబంధనల ప్రకారం రద్దు చేసుకున్నాను’ అని విజేందర్ స్పష్టం చేశాడు. ఇకపై విజేందర్ వ్యవహారాలను ఐఓఎస్ బాక్సింగ్ ప్రమోషన్స్ పర్యవేక్షిస్తుంది. అతని తర్వాత బౌట్ జులైలో జరుగుతుందని, ప్రస్తుతానికి లీ బియర్డ్ కోచ్‌గా కొనసాగుతాడని కూడా ఐఓఎస్ ప్రతినిధి నీరవ్ తోమర్ వెల్లడించారు.